పూజగది ఉందని గుడికెళ్ళడం మానేస్తామా: ప్రభాస్
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘సీతారామం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరిగింది. ఈ ఈవెంట్‌కు హాజరైన ప్రభాస్ మూవీ గురించి మాట్లాడాడు. ‘సీతారామం’ మూవీ థియేటర్లలోనే చూడాల్సిన సినిమా అని పేర్కొన్నాడు. ఇంట్లో పూజగది ఉందని, గుడికెళ్ళడం మానేస్తామా ?. అలానే ఓటీటీలో వస్తుందని థియేటర్లలో చూడకుండా ఉంటామా అని పేర్కొన్నారు. ఈ సినిమా కోసం మూవీ యూనిట్ చాలా కష్టపడిందని, అందుకు ప్రతిఫలం దక్కాలని కోరాడు.