• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!

    శివరాత్రి సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్‌ ముందుకు తీసుకొచ్చాయి. శివరాత్రి స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.  

    కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)

    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’ నుంచి శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్‌ రిలీజైంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ పేరును పోస్టర్‌ ద్వారా మూవీ టీమ్‌ తెలియజేసింది. ప్రభాస్‌ పాత్ర పేరును భైరవగా ప్రకటిస్తూ భవిష్యత్తుకు చెందిన కాశీ వీధుల నుంచి భైరవని పరిచయం చేస్తున్నాం’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. 

    కన్నప్ప (Kannappa)

    మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కన్నప్ప ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. విల్లు గురిపెట్టిన కన్నప్పగా విష్ణు ఈ పోస్టర్‌లో కనిపించాడు. కాగా, ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    NBK109

    నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ కాంబోలో వస్తున్న ‘NBK 109’ చిత్రం నుంచి క్రేజీ గ్లింప్స్‌ విడుదలైంది. యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొందించిన గ్లింప్స్‌లో బాలయ్యను బాబీ ‘నేచురల్ బోర్న్ కింగ్’ (NBK)గా చూపించారు. గ్లింప్స్‌లో చాలా స్టైలిష్ లుక్‌లో బాలయ్య అదరగొట్టారు. ఈ చిత్రంలో బాలయ్య క్యారెక్టర్ చాలా వైలెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. 

    ఓదెల 2 (Odela 2)

    తమన్నా (Tamannaah Bhatia) లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్‌ హెబ్బా పటేల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో డైరెక్టర్‌ సంపత్‌ నంది క్రియేటర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో తమన్నా కనిపించింది.

    షరతులు వర్తిస్తాయి! (Sharathulu Varthisthai)

    చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం నుండి కూడా శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్‌ విడుదలైంది. ‘ఈ దేశంలోని 80% మంది సామాన్యుల కథనే మన సినిమా’ అంటూ మేకర్స్‌ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని స్టార్‌ లైట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, డాక్టర్‌ కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మించారు.

    ‘దేవకీనందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)

    తొలి సినిమాతోనే హీరోగా ఆకట్టుకున్న మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) చేస్తున్న రెండో సినిమా ‘దేవకీనందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం చేస్తున్నారు. హనుమాన్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. కాగా, మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్ర యూనిట్‌ ఓ స్పెషల్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌ నెట్టింట ట్రెండ్ అవుతోంది. 

    గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi)

    హీరోయిన్ అంజలి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వ‌చ్చిన ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. శుక్రవారం శివరాత్రితో పాటు ‘ఉమెన్స్‌ డే’ కూడా కావడంతో దానికి గుర్తుగా ఇందులోని అంజలి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా నటిస్తుండగా సత్యం రాజేష్‌, షకలక శంకర్‌, అలీ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

    శ్రీరంగ నీతులు (Sri Ranga Neethulu)

    సుహాస్ హీరోగా ప్రవీణ్‌ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘శ్రీరంగ నీతులు’. ఈ సినిమాలో కార్తిక్‌ రత్నం మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మహా శివరాత్రి సందర్భంగా స్పెషల్ లుక్ పోస్టర్‌ విడుదలైంది. సుహాస్‌, కార్తిక్‌ రత్నంతో పాటు నటి రుహాని శర్మ పోస్టర్‌లో కనిపించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్‌ కానుంది.

    గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి (Gangs Of Godavari)

    విశ్వక్‌సేన్‌  హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ వంటి సినిమాలు తీసిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి  ఫీమేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా  మేకర్స్‌ అంజలికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోస్టర్‌ను రిలీజ్ చేశారు. 

    సత్యభామ (Sathyabhama)

    స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘సత్యభామ’. అఖిల్‌ డేగల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఆరమ్‌ ఆర్ట్స్‌ పతాకంపై బాబీ, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదలైంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv