• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎడారిలో ఆమ్లేట్లు వేస్తున్న రామ్ చరణ్

    జపాన్‌ వెకేషన్ ముగించున్న హీరో రామ్‌చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఆఫ్రికా టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.కెన్యాలోని జనావాసాలకు దూరంగా..అడవి జంతువులు, వన్యప్రాణులు, క్రూరమృగాలు ఉండే ప్రాంతంలో విహార యాత్ర చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అక్కడి స్థానికులను జీప్‌లో ఎక్కించుకొని తానే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాడు. వన్యప్రాణుల్ని కెమెరాలో బంధిస్తున్నాడు.ఎడారి ప్రాంతంలో కోడి గుడ్లతో స్వయంగా తానే ఆమ్లేట్లు వేసి వడ్డిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on … Read more

    ఈమె నిజంగా సమంతనేనా?

    స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ లుక్స్ చూసి నెటిజన్లు బిత్తరపోతున్నారు. తాజాాగా ఓ ప్రకటనలో సామ్‌ను చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇందులో సమంత ఇంతకుముందు కంటే ఇప్పుడు కాస్త భిన్నంగా కనపడుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా ఇటీవలే సామ్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిందంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో సమంత లుక్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. View this post on Instagram A post shared by Drools (@droolsindia)

    ఎగ్జిబిటర్లకు పూరీ స్ట్రాంగ్‌ రిప్లై

    ‘లైగర్‌’ సినిమా నష్టాలపై పూరీ జగన్నాథ్ ఆఫీసు ముందు ఈ నెల 27న ధర్నా చేయాలని 83 మంది ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. దీనిపై పూరీ జగన్నాథ్‌ ఘాటుగా స్పందించారు. తాను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకున్నా తాను తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానని, అయినా ధర్నా చేసి నా పరువు తీస్తామంటే ఎవడికీ ఒక్క రూపాయి ఇవ్వనని తేల్చిచెప్పారు. పోకిరి నుంచి ఇస్మార్ట్ శంకర్‌ వరకు తనకు చాలా వసూలు కావాల్సిఉందని కానీ తాను ఏనాడు ఇంత రచ్చ చేయలేదన్నారు. ఎగ్జిబిటర్ల తీరుపై మండిపడుతున్న … Read more

    దీపావళి.. 18ట్వీట్లు చేసిన RGV

    దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లతో తనదైన శైలిలో దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. దాదాపు 18 ట్వీట్లు చేసి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాడు. ‘చీకటిపై వెలుగు సాధించిన విజయమే దీపావళి అయితే.. సూర్యుడికి ప్రతిరోజూ దీపావళే కదా?’ అంటూ ఓ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ‘ఈ దీపావళి సందర్భంగా దేవుడు మీకు దీర్ఘాయుష్షును ప్రసాదించాలి. ఒకవేళ మీరు జబ్బుపడినా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం జరిగేలా చూడాలని కోరుతున్నా’ అంటూ మరో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. Tweets by RGVzoomin

    కుమార్తెను మెచ్చుకున్న మహేశ్ బాబు

    సూపర్ స్టార్ మహేశ్ బాబు మరోసారి తన కుమార్తె సితారను మెచ్చుకున్నాడు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సితార.. తాజాగా దీపావళి సందర్బంగా తాను నాట్యం చేస్తున్న వీడియోని ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇదే వీడియోని షేర్ చేస్తూ ‘నా నమ్మకాన్ని నిలబెట్టడంలో, గర్వపడేలా చేయడంలో నువ్వెప్పుడూ ఫెయిల్ కాలేదు’ అంటూ మహేశ్ పోస్టు చేశాడు. తన గురువు మహతీ భిక్షుతో కలిసి చేసిన క్లాసికల్ డ్యాన్స్ వీడియోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీడియో చూడటానికి Watch On గుర్తుపై క్లిక్ … Read more

    సైనికులతో ఉత్సాహంగా రౌడీబాయ్

    దీపావళి సందర్భగా ఓ ఛానల్ నిర్వహిస్తున్న ‘జై జవాన్’ కార్యక్రమంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పాల్గొన్నాడు. ఇందులో భాగంగా వివిధ క్రీడలు ఆడుతూ ఉత్సాహ పరిచాడు. సైనికులతో కలిసి టగ్ ఆఫ్ వార్ ఆడాడు. వాలీబాల్ గేమ్‌లో పాల్గొని అలరించాడు. కాసేపు షూటింగ్ చేశాడు. అంతేకాకుండా ఓ రాత్రి మొత్తం సైనికులతో కలిసి పెట్రోలింగ్ చేయనున్నాడు. లైగర్ పరాజయం తర్వాత విజయ్ దేవరకొండ ఇలా ఉత్సాహంగా కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. #NDTVExclusive … Read more

    చరణ్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డ జపనీస్

    జపనీస్ అభిమానులకు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడు. చరణ్ ఆటోగ్రాఫ్ కోసం జపాన్ ఫ్యాన్స్ ఎగబడ్డారు. వారందరికీ ఎంతో ఓపికతో, వారు తెచ్చుకున్న పుస్తకాలపై సంతకాలు చేశాడు. రామ్‌చరణ్ తమకు ఆటోగ్రాఫ్ ఇచ్చాడని జపనీస్ మురిసిపోయారు. కాగా రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఈ నెల 21న జపాన్‌లో విడుదలైంది. చిత్ర ప్రమోషన్లకు సంబంధించి రామ్‌చరణ్ జపాన్ వెళ్లారు. https://youtube.com/watch?v=GhqRRaHxlR8

    జవాన్లతో ‘రౌడీ’ విజయ్‌ దీపావళి సంబరాలు

    టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ భారత సైనికులతో సరదాగా గడిపారు. సైనిక జాకెట్ ధరించి, గన్ చేతబట్టి పాయింట్ రేంజ్‌లో కాల్పులు జరపడంపై జవాన్లను అడిగి తెలుసుకున్నాడు. సైనికులతో కలసి వాలీబాల్ ఆడి వారిలో ఉత్తేజం నింపాడు. ‘వాట్ లగాదేంగే’ అంటూ తన సినిమా డైలాగులు చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ఈ నెల 24, 25న దీపావళి సందర్భంగా ఎన్‌డీటీవీలో ప్రసారం కానుంది. కాగా విజయ్ నటించిన ‘లైగర్’ ఇటీవల విడుదలై పరాజయం పాలైన సంగతి తెలిసిందే. #JaiJawan on NDTV … Read more

    ఎయిర్‌పోర్ట్‌లో భార్గవ్‌రామ్ సందడి

    టాలీవుడ్ స్టార్ నటుడు జూ.ఎన్టీఆర్, ఆయన కుమారుడు భార్గవ్‌రామ్‌ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేశారు. తన కుమారుడు భార్గవ్‌రామ్‌ చేయి పట్టుకుని లోపలికి వెళ్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ నెల 21న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జపాన్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనడానికి జూ.ఎన్టీఆర్ కుటుంబంతో సహా హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు. మరోవైపు రాజమౌళి కుటుంబం, రాంచరణ్ దంపతులు కూడా జపాన్ వెళ్లారు. View this post on Instagram A post shared by … Read more

    ‘సరోగసీ పుకార్లకు చెక్’

    సరోగసీ ద్వారా పిల్లల్ని కన్నారన్న పుకార్లకు సింగర్ చిన్మయి శ్రీపాద చెక్ పెట్టారు. బేబీ బంప్‌తో ఒక సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కవల పిల్లలకు పాలు ఇస్తున్న ఫొటోలు కూడా షేర్ చేసుకుంది. దీంతో పాటు తన అభిప్రాయాలను కూడా వీడియో రూపంలో పంచుకుంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ సరోగసీ అంటూ కారుకూతలు కూసిన వాళ్లంతా ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోండి’’ అంటూ ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు.   Screengrab Instagram: CHINMAYI    Screengrab … Read more