ఒరు అదార్ లవ్’ సినిమాలోని వింక్ సీన్ ద్వారా ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది ప్రియా వారియర్. కన్నులతో ఆమె చేసిన మ్యాజిక్ ఇప్పటికీ కుర్రాళ్ల గుండెళ్లో గిలిగింతలు పెడుతూనే ఉంది. తాజాగా ఈ కలువ కన్నుల భామ తనలోని మరో యాంగిల్ ను బయటపెట్టింది.రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర మూవీలోని’కేసరియా’ లవ్ సాంగ్ ను పాడింది. తాను పాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పాట పాడుతున్నంత సేపు తనలో తాను తన్మయత్వానికి లోనైంది. తనదైన రీతిలో చక్కగా హావభావాలు పలికిస్తూ వినసొంపుగా సాంగ్ ను హమ్ చేసింది.
హిందీ రాకపోయినా అదరగొట్టావ్..
తాను పాడిన పాటకు ఈ మలయాళ కుట్టి క్యాప్షన్ కూడా ఇచ్చింది: “ఇష్క్ హై పియా” అనే పదాన్ని జోడిస్తూ పోస్ట్ చేసింది. హిందీ రాకపోయినా అద్భుతంగా పాడావు అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సూపర్ వాయిస్ అంటూ అభినందిస్తున్నారు. ఈ పాటను తమిళ్, తెలుగు వెర్షన్‌లో సిద్ శ్రీరామ్ పాడగా.. హిందీలో అర్జిత్ సింగ్ పాడాడు.
95 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన కేసరియా(Kesariya)
కేసరియా రొమాంటిక్ సాంగ్ ను అలియా భట్, రణబీర్ కపూర్‌లపై చిత్రీకరించారు. ఈ ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండవుతోంది. యూట్యూబ్ లో 95మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది. బ్రహ్మస్త్ర మూవీ సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో నాగార్జున, డింపుల్ కపాడియా, మౌని రాయ్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
శ్రీదేవి బంగ్లాలో ప్రియా వారియర్
మరోవైపు ప్రియా వారియర్ ఇండస్ట్రీలో పెద్దగా హిట్లు లేకపోయినా తన గ్లామరస్ యాటిట్యూడ్ తో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తెలుగులో తేజ సజ్జా సరసన ఇష్క్ మూవీలో ప్రియాంక వారియర్ నటించిన విషయం తెలిసిందే. నితిన్ నటించిన చెక్ మూవీలోనూ కెమియో రోల్ చేసి మెప్పించింది. ప్రస్తుతం హిందీలో వస్తున్న శ్రీదేవి బంగ్లా చిత్రంలో నటిస్తోంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం