• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిరంజీవి పోతరాజు డ్యాన్స్ వీడియో వైరల్

    హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ నిర్వహించిన ‘అలయ్ బలయ్‌’ కార్యక్రమంలో చిరు చేసిన పోతరాజు డ్యాన్‌ నెట్టింట వైరల్ అవుతోంది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో చిరు పోతరాజు కొరడా పట్టుకుని చిందులేశారు. విజయ దశమి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. మరోవైపు దసరాకు విడుదలైన చిరు సినిమా గాడ్‌ ఫాదర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. వీడియో కోసం ఇన్‌స్టాగ్రాంపై క్లిక్‌ చేయండి. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

    సల్మాన్‌కు చిరు ప్రత్యేక కృతజ్ణతలు

    ‘గాడ్‌ఫాదర్’ చిత్రం విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి ఖుషీఖుషీగా ఉన్నారు. ఈ సినిమాలో మసూమ్ భాయ్‌గా నటించిన సల్మాన్‌ఖాన్‌కు ప్రత్యేక కృతజ్ణతలు తెలిపాడు. సల్లూభాయ్ వల్లే ఈ చిత్రం ఇంత ఘనవిజయం సాధించిందని చిరు చెప్పుకొచ్చారు. కాగా చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమా ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న సంగతి తెలిసిందే. The #GodFather, Megastar @KChiruTweets thanking & Congratulating The Mighty Masoom Bhai aka @BeingSalmanKhan on the Stupendous Success. ❤️#BlockbusterGodfather ?@jayam_mohanraja #Nayanthara @ActorSatyaDev @MusicThaman … Read more

    ‘ఎందుకో అర్థం కావట్లేదు’: సురేఖ వాణి

    ప్రముఖ టాలివుడ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి ఎమోషనల్‌ అయ్యారు. ఇటీవల సినిమాల కన్నా సోషల్‌ మీడియాలోనే కనిపిస్తున్న సురేఖ…. తనకు సినిమాలు రావట్లేదని భావోద్వేగానికి లోనయ్యారు. ‘స్వాతిముత్యం’ సక్సెస్‌ మీట్‌లో ఆమె మాట్లాడారు. ‘ఇటీవల చాలా మంది నేను సినిమాలు మానేశాను అనుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు. నేను సినిమా పిల్లను, సినిమాతోనే ఉంటా. ఇటీవల అవకాశాలు రావట్లేదు. అది ఎందుకో కూడా అర్థం కావట్లేదు’ అని సురేఖ చెప్పుకొచ్చారు.

    ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకున్న పూర్ణ

    అటు సినిమాతో, ఇటు షోలతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా ఉంటుంది నటి పూర్ణ. ఇటీవలే పెళ్లికూడా సిద్దమైన ఈ చబ్బీ బ్యూటీ దసరా సందర్భంగా పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రెడిషనల్ లుక్‌లో సాంప్రదాయ అమ్మాయిగా ఉన్న పూర్ణను చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. బయటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram:

    ‘ఓ పారి’ పాప్ సాంగ్ రిలీజ్

    పాన్ ఇండియా రెంజ్‌లో కంపోజ్‌ చేసిన ‘ఓ పారి’ పాప్‌ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేశారు. తొలిసారి హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ సాంగ్‌ను DSP కంపోజ్ చేశారు. ఈ పాటక్ లిరిక్స్, ఎడిటింగ్, డ్యాన్స్ అన్ని తానై వ్యవహరించారు. సాంగ్‌లోని లిరిక్స్ బాగున్నాయి. లోకెషన్స్‌ రిచ్‌గా కనిపించాయి. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

    రావణ దహనం చేసిన ప్రభాస్

    ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జ‌రిగిన రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మంలో హీరో ప్ర‌భాస్ పాల్గొన్నారు. అక్క‌డ‌కు వ‌చ్చిన వారితో ఫొటోలు దిగ‌టంతో పాటు.. వారిచ్చిన కానుక‌ల‌ను స్వీక‌రించారు. విల్లు ఎక్కు పెట్టి బాణాన్ని సంధించి రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మం చేశారు. దర్శ‌కుడు ఓం రౌత్‌తో క‌లిసి అక్క‌డ రామ ల‌క్ష్మ‌ణులు, ఆంజ‌నేయుడు వేషం వేసుకున్న న‌టీన‌టుల‌కు హార‌తి ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ‘అప్పుడు అభిమానిని.. ఇప్పుడు అతిథిని’

    ఒకప్పుడు శిల్పాకళావేదికలో జరిగే ఈవెంట్లకు ఫ్యాన్ పాసులు దొరక్క వెనక్కి వెళ్లిపోయానని, కానీ ఇప్పుడు అదే వేదికపైకి అతిథిగా వచ్చానని హీరో నవీన్ పొలిశెట్టి అన్నారు. దీనికి కారణం తెలుగు ప్రేక్షకులేనని చెప్పారు. ‘స్వాతిముత్యం’ ప్రి రిలీజ్ వేడుకకు నటుడు సిద్ధు జొన్నలగడ్డతో కలసి నవీన్ హాజరయ్యారు. నటీనటులపై ప్రేమాభిమానాలు కురిపించి సినిమాలను విజయవంతం చేసేది ప్రేక్షకులేనని పేర్కొన్నారు. మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాని చెప్పారు. ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మతో కలసి ‘చిట్టి నీ నవ్వంటే’ పాటకు డ్యాన్స్ వేసి అలరించారు.

    అమెరికాలో ‘జక్కన్న’ సందడి

    అమెరికాలోని ఓ సినిమా థియేటర్‌లో దర్శకుడు రాజమౌళి సందడి చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రదర్శితమవుతున్నథియేటర్‌లోకి జక్కన్న అడుగు పెట్టగానే అక్కడున్న ప్రేక్షకులు కేరింతలు కొడుతూ స్వాగతం పలికారు. ‘‘ ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలపై, నాపై ఇంత అభిమానం, ప్రశంసలు కురిపించడం ఆనందంగా ఉంది’’ అంటూ రాజమౌళి దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. You deserve all the applause you’re getting and much more Jakkanna @ssrajamouli https://t.co/jMbSlGuobS — Jr NTR … Read more

    అమెరికాలో రాజమౌళికి ఘన స్వాగతం

    అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో RRR బియాండ్ ఫెస్ట్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన RRR మూవీ దర్శకుడు, దర్శక ధీరుడు రాజమౌళికి ఘన స్వాగతం లభించింది. రాజమౌళి ఆడిటోరియంలో వెళ్ళగానే అక్కడ ఉన్నవారంతా స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి రాజమౌళి పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన [వీడియో](url) వైరల్ అవుతుంది. SS Rajamouli gets a rapturous, long standing ovation after #RRR at #BeyondFest pic.twitter.com/KGBKlCZeVR — eric (@MrEAnders) October 1, 2022

    LIVE: అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవం

    దివంగత కమెడియన్ అల్లు రామలింగయ్య శతజయంతిని పురష్కరించుకొని నిర్మాత అల్లు అరవింద్ అల్లు స్టూడియోస్ నిర్మించారు. నేడు ఈ స్టూడియోను ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు అరవింద్ సహా పలువురు సెలెబ్రిటీలు హాజరయ్యారు. https://youtube.com/watch?v=DfZZTTQiTRo