ఒకప్పుడు ఫ్యామిలీతో సినిమా కెళ్లాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయంగా ఉండేది. అయితే ఓటీటీ రాకతో ఆ బాధ తప్పింది. కుటుంబం మెుత్తం వీకెండ్‌లో ఎంచక్కా ఇంట్లోనే సినిమాలు చూసేయచ్చు. అయితే ఓటీటీలో క్రైమ్, కామెడీ, హార్రర్, సస్పెన్స్ ఇలా జానర్లే ఉన్నాయి. వీటిలో కొన్ని ఫ్యామిలీ చూసేందుకు వీలుగా ఉండకపోవచ్చు. అటువంటి వారి కోసమే ఈ YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. గత పదేళ్లలో వచ్చిన టాప్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను మీ ముందుకు తీసుకొచ్చింది. ఈ సినిమాలను మీ ఫ్యామిలీతో చూసి చక్కగా ఎంజాయ్ చేయండి.
Contents
- 1 మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys)
- 2 ఫ్యామిలీ స్టార్ (Family Star)
- 3 ఓం భీమ్ బుష్ (Om Bheem Bush)
- 4 కథ వెనుక కథ (Katha Venuka Katha)
- 5 హనుమాన్ (HanuMan)
- 6 12 ఫెయిల్ (12th Fail)
- 7 అంబాజీపేట మ్యారేజీ బ్యాండు (Ambajipeta Marriage Band)
- 8 నా సామి రంగ ( Naa saami Ranga)
- 9 గుంటూరు కారం (Guntur Kaaram)
- 10 సైంధవ్ (Saindhav)
- 11 నెరు (Neru)
- 12 సలార్ (Salaar)
- 13 హాయ్ నాన్న (Hi Nanna)
- 14 రంగ మార్తాండ (Ranga Maarthaanda)
- 15 రైటర్ పద్మభూషణ్ (Writer Padmabhushan)
- 16 సార్ (Sir)
- 17 F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (F3: Fun and Frustration)
- 18 ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Johaarlu)
- 19 టక్ జగదీష్ (Tuck Jagadish)
- 20 గామి (Gaami)
- 21 భూతద్దం భాస్కర్ నారాయణ (Bhoothaddam Bhaskar Narayana)
- 22 కీడా కోలా (Keedaa Cola)
- 23 భగవంత్ కేసరి (Bhagavanth Kesari)
- 24 చిన్నా (Chinna)
- 25 స్కంద (Skanda)
- 26 మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Miss Shetty Mr Polishetty)
- 27 బెదురులంక 2012 (Bedurulanka 2012)
- 28 గదర్ 2 (Gadar 2)
- 29 బ్రో (Bro)
- 30 రంగబలి (Rangabali)
- 31 సామజవరగమన (Samajavaragamana)
- 32 విమానం (Vimanam)
- 33 దసరా (Dasara)
- 34 బలగం (Balagam)
- 35 వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)
- 36 వీర సింహారెడ్డి (Veera Simha Reddy)
- 37 ధమాకా (Dhamaka)
- 38 గాడ్ ఫాదర్ (Godfather)
- 39 ఒకే ఒక జీవితం (Oke Oka Jeevitham)
- 40 సీతారామం (Sita Ramam)
- 41 అంటే సుందరానికి (Ante Sundaraniki)
- 42 భీమ్లా నాయక్ (Bheemla Nayak)
- 43 శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy)
- 44 వివాహా భోజనంబు (Vivaha Bhojanambu)
- 45 రాజరాజ చోర (Raja Raja Chora)
- 46 SR కళ్యాణ మండపం (SR Kalyana Mandapam)
- 47 వకీల్ సాబ్ (Vakeel Saab)
- 48 సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru)
- 49 శ్రీకారం (Sreekaram)
- 50 జాతిరత్నాలు (Jathi Ratnalu)
- 51 ఆకాశం నీ హద్దురా (Aakasam Nee Haddu ra)
- 52 కలర్ ఫొటో (Colour Photo)
- 53 ఉమామహేశ్వర ఉగ్రరూపస్య (Uma Maheswara Ugra Roopasya)
- 54 అలా వైకుంఠపురంలో (Ala Vaikuntapurramloo)
- 55 అరవింద సమేత (Aravinda Sametha)
- 56 శ్రీమంతుడు (Srimanthudu)
- 57 శతమానం భవతి (Sathamanam Bhavathi)
- 58 మనం (Manam)
- 59 గోవిందుడు అందరి వాడేలే (Govindudu Andarivadele)
మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys)
మలయాళం సెన్సేషన్ మంజుమ్మెల్ బాయ్స్.. రీసెంట్‌గా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మలయాళంతో తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఈ మూవీ కథ ఏంటంటే.. కేరళ కొచ్చికి చెందిన కుట్టన్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్కడ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావడానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ.
ఫ్యామిలీ స్టార్ (Family Star)
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా చేసిన లేటెస్ట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. థియేటర్‌లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. ఏప్రిల్ 26 నుంచి అమెజాన్‌లో వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఓటీటీలో ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. ‘గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) కుటుంబ బాధ్యతలను మోస్తూ చాలి చాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఇలా సాగుతున్న అతడి జీవితంలోకి ఇందు (మృణాల్ ఠాకూర్) వస్తుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఓ రోజు ఇందు రాసిన ఓ పుస్తకం గోవర్ధన్ చేతికందుతుంది. ఇంతకీ ఆ పుస్తకంలో ఏం ఉంది? అది వారి ప్రేమను ఎలా ప్రభావితం చేసింది? అసలు ఇందు ఎవరు? కుటుంబ కష్టాల నుంచి గోవర్ధన్ గట్టెక్కాడా లేదా?’ అన్నది కథ.
ఓం భీమ్ బుష్ (Om Bheem Bush)
శ్రీవిష్ణు హీరోగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్‌లో నటించిన ‘ఓం భీమ్ బుష్’.. శ్రీవిష్ణు కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ ఫిల్మ్ ప్రస్తుతం అమెజాన్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. క్రిష్, వినయ్, మాధవ్ సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? దెయ్యం ఉన్న కోటలో వీరు ఎందుకు అడుగుపెట్టారు? కోటలో వీరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నది కథ.
కథ వెనుక కథ (Katha Venuka Katha)
విశ్వంత్ హీరోగా కృష్ణ చైతన్య డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘కథ వెనుక కథ’. మార్చి 28న ఈ సినిమాను ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. మూవీ ప్లాట్ ఏంటంటే.. ‘సినిమా డైరెక్టర్ కావాలనుకున్న ఓ యువకుడి కథ ఇది. తాను తీసిన సినిమాలోని నటీనటులంతా విడుదలకు ముందు ఒక్కొక్కరు మిస్ అవుతారు. అందులో ఒక యాక్టర్ మరణిస్తాడు. కేసు విచారణలో సంచలన విషయాలు తెలుస్తాయి. ఇంతకు నటీనటులు ఎలా మిస్ అయ్యారు. విచారణలో తేలిన సంచలన విషయాలు ఏమిటి?’ అనేది మిగతా కథ
హనుమాన్ (HanuMan)
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం (New Releases On OTT Today Telugu) జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా తేజ సజ్జ ఇందులో హీరోగా చేశాడు. ఓటీటీ వేదిక ‘జీ 5’లో ఈ మూవీ స్ట్రీమింగ్‌లో ఉంది. ప్లాట్ ఏంటంటే.. సౌరాష్ట్రలో ఉండే మైఖేల్ (వినయ్ రాయ్) చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ.
12 ఫెయిల్ (12th Fail)
బాలీవుడ్‌లో సన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం హాట్‌స్టార్ వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్‌లో ఉంది. మనోజ్ కుమార్ అనే ఐపీఎస్ అధికారి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.
అంబాజీపేట మ్యారేజీ బ్యాండు (Ambajipeta Marriage Band)
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ వరుస హిట్లతో దూసుకుళ్తున్నాడు. ఇటీవల అతడు చేసిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆహాలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ‘మల్లి (సుహాస్) అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో సభ్యుడు. అక్క పద్మ (శరణ్య ప్రదీప్) స్కూల్ టీచర్. ఓ కారణం చేత ఊరి మోతుబరి వెంకట్‌బాబు – మల్లికీ మధ్య వైరం మొదలవుతుంది. అది పెద్దదై ఊర్లో గొడవలకు దారి తీస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? లక్ష్మి (శివాని నాగారం), మల్లిల ప్రేమ కథ ఏంటి?’ అన్నది కథ.
నా సామి రంగ ( Naa saami Ranga)
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన నాగార్జున చిత్రం ‘నా సామి రంగ’ (New Telugu Movie 2024 OTT) . ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్. హాట్‌స్టార్‌లో ఈ ఫిల్మ్ స్ట్రీమింగ్‌లో ఉంది. మూవీ ప్లాట్ ఏంటంటే.. ఒక ఊరిలో రంగా(నాగార్జున) స్నేహితులతో కలిసి సరదాగా జీవనం సాగిస్తుంటాడు. అవసరం ఉన్నవారికి సాయం చేస్తుంటాడు. అలాంటి రంగాకి ఆ ఊరిలో కొంతమంది పెద్ద మనుషులతో గొడవ ఏర్పడుతుంది. ఇదే సమయంలో తన స్నేహితులు అయిన అంజి (అల్లరి నరేష్), భాస్కర్ (రాజ్ తరుణ్) చేసిన ఒక పని వల్ల ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులకి నష్టం ఏర్పడుతుంది. దీంతో ఆ పెద్ద మనుషులు వీరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. చంపడానికి కూడా సిద్ధపడుతారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో రంగా తన స్నేహితులను ఎలా కాపాడుకున్నాడు?. వరలక్ష్మి, రంగాల మధ్య ప్రేమ ఎలా ఉంది? తన స్నేహితులను చంపాలనుకున్న దుర్మార్గులను రంగా ఏం చేశాడు అనేది మిగతా కథ.
గుంటూరు కారం (Guntur Kaaram)
మహేష్, త్రివిక్రమ్ కాంబోలో సంక్రాంతి కానుగా వచ్చిన చిత్రం ‘గుంటూరు కారం’. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా చేసింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్‌లో ఉంది. ‘రమణ (మహేష్ బాబు) చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన వల్ల అతని తల్లి వసుంధర (రమ్యకృష్ణ) అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. తల్లికి దూరంగా 25 ఏళ్లు పెరిగిన తర్వాత తిరిగి ఆమె ప్రస్తావన వస్తుంది. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు జరుగుతాయి. మరి రమణ తన తల్లిని కలిశాడా? లేదా? అసలు వసుంధర తన కొడుకును ఎందుకు దూరం పెట్టింది? ఇద్దరి మధ్య దూరానికి కారణం ఎవరు?’ అన్నది మిగతా కథ.
సైంధవ్ (Saindhav)
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన వెంకటేష్ చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా థియేటర్‌లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఓటీటీలో మాత్రం సాలీడ్ రెస్పాన్స్‌ను అందుకుంది. ‘సైంధవ్ (Venkatesh) తన పాపతో(బేబీ సారా) కలిసి చంద్రప్రస్థ అనే ఓ ఊరిలో జీవిస్తుంటాడు. ఓ రోజు పాప కళ్లు తిరిగిపడిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్తారు. పాప ప్రాణాంతక జబ్బుతో బాధపడుతుందని తెలుస్తుంది. అదే సమయంలో చంద్రప్రస్థలో టెర్రరిస్టు క్యాంప్ నడుస్తుంటుంది. సైంధవ్ ఉగ్రవాద చర్యలకు అడ్డుతగులుతాడు. అసలు ఉగ్రవాదులకు సైంధవ్‌కు ఏంటి సంబంధం? గతంలో ఏం చేశాడు? పాపని ఎలా బతికించుకుంటాడు? వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్దికీ), ఆర్య పాత్రల ప్రాధాన్యత ఏంటి?’ అన్నది మిగతా కథ.
నెరు (Neru)
మలయాళ స్టార్ మోహన్‌లాల్ లాయర్‌గా చేసిన ఈ చిత్రం.. మల్లువూడ్‌లో ఘన విజయం సాధించింది. ప్రముఖ ఓటీటీ వేదిక హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగులో అందుబాటులో ఉంది. ‘కళ్లు కనిపించని సారా మహ్మద్ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్ విజయ్ మోహన్ (మోహన్‌లాల్)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు?’ అన్నది కథ.
సలార్ (Salaar)
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ (New Telugu Movie 2024 OTT) దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘సలార్’. శ్రుతి హాసన్ హీరోయిన్. క్రిస్మస్ కానుగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. ‘ఖాన్సార్ సామ్రాజ్యానికి రాజ మన్నార్ (జగపతిబాబు) రూలర్. సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. ఖాన్సార్ పీఠం కోసం రాజ మన్నార్‌ను దొరలు సొంతంగా సైన్యం ఏర్పాటు చేసుకొని హత్య చేస్తారు. తండ్రి కోరిక మేరకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఖాన్సార్‌కు రూలర్ అవ్వాలని భావిస్తాడు. ఇందుకోసం చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్రభాస్) సాయం కోరతాడు. ఆ ఒక్కడు అంతమంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు?’ అన్నది స్టోరీ.
హాయ్ నాన్న (Hi Nanna)
హీరో నాని జెర్సీ తర్వాత తండ్రిగా నటించిన మరో చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ప్లాట్ ఏంటంటే.. విరాజ్ (నాని) ఓ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. తన కూతురు మహి(కియారా) అంటే అతడికి ప్రాణం. కూతురికి సరదాగా కథలు చెప్తుంటాడు విరాజ్. ఓ రోజు అమ్మ కథ చెప్పమంటే విరాజ్ చెప్పడు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది మహి. ఆ తర్వాత ఏం జరిగింది. మహి, యష్న (మృణాల్ ఠాకూర్) ఎలా ఫ్రెండ్స్ అయ్యారు. విరాజ్‌చెప్పిన అమ్మ కథలో వర్ష పాత్ర ఎవరిది? అన్నది కథ.
రంగ మార్తాండ (Ranga Maarthaanda)
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది. దర్శకుడు కృష్ణ వంశీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ‘రంగస్థల నాటకాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రాఘవరావు ( ప్రకాశ్ రాజ్). అతడి నటనకు మెచ్చి రంగమార్తాండ అనే బిరుదును ఇస్తారు. ఆ బిరుదుతోనే నాటకరంగం నుంచి తప్పుకొని ఆస్తిని పిల్లలకు పంచుతాడు. వారితో సంతోషమైన జీవితం గడుపుదామని భావించిన అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. రాఘవరావు స్నేహితుడు చక్రవర్తి ( బ్రహ్మానందం ) పాత్ర ఏమిటి?’ అనేది కథ.
రైటర్ పద్మభూషణ్ (Writer Padmabhushan)
యంగ్ హీరో సుహాస్ చేసిన ఈ చిత్రాన్ని కుటుంబం మెుత్తం కలిసి చూడవచ్చు. జీ 5లో అందుబాటులో ఉంది. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే.. పెద్ద రచయిత కావాలనేది భూషణ్(సుహాస్) కల. అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ పుసక్తం రాసి.. దానిని ప్రింట్ చేయించడానికి రూ.4లక్షల అప్పు చేస్తాడు. ఈ పుస్తకానికి సరైన ఆదరణ రాదు. దీంతో అందరితో చదివించడానికి భూషణ్ చాలా కష్టపడుతుంటాడు. ఈ క్రమంలో పద్మభూషణ్ పేరుతో మరో పుసక్తం విడుదలై మంచి ఆదరణను పొందుతుంది. కానీ, ఆ పుస్తకాన్ని తనే రాశానంటూ భూషణ్ చెబుతూ తిరుగుతుంటాడు. ఈ క్రమంలో ఆ పుస్తకం నచ్చి తన కూతురు సారిక(టీనా శిల్పరాజ్)ను ఇచ్చి పెళ్లి చేస్తానంటూ మేనమామ ముందుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ
సార్ (Sir)
హీరో ధనుష్, సంయుక్త మీనన్ జోడీగా చేసిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ మీ ఫ్యామిలీకి తప్పక నచ్చుతుంది. స్టోరీ ఏంటంటే.. ‘బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి’ అనేది కథ.
F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (F3: Fun and Frustration)
అత్యాశపరులైన వెంకీ, వరుణ్, తమన్నా, మెహ్రీన్, ఎస్సై రాజేంద్ర ప్రసాద్ ఓ క్రైమ్‌లో ఇరుక్కుంటారు. దాని నుంచి బయటపడేందుకు వీరికి పెద్ద మెుత్తంలో డబ్బు అవసరమవుతుంది. ఈ క్రమంలో వ్యాపారవేత్త ఆనంద్ ప్రసాద్ (మురళి శర్మ) చిన్నప్పుడే తప్పిపోయిన తన కొడుకు కోసం ప్రకటన ఇస్తాడు. దీంతో పెద్దాయన డబ్బు కోసం వారంతా ఎలాంటి నాటకం ఆడారన్నది కథ.
ఓటీటీ : సోనీ లీవ్
ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Johaarlu)
ఉమ్మడి కుటుంబంలో పెరిగిన ఒకే ఒక్క అబ్బాయి చిరంజీవి (శర్వానంద్). పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న చిరు జీవితంలోకి అనుకోకుండా ఆద్య (రష్మిక) వస్తుంది. పెళ్లంటేనే పడని ఆద్య అమ్మ వకుళ (ఖుష్బూ) వారి వివాహానికి ఒప్పుకుందా? చిరు-ఆద్య పెళ్లికి ఎదురైన సమస్యలు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ : సోనీ లీవ్
టక్ జగదీష్ (Tuck Jagadish)
భూదేవీపురం గ్రామానికి ఆదికేశవ నాయుడు (నాజర్) పెద్ద మనిషి. అతడి మరణంతో అప్పటిదాకా మంచిగా ఉన్న పెద్ద కొడుకు (జగపతిబాబు) స్వార్థపూరితంగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. అక్కలకు ఆస్తి ఇవ్వనని అడ్డం తిరుగుతాడు. ఈ క్రమంలో చిన్న కొడుకు టక్ జగదీష్ ఏం చేశాడు? అన్నలో ఎలా మార్పు తీసుకొచ్చాడు? అన్నది కథ.
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్
గామి (Gaami)
అఘోరా శంకర్ (విష్వక్ సేన్) విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటాడు. దానికి పరిష్కారం హిమాలయ పర్వతాల్లో ఉంటుందని ఓ సాధువు చెప్తాడు. దీంతో శంకర్ తన అన్వేషణ మెుదలుపెడతాడు. మరోవైపు సమాంతరంగా దేవదాసి, హ్యూమన్ ట్రైల్స్ కథ నడుస్తుంటుంది. వాటితో శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? హిమాలయాల యాత్రలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది స్టోరీ.
ఓటీటీ : జీ 5
భూతద్దం భాస్కర్ నారాయణ (Bhoothaddam Bhaskar Narayana)
ఆంధ్ర – కర్ణాటక సరిహద్దుల్లో వరుస హత్యలు జరుగుతుంటాయి. సైకో కిల్లర్ మహిళల్ని హత్య చేసి వారి తలల స్థాలంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. సవాలుగా మారిన ఈ కేసును సాల్వ్ చేయడం కోసం డిటెక్టివ్ భాస్కర్ నారాయణ రంగంలోకి దిగుతాడు. అతడు హంతకుడ్ని ఎలా పట్టుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ : ఆహా
కీడా కోలా (Keedaa Cola)
ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే… కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఓటీటీ : ఆహా
భగవంత్ కేసరి (Bhagavanth Kesari)
కొన్ని తప్పని పరిస్థితుల్లో జైలుకు వెళ్లిన భగవంత్ కేసరికి ఆ జైలు.. జైలర్ ఓ పని అప్పగిస్తాడు. తన కూతుర్ని కొంత మంది దుర్మార్గుల నుంచి రక్షించమని మాట తీసుకుంటాడు. అందుకోసం భగవంత్ కేసరి.. ఏం చేశాడు? ఆమెను స్ట్రాంగ్ చేసేందుకు ఏలాంటి పనులు చేశాడన్నది మిగతా కథ
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్
చిన్నా (Chinna)
మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో… అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ
ఓటీటీ : డిస్నీ+హాట్‌స్టార్
స్కంద (Skanda)
స్కంద స్టోరీ విషయానికి వస్తే ఓ ఊరిలో ఉండే హీరో రామ్ కుటుంబమంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అదేక్రమంలో ఆలయంలో దొంగతనం జరుగుతుంది. ఆ నింద రామ్ ఫ్యామిలీపై పడుతుంది. ఆ నిందను రామ్ చెరిపేశాడా? ఈ మధ్యలో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలైంది. హీరో మరియు విలన్‌ల మధ్య పగ ఎందుకు స్టార్ట్ అయింది.
ఓటీటీ : డిస్నీ+హాట్‌స్టార్
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Miss Shetty Mr Polishetty)
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ – నెట్‌ఫ్లిక్స్
బెదురులంక 2012 (Bedurulanka 2012)
శివ శంకర వరప్రసాద్ (కార్తికేయ) హైదరాబాద్‌లో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తుంటాడు. తన ముక్కుసూటి తనంతో జాబ్ పోగొట్టుకుంటాడు. ప్రేమించిన అమ్మాయి (నేహాశెట్టి)కోసం బెదురులంక గ్రామానికి వస్తాడు. అప్పటికే ఊర్లో యుగాంతానికి సంబంధించి వార్త భయానికి గురి చేస్తుంది. ఈక్రమంలో ఊరి ప్రెసిడెంట్(గోపరాజు రమణ)తో కలిసి బ్రహ్మణుడైన బ్రహ్మం(శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు డేనియల్(రాంప్రసాద్) పెద్ద ప్లాన్ వేస్తారు. గ్రామస్థుల వద్ద ఉన్న బంగారాన్ని కరిగించి శివలింగం, శిలువ చేసి గంగలో వదిలేస్తే యుగాంతం ఆగిపోతుందని నమ్మిస్తారు. దీనిని ఎదురించిన శివ ఊరి పెద్దల ఆటలు ఎలా కట్టించాడు అనేది కథ.
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్
గదర్ 2 (Gadar 2)
తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ.
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్
బ్రో (Bro)
మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్(పవన్ కళ్యాణ్)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథ
ఓటీటీ – నెట్‌ఫ్లిక్స్
రంగబలి (Rangabali)
శౌర్య (నాగ శౌర్య) తన సొంత ఊరు రాజవరం అంటే ఎనలేని ప్రేమ. ఆ ఊరిని వదిలి వెళ్ళడానికి ఇష్టపడడు. అయితే తండ్రి మాట విని ఉన్నత చదువు కోసం వైజాగ్ వెళ్తాడు. అక్కడ సహజ (యుక్తి తరేజా) అనే డాక్టర్‌తో ప్రేమలో పడతాడు. అయితే రావవరంలో ఓ సమస్య కారణంగా సహజ తండ్రి మురళి శర్మ వీరి ప్రేమను వ్యతిరేకిస్తాడు. ఇంతకు ఆ సమస్య ఏమిటి? శౌర్య పరిష్కరించగలిగాడా? అనేది మిగతా కథ
ఓటీటీ – నెట్‌ఫ్లిక్స్
సామజవరగమన (Samajavaragamana)
బాలు (శ్రీవిష్ణు) హైదరాబాద్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లో టిక్కెట్లు అమ్ముతుంటాడు. కానీ అతని తండ్రి (నరేష్) డిగ్రీ పూర్తి చేయాలని సూచిస్తాడు. ఓ రోజు డిగ్రీ పరీక్ష హాలులో సరయు (రెబా మోనికా జాన్)ని బాలు కలుస్తాడు. ఆ తర్వాత సరయు ఇంటికి పేయింగ్ గెస్ట్‌గా వెళ్లి బాలు ఆమెతో ప్రేమలో పడుతాడు. ఈ క్రమంలో సరయు కుటుంబం గురించి ఒక షాకింగ్ న్యూస్ తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది. ఆ సమస్యను బాలు ఎలా పరిష్కరించాడన్నది మిగతా కథ
ఓటీటీ : ఆహా
విమానం (Vimanam)
ఓ పేదింటి కుర్రాడు రాజు(మాస్టర్ ధ్రువ్)కి జీవితంలో ఒక్కసారైనా ఎక్కాలనే ఆశ ఉంటుంది. తండ్రి వీరయ్య(సముద్రఖని) వికలాంగుడు. తల్లి లేకున్నా రాజుకి ఏ లోటు రాకుండా పెంచాలని పరితపిస్తుంటాడు. సులభ్ కాంప్లెన్స్‌ని నడుపుకొంటూ జీవనాన్ని సాగిస్తుంటాడు. ఎప్పుడు విమానం గురించి అడిగినా చదువుకుంటే విమానం ఎక్కొచ్చని చెబుతూ కొడుకుని వీరయ్య ఎంకరేజ్ చేస్తాడు. ఈ క్రమంలో కొడుక్కి ఓ ప్రాణాంతక వ్యాధి ఉందనే నిజాన్ని వీరయ్య తెలుసుకుంటాడు. దీంతో ఎలాగైనా సరే పుత్రుడి కోరిక తీర్చాలని వీరయ్య ఒక్కో పైసా పోగు చేస్తాడు. ఇంతకు వీరయ్య తన కొడుకు చివరి కోరిక తీర్చాడా? అనేది మిగిలిన కథ.
ఓటీటీ : జీ 5
దసరా (Dasara)
ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం చేస్తూ.. మద్యం సేవిస్తూ అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. కానీ మరుసటి రోజు అవన్నీ మర్చిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు చిన్న నంబి ( షైన్ టామ్ చాకో) సిల్క్ బార్‌లో కూడా గొడవపడి మర్చిపోతాడు. దానిని చిన్న తంబి చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఈక్రమంలో ఓ రాత్రి ముసుగు దుండగులు ధరణి ప్రాణ స్నేహితుడిని చంపుతారు. ఇంతకు ధరణి స్నేహితుడిని చంపిందెవరు? వారిపై ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ
ఓటీటీ – నెట్‌ఫ్లిక్స్
బలగం (Balagam)
ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు.
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్
వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)
వాల్తేరు వీరయ్య( చిరంజీవి) జాలరి పేటలో ప్రజలకు దేవుడు. ఆయన మాటకు తిరుగులేదు. సముద్రపు ఒడ్డున చిరంజీవికి తెలియకుండా కొంతమంది డ్రగ్స్ రవాణా చేస్తుంటారు. వారిని ఏసీపీ విక్రమ్( రవితేజ) అరెస్ట్ చేస్తాడు. అడ్డుపడిన చిరంజీవిని కూడా లాకప్‌లో వేస్తాడు. చిరంజీవి జైళ్లో ఉన్న సమయంలో అనుకోని విషాదం ఎదురవుతుంది. ఆ విషాధానికి కారణం ప్రకాశ్ రాజ్ అని తెలుసుకుని పోలీస్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్‌తో కలిసి చిరంజీవి మలేషియా వెళ్తాడు. ఆ విషాదం ఏమిటి అనేది కథ
ఓటీటీ – నెట్‌ఫ్లిక్స్
వీర సింహారెడ్డి (Veera Simha Reddy)
వీర సింహా రెడ్డి చిత్రంలో బాలయ్య తండ్రి కొడుకుల పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశారు. వీరసింహారెడ్డి (సీనియర్ బాలకృష్ణ) రాయలసీమ ప్రజలకు దేవుడు. ఆయనకు సవతి తల్లి కూతురు భానుమతి( వరలక్ష్మి) అంటే ప్రాణం. ఆమె కోసం ఏదైన త్యాగం చేస్తాడు. కానీ భానుమతి బాలయ్య చావు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు జూ. బాలయ్య విదేశాల్లో తన తల్లితో ఉంటాడు. అసలు వీరసింహారెడ్డి తన కుటుంబానికి ఎందుకు దూరమవుతాడు? ప్రాణంగా ప్రేమించిన చెల్లెలు ఎందుకు చంపాలనుకుంటుంది అనేది కథ.
ఓటీటీ : డిస్నీ+హాట్‌స్టార్
ధమాకా (Dhamaka)
రవితేజ ఇందులో డ్యూయల్ రోల్‌లో కనిపించాడు. ఆనంద్ పాత్రలో బిజినెస్ మ్యాన్‌గా.. స్వామీ పాత్రలో కామన్ మ్యాన్‌గా రవితేజ కనిపిస్తాడు. అయితే డబ్బున్న ఆనంద్‌తో శ్రీలీల పెళ్లి ఫిక్స్ అవుతుంది. కానీ, ఆమె స్వామీని లవ్ చేస్తుంది. మరోవైపు విలన్ జయరాం ఆనంద్ తండ్రి సచిన్ ఖేద్కర్ వ్యాపారాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. దాన్ని అడ్డుకోవడానికి రవితేజ ఏం చేశారు? శ్రీలీల ఎవరిని పెళ్లి చేసుకుంది? ఆనంద్, స్వామికి ఉన్న రిలేషన్ ఏంటి? అన్నది ప్లాట్.
ఓటీటీ – నెట్‌ఫ్లిక్స్
గాడ్ ఫాదర్ (Godfather)
సీఎం పీకేఆర్ మృతితో ఆ స్థానాన్ని అల్లుడు జైదేవ్ (సత్యదేవ్) హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నుతాడు. దానికోసం దురాశపరులతో చేతులు కలుపుతాడు. అయితే బ్రహ్మ తేజ (చిరంజీవి) అడ్డుగా నిలబడతాడు. ఇంతకీ బ్రహ్మకు పీకేఆర్‌కు ఉన్న సంబంధం ఏంటి? సత్య ప్రియ (నయనతార), మసూద్ భాయ్ (సల్మాన్) ఎవరు? అనేది కథ.
ఓటీటీ – నెట్‌ఫ్లిక్స్
ఒకే ఒక జీవితం (Oke Oka Jeevitham)
ఆది (శర్వానంద్), శ్రీను (వెన్నెల కిషోర్), చైతూ (ప్రియదర్శి) మంచి స్నేహితులు. వీరికి పాల్ (నాజర్) అనే ఓ శాస్త్రవేత్త పరిచయం అవుతాడు. పాల్ ఓ టైమ్ మిషన్ కనిపెడతాడు. గతంలోకి వెళ్లి తమ తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశాన్ని ఆది, శ్రీను, చైతూలకి ఇస్తాడు. వారు గతంలో ఏం చేశారన్నది కథ.
ఓటీటీ – సోనీ లైవ్
సీతారామం (Sita Ramam)
ఆర్మీ అధికారి రామ్ (దుల్కర్ సల్మాన్) ఓ అనాథ. ఆ విషయాన్ని రేడియోలో చెప్పినప్పటి నుంచి అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామహాలక్ష్మి (మృణాల్ ఠాకూర్) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంతకీ ఈ ఆమె ఎవరు? అనాథ అయిన రామ్‌కు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెని కలుసుకునేందుకని వచ్చిన రామ్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనేది కథ.
ఓటీటీ – అమెజాన్, హాట్‌స్టార్
అంటే సుందరానికి (Ante Sundaraniki)
బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ.
ఓటీటీ – నెట్‌ఫ్లిక్స్
భీమ్లా నాయక్ (Bheemla Nayak)
బీమ్లా నాయక్ (పవన్ కల్యాణ్) నిజాయతీ గల సబ్ ఇన్‌స్పెక్టర్. రాజకీయ పలుకుపడి ఉన్న డానియల్ శేఖర్ (రానా) కారులో మద్యం సీసాలతో వెళ్తూ పోలీసులకు చిక్కుతాడు. బీమ్లా నాయక్ డానియల్‌ను కొట్టి స్టేషన్‌కు తీసుకెళ్లడంతో అతని అహం దెబ్బ తింటుంది. ఆ తర్వాత అతడు ఏం చేశాడన్నది కథ.
ఓటీటీ – హాట్‌స్టార్, ఆహా
శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy)
వాసు (నాని) డైరెక్టర్ కావాలని కలలు కంటాడు. ‘ఉనికి’ పేరుతో తీసిన చిత్రం బ్లాక్‌బాస్టర్ అవుతుంది. అయితే కాపీ రైట్ కేసులో వాసు అరెస్టు అవుతాడు. ఆ సినిమా కథకు రచయిత శ్యామ్ సింగరాయ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ.
ఓటీటీ – నెట్‌ఫ్లిక్స్
వివాహా భోజనంబు (Vivaha Bhojanambu)
మహేశ్ (సత్య) చాలా పిసినారి. అనిత (ఆర్జవి)ను ప్రేమ పెళ్లి చేసుకుంటాడు. అయితే వీరి పెళ్లి జరిగిన రోజే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తారు. దీంతో పెళ్లికి వచ్చిన అనిత ఫ్యామిలీ అంతా మహేశ్ ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. వారిని పోషించడానికి మహేశ్ ఎన్ని తిప్పలు పడ్డాడు? అన్నది కథ.
ఓటీటీ : సోనీ లైవ్, ఆహా
రాజరాజ చోర (Raja Raja Chora)
భాస్కర్ (శ్రీ విష్ణు) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా సంజన (మేఘా ఆకాష్)కు పరిచయమవుతాడు. అబ్బద్దాలు చెప్పి ఆమెను ప్రేమలో పడేస్తాడు. అయితే భాస్కర్‌కు ఇదివరకే పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడని సంజన తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విద్య (సునైనా) ఎవరు? అన్నది కథ.
ఓటీటీ : జీ 5
SR కళ్యాణ మండపం (SR Kalyana Mandapam)
కల్యాణ్ (కిరణ్ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్.ఆర్. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్ చదివే కల్యాణ్ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ.
ఓటీటీ : ఆహా
వకీల్ సాబ్ (Vakeel Saab)
పల్లవి (నివేదా థామస్), జరీనా (అంజలి), దివ్య నాయక్ (అనన్య నాగళ్ల) ఓ ఇంట్లో అద్దెకుంటారు. ఓ రోజు ఎంపీ కొడుకు పల్లవిపై లైంగిక దాడి చేయబోగా ఆమె తప్పించుకొని ఇంటికి వస్తుంది. ఆ తర్వాత పల్లవిపై హత్యాయత్నం కేసు నమోదవుతుంది. దీంతో అమాయకులైన ముగ్గురమ్మాయిలు కష్టాల్లో పడతారు. ఆ సందర్భంలో వకీల్‌సాబ్ (పవన్‌కల్యాణ్) వారికి ఎలా అండగా నిలబడ్డాడు? కోర్టులో పల్లవి కేసుని ఎలా గెలిపించాడు? అన్నది కథ.
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్, ఆహా
సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru)
అజయ్( మహేష్ బాబు) పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్.. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఓ పని నిమిత్తం కర్నూలుకు బయల్దేరుతాడు. మరోవైపు భారతి( విజయశాంతి) కర్నూలులో ప్రొఫెసర్‌గా పనిచేస్తుంటుంది. ఈ క్రమంలో భారతికి స్థానిక మంత్రి ప్రకాశ్ రాజ్ వల్ల సమస్య ఎదురవుతుంది. ఇదే సమయంలో కర్నూలుకు వచ్చిన అజయ్ భారతికి ఎలాంటి సాయం చేస్తాడు. అసలు భారతికి అజయ్‌కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేది మిగతా కథ
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్
శ్రీకారం (Sreekaram)
కార్తిక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, హైదరాబాద్‌లో లక్షల్లో సంపాదిస్తుంటాడు. చిన్నప్పటి నుంచి తన తండ్రితో గ్రామంలో పెరగటం వల్ల వ్యవసాయంపై ఇష్టం ఏర్పడుతుంది. జాబ్‌కు రిజైన్ చేసి వ్యసాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ కార్తిక్ తండ్రి అందుకు ఒప్పుకోడు. ఇద్దరి మధ్య అగాథం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది అసలు కథ .
ఓటీటీ : సన్ నెక్స్ట్
జాతిరత్నాలు (Jathi Ratnalu)
మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్
ఆకాశం నీ హద్దురా (Aakasam Nee Haddu ra)
ఆకాశం నీ హద్దు రా‘ సినిమా కెప్టెన్ GR గోపీనాథ్.. ‘సింప్లీ ఫ్లై’ మరియు విమానయాన పరిశ్రమ ఆధారంగా రూపొందిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ.
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్
కలర్ ఫొటో (Colour Photo)
జయకృష్ణ, దీప్తి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు. వీరిద్దరి కులాలు, ఆస్తి అంతస్తులు వేరు. కానీ ఇద్దరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటారు. కానీ వీరి ప్రేమకు ఒకరి వల్ల పెద్ద విఘాతం ఏర్పడుతుంది. చివరికి వీరిద్దరు కలిశారా? లేరా? అన్నది అసలు కథ.
ఓటీటీ : ఆహా
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య (Uma Maheswara Ugra Roopasya)
ఉమా మహేశ్వర రావు ఓ ఫోటోగ్రాఫర్, గొడవలంటే ఇష్టముండదు. కానీ ఓ రోజు జోగి అనే రౌడీతో గొడవపడుతాడు. రద్దీగా ఉండే మార్కెట్‌లో జోగి చేత దెబ్బలు తిని ఘోరంగా అవమానించబడుతాడు. మరి ఉమా మహేశ్వరావు.. జోగిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది కథ.
ఓటీటీ – నెట్‌ఫ్లిక్స్
అలా వైకుంఠపురంలో (Ala Vaikuntapurramloo)
బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ.
ఓటీటీ – నెట్‌ఫ్లిక్స్
అరవింద సమేత (Aravinda Sametha)
రెండు ఊర్ల మధ్య 30 ఏళ్లుగా వైరం జరుగుతుంటుంది. ఈ క్రమంలో శత్రువులు రాఘవ రెడ్డి (ఎన్టీఆర్) నాన్న (నాగబాబు)ను చంపేస్తారు. భామ్మ మాటలతో ఊరి జనాలను మార్చాలని, ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని రాఘవ నిర్ణయించుకుంటాడు. గొడవలను చల్లార్చే క్రమంలో హీరోకు ఎదురైన సమస్యలేంటి? అన్నది కథ.
ఓటీటీ – జీ 5
శ్రీమంతుడు (Srimanthudu)
కోటీశ్వరుడి కుమారుడైన హర్ష.. పేదరికం సామాజిక సమస్యలతో కుదేలైన ఊరిని దత్తత తీసుకుంటాడు. ఆ ఊరిలో మార్పు తెచ్చే క్రమంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటాడు.
ఓటీటీ : జియో సినిమా
శతమానం భవతి (Sathamanam Bhavathi)
“శతమానం భవతి” అనే చిత్రం, తమ ఉద్యోగాల పరంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండి, బిజీగా గడుపుతున్న పిల్లల నుంచి అప్యాయత కోరుకునే ఓ వృద్ధ జంట జీవితాల చుట్టూ తిరుగుతుంది. బిజీ లైఫ్ గడుపుతున్న పిల్లల్ని ఏకతాటిపై తెచ్చేందుకు వారు ఒక ప్లాన్ వేయడంతో కథ మొదలుతుంది.
ఓటీటీ – జీ 5
మనం (Manam)
పునర్జన్మలు – ప్రేమతో ముడిపడిన పాత్రల చుట్టు తిరిగే కథతో సినిమా రూపొందింది. ఈ భావోద్వేగ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అన్నది కథ.
ఓటీటీ : సన్ నెక్స్ట్
గోవిందుడు అందరి వాడేలే (Govindudu Andarivadele)
తండ్రి, తాతయ్యల తలెత్తిన వివాదాన్ని చల్లార్చేందుకు హీరో ఇండియాకు వస్తాడు. తను ఎవరో నిజం దాచి తాతయ్య కుటుంబానికి దగ్గరవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!