• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Shivarathri: శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు… సినిమా లింక్‌లు ఇవిగో..

    శివరాత్రికి ఉండే ప్రత్యేకతే వేరు. ఈ రోజున భక్తి పరవశులై హిందువులు ఆధ్యాత్మికతలో మునిగి తేలుతారు. నీలకంఠేశుడిపైనే మనసు, తనువు లగ్నం చేసి నిష్ఠతో గడుపుతారు. శివరాత్రి రోజున ఉపవాస నియమాన్ని పాటించేవారు జాగారం చేస్తుంటారు. ఈ పవిత్ర రాత్రి సమయంలో మెలుకువతో ఉండి జీవితంలోని చీకట్లను తొలగించుకోవాలని చెబుతుంటారు. శివరాత్రి రోజున జాగారం కీలక ఘట్టం. ఈ సమయాన్ని కొందరు భజనకు కేటాయిస్తే మరికొందరు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకొందరు సినిమాలు చూస్తుంటారు. ప్రస్తుతం డిజిటల్ యుగంగా మారినందున చాలామంది ఫోన్‌లోనే సినిమాలు చూసేస్తున్నారు. అయితే, శివరాత్రి రోజున ఆధ్యాత్మికకు సంబంధించిన సినిమాలను చూడాలని భావించే వారు వీటిని ట్రై చేయొచ్చు. 

    భూ కైలాస్

    అలనాటి సినిమా అయినప్పటికీ నేటికీ కొత్త అనుభూతిని కలిగించే సినిమా ఇది. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ల కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా. రావణాసురుడి పాత్రలో ఎన్టీఆర్ నటించారు. శివరాత్రికి మీకు తప్పకుండా మంచి అనుభూతిని అందిస్తుంది. 

    భక్త కన్నప్ప

    1976లో వచ్చిన భక్తిరస చిత్రమే ‘భక్త కన్నప్ప’. శివుడి భక్తుడి పాత్రలో దివంగత కృష్ణం రాజు నటించారు. భక్త కన్నప్పగా  ఆ పాత్రకు జీవం పోశారు. ఇది కూడా శివరాత్రి రోజున చూడదగిన సినిమానే.

    మహా శివరాత్రి

    సాయికుమార్, రాజేంద్రప్రసాద్ కలిసి నటించిన సినిమా ఇది. మీనా ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. రేణుక శర్మ దర్శకత్వం వహించారు. 

    శ్రీ మంజునాథ

    శివరాత్రి సినిమాలనగానే వెంటనే ఈ సినిమా పేరే గుర్తొస్తుంది. అంతలా ఫేమస్ అయ్యింది ఈ సినిమా. నాస్తికుడు శివుడి భక్తుడిగా ఎలా మారాడో ఈ సినిమాలో చూపిస్తారు. భక్తుడిగా అర్జున్, శంకరుడిగా చిరంజీవి నటించారు. అర్జున్ సరసన సౌందర్య కీలక పాత్ర పోషించింది. 

    జగద్గురు ఆదిశంకర

    ఆదిశంకరాచార్యుల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పూర్తిగా ఆధ్యాత్మిక బాటలో సాగుతుందీ సినిమా. నాగార్జున, సాయికుమార్, మోహన్ బాబు, కమలిని ముఖర్జీ తదితరులు కీలక పాత్ర పోషించారు. శంకరచార్యులుగా కౌశిక్ బాబు నటించాడు.

    ఈ సినిమాలను చూసి మీలోని ఆధ్యాత్మిక భావాన్ని మరింత రెట్టింపు చేసుకోండి. శివరాత్రి జాగారాన్ని ఫలప్రదం చేయండి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv