• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Oscar Award Winning Movies 2024: ఆస్కార్‌ గెలిచిన ఈ సినిమాలు ఎందుకు చూడాలంటే?

    సాధారణంగా అవార్డ్ విన్నింగ్ సినిమా అంటే సినీ ప్రేమికులు చూసేందుకు ఇష్టపడతారు. ఇక ఆస్కార్ దక్కించుకున్న సినిమా అంటే వారి ఆసక్తి ఇక ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయా చిత్రాలు అవార్డు సాధించేంత స్పెషాలిటీ ఆ సినిమాల్లో ఏముందోనని తెలుసుకునేందుకు వారు తెగ వెతికేస్తుంటారు. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అంగరంగ వైభవంగా అస్కార్‌ వేడుకలు జరిగాయి. ఇందులో 10 చిత్రాలు వివిధ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఆయా చిత్రాల విశేషాలను YouSay మీ ముందుకు తెచ్చింది. … Read more

    Gaami Weekend Collections: బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోన్న ‘గామి’.. 3 రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే?

    విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో విడుదలైన తాజా చిత్రం ‘గామి’ (Gaami). శివరాత్రి కానుకగా శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ‘గామి’ సినిమా బాక్సాఫీస్ విజృంభిస్తోంది. విశ్వక్ సేన్ గత చిత్రాలతో పోలిస్తే ఇది అద్భుతమైన వసూళ్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు ఆరేళ్ల పాటు చిత్ర యూనిట్‌ ఈ సినిమా కోసం శ్రమించగా వాటి తాలూకా ఫలితాలు ప్రస్తుతం లభిస్తున్నాయి. వీకెండ్‌ అయ్యేసరికి ఈ సినిమా కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయి? ఈ చిత్రం లాభాల్లోకి అడుగుపెట్టిందన్న … Read more

    This Week OTT movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలోకి ‘హనుమాన్‌’ సహా 24 చిత్రాలు!

    గత కొన్ని వారాలుగా స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఏకంగా పదికి పైగా చిన్న హీరోల చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు వెయ్‌ దరువెయ్‌ ప్రముఖ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ సోదరుడు సాయిరాం శంకర్‌ హీరోగా చేసిన లేటెస్ట్‌ చిత్రం … Read more

    New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!

    శివరాత్రి సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్‌ ముందుకు తీసుకొచ్చాయి. శివరాత్రి స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.   కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతున్న ‘కల్కి 2898 … Read more

    Bhimaa Day 1 Collections: ‘గామి’తో పోలిస్తే చతికిలపడ్డ ‘భీమా’.. తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

    మాచో స్టార్ గోపిచంద్ (Gopichand) హీరోగా మాళవిక శర్మ (Malavika Sharma), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్లుగా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష (A. Harsha) రూపొందించిన చిత్రం ‘భీమా’ (Bhimaa). ప్రముఖ నిర్మాత కేకే రాధా మోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్, ముఖేష్ తివారీ, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, వీకే నరేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మార్చి 8వ తేదీన మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. … Read more

    Gaami Day 1 Collections: విష్వక్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌.. ‘గామి’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?

    విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. చాందినీ చౌదరి కథానాయికగా చేసింది. మార్చి 8న శివరాత్రి కానుకగా రిలీజైన ఈ చిత్రం మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. కెరీర్‌ బెస్ట్‌ నటనతో విశ్వక్‌ సేన్‌ ఆకట్టుకున్నట్లు కథనాలు కూడా వచ్చాయి. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. అదే స్థాయిలో పాజిటివ్‌ రెస్పాన్స్‌ సాధించడంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ మూవీకి తిరుగుండదని … Read more

    Hanuman Movie: ‘హనుమాన్‌’ టీమ్‌ డబుల్ ధమాకా.. నిరాశలో తెలుగు ఆడియన్స్‌!

    టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja), ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘హనుమాన్’ (Hanuman). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. భారీ కలెక్షన్స్ రాబట్టి ఎవరూ ఊహించని విధంగా అందరి మెప్పు పొందింది. అయితే ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలై దాదాపు 2 నెలలు పూర్తి కావొస్తున్నా ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. దీంతో హనుమాన్ ఎప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌లోకి వస్తుందా అని ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. … Read more

    Shivarathri: శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు… సినిమా లింక్‌లు ఇవిగో..

    శివరాత్రికి ఉండే ప్రత్యేకతే వేరు. ఈ రోజున భక్తి పరవశులై హిందువులు ఆధ్యాత్మికతలో మునిగి తేలుతారు. నీలకంఠేశుడిపైనే మనసు, తనువు లగ్నం చేసి నిష్ఠతో గడుపుతారు. శివరాత్రి రోజున ఉపవాస నియమాన్ని పాటించేవారు జాగారం చేస్తుంటారు. ఈ పవిత్ర రాత్రి సమయంలో మెలుకువతో ఉండి జీవితంలోని చీకట్లను తొలగించుకోవాలని చెబుతుంటారు. శివరాత్రి రోజున జాగారం కీలక ఘట్టం. ఈ సమయాన్ని కొందరు భజనకు కేటాయిస్తే మరికొందరు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకొందరు సినిమాలు చూస్తుంటారు. ప్రస్తుతం డిజిటల్ యుగంగా మారినందున చాలామంది ఫోన్‌లోనే సినిమాలు చూసేస్తున్నారు. … Read more

    SSMB 29: రాజమౌళి సినిమాలో మహేష్‌ బాబు ఫైనల్ లుక్ ఇదేనా? 

    సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా ఎప్పుడు మెుదలవుతుందోనని అటు మహేష్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు కూడా చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. కాగా, ప్రస్తుతం ‘SSMB29’ చిత్రానికి సంబంధించిన ప్రీ పొడక్షన్‌ పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయి. ఈ వర్స్క్‌లోనే మూవీలో మహేష్‌ లుక్‌ ఏ … Read more

    Kalki 2898 AD: శివరాత్రి స్పెషల్‌.. సాలిడ్‌ అప్‌డేట్‌తో ముందుకొస్తున్న ‘కల్కీ’ టీమ్‌!

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ కాంబినేష్‌లో రూపొందుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). మైథాలజీ ఇన్‌స్పైర్డ్‌ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో అంచనాలు మరింత హైప్‌లోకి వెళ్లాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ … Read more