ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గాడ్‌ఫాదర్’
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ మూవీ ఓటీటీలో దూసుకెళ్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం అత్యధిక వీక్షణలను సొంతం చేసుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ ఫాం వేదికగా ఇండియాలో మూడో స్థానంలో ఈ సినిమా నిలిచింది. హిందీ సినిమాల్లో ‘గాడ్ ఫాదర్’ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మళయాల సినిమా ‘లూసిఫర్’కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. కొన్ని కీలక మార్పులు చేసి డైరెక్టర్ మోహన్ రాజా రూపొందించారు. చిరంజీవి యాక్షన్, సిస్టర్ సెంటిమెంట్ నచ్చడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.