• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Viswambhara : 18 ఏళ్ల తర్వాత త్రిషతో రొమాన్స్ చేయనున్న చిరంజీవి!

    గత కొన్నిరోజులుగా టాలీవుడ్‌ (Tollywood)ను తొలిచేస్తున్న ప్రశ్నకు ఇవాళ సమాధానం దొరికింది. మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తర్వాతి చిత్రం ‘విశ్వంభర’లో హీరోయిన్ ఎవరన్న ఊహాగానాలకు చిత్ర బృందం చెక్ పెట్టింది. ఇందులో చిరుకు జోడీగా స్టార్‌ నటి త్రిష (Actress Trisha) నటించనున్నట్లు మూవీ యూనిట్‌ ప్రకటించింది. అంతేకాకుండా త్రిష సెట్‌లో పాల్గొన్న వీడియోను చిరంజీవి స్వయంగా షేర్‌ చేశారు.  ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  చిరు – త్రిష ఆలింగనం చిరు షేర్‌ చేసిన వీడియో ప్రకారం.. మెుదట సెట్‌లో … Read more

    This Week Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి స్టార్‌ హీరోల చిత్రాలు.. ఓ లుక్కేయండి!

    సంక్రాంతి తర్వాత గతవారం చిన్న సినిమాలు సందడి చేయగా.. ఈ వీక్ (This Week Movies) పెద్ద చిత్రాలే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాస్తవానికి ఆయా చిత్రాలు సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. మరోవైపు సంక్రాంతికి రిలీజైన రెండు పెద్ద సినిమాలు సైతం ఈ వారమే ఓటీటీలోకి (This Week OTT Releases) రాబోతున్నాయి. వాటితో పాటు మరిన్ని సిరీస్‌లు మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.  థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఈగల్‌ … Read more

    Syed Sohel: నా సినిమా ఎందుకు చూడరంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సోహెల్‌.. నెటిజన్లు ఫైర్‌!

    తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu) సీజన్‌-4లో తన ఆటతో ఆకట్టుకున్న సోహెల్‌ (Sohel).. బయటకొచ్చాక పలు సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ చిత్రాలన్నీ యావరేజ్‌ టాక్‌ సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తాజా చిత్రం ‘బూట్‌కట్‌ బాలరాజు’ (Bootcut Balaraju) కూడా శుక్రవారం (ఫిబ్రవరి 2న) థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా రిలీజ్‌ అనంతరం సోహెల్‌ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన మనసులోని మాటలను బయటపెడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే సోహెల్‌ వ్యాఖ్యలను కొందరు … Read more

    Vishwambhara Movie: ఆ హీరోయిన్‌ పక్కన యంగ్‌గా కనిపించేందుకు చిరు కసరత్తులు.. ఆమె ఎవరంటే?

    మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) పేరు చెబితినే ఆయన ఫ్యాన్స్‌ పూనకాలతో ఊగిపోతారు. తెలుగు రాష్ట్రాల్లో చిరుకు ఉన్న క్రేజ్‌ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గతేడాది ప్రారంభంలో ‘వాల్తేరు వీరయ్య’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మేహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’ (Bhoola Shankar)గా వచ్చి పరాజయాన్ని చవి చూశారు. ఈ సినిమా రిజల్ట్‌తో జాగ్రత్త పడిన చిరు తన తర్వాతి చిత్రానికి ఓ సోషియో ఫాంటసీ కథను ఎంచుకున్నారు. బింబిసార ఫేమ్‌ వశిష్ట … Read more

    Hanuman Viral Video: ‘హనుమాన్‌’ చూస్తూ థియేటర్లో మహిళ వింత ప్రవర్తన.. కారణం దైవమా? దెయ్యమా?

    సంక్రాతికి విడుదలైన హనుమాన్‌ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులను కొల్లగొడుతూ తన జైత్రయాత్రను ఇప్పటికీ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్ చూస్తే గూస్‌బంప్స్‌ రావడం పక్కా అని వీక్షకులు చెబుతున్నారు. సినిమాలోని చివరి 20 నిమిషాలు ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుందని చిత్రం విడుదలైనప్పటికీ నుంచి ఆడియన్స్‌ పేర్కొంటూ వస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను నిజం చేస్తూ తాజాగా ఓ వీడియో (Hanuman Viral Video) బయటకి వచ్చింది. ప్రస్తుతం నెట్టింట అది వైరల్ అవుతోంది.  మహిళ విచిత్ర … Read more

    Hanuman Collections: బాహుబలి తర్వాత ‘హనుమానే’ టాప్‌.. లాభాలే లాభాలు! ఎన్ని కోట్లు అంటే?

    సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్‌ (Hanuman Movie) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. మూవీ విడుదలై నేటితో (జనవరి 29) 17 రోజులు అయినప్పటికీ ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం రూ.250 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్‌ (Bollywood) ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అయోధ్య రామమందిరం గుడి ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నార్త్‌ ఆడియన్స్‌ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ వారంలో హనుమాన్‌ రూ.300 కోట్ల క్లబ్‌లో … Read more

    New OTT Movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో 21 చిత్రాలు/సిరీస్‌లు!

    సంక్రాంతి సందడి ముగియడంతో ఇప్పుడు చిన్న సినిమాలు (This Week Movies) క్యూ కట్టేందుకు రెడీ అయిపోయాయి. ఈ వీకెండ్‪‌లో ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’, ‘బూట్ కట్ బాలరాజు’ లాంటి చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఏకంగా 21 కొత్త సినిమాలు / వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటి విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ‘కేరాఫ్‌ కంచర పాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో గుర్తింపు … Read more

    69th Filmfare Awards 2024: బాలీవుడ్ ఇలాకాలో టాలీవుడ్‌ జెండా.. తెలుగోడి సత్తా అంటే ఇదే!

    బాలీవుడ్‌ ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ (69th FilmFare Awards) అవార్డుల జాబితా వచ్చేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ వేదికగా అట్టహసంగా సాగిన ఈ వేడుకలో విజేతలను ప్రకటించారు. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు. టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన యానిమల్‌ (Animal) చిత్రానికి అవార్డుల పంట పడింది. అందరూ ఊహించినట్లుగానే సందీప్‌.. ఫిల్మ్‌ఫేర్‌ వేడుకల్లో తన సత్తా ఏంటో చూపించాడు. మెుత్తం ఐదు అవార్డులను కొల్లగొట్టి టాలీవుడ్‌ జెండా బాలీవుడ్‌లో ఎగిరేలా చేశాడు.  … Read more

    Chiranjeevi: మెగాస్టార్‌కు ‘భారత రత్నే’ కరెక్ట్‌.. సర్‌ప్రైజ్‌ ఈవెంట్‌ ప్లాన్‌ చేస్తున్న టాలీవుడ్!

    మెగాస్టార్‌ చిరంజీవి (Konidela Chiranjeevi)కి భారత ప్రభుత్వం దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం రిపబ్లిక్‌ డే సందర్భంగా మెగాస్టార్‌కు ‘పద్మ విభూషణ్‌’ (Padma Vibhushan) అవార్డును ప్రకటించి సముచిత గౌరవాన్ని చాటుకుంది. దీంతో టాలీవుడ్ ప్రముఖ నటులు, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  చిరుకు భారతరత్న రావాలి! తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) తాజాగా చిరుని కలిసి ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయన్ను సన్మానించి … Read more

    Animal OTT: యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో ఆ సీన్లు లేకపోవడమే రచ్చకు కారణమైందా?

    ఓటీటీ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘యానిమల్’ (Animal) చిత్రం ఎట్టకేలకు స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (#AnimalOnNetflix)లో ప్రసారం అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో శుక్రవారం (జనవరి 26న) అందుబాటులోకి వచ్చింది. సినిమా బాగుందా? బాగాలేదా? అన్న విషయాన్ని పక్కన పెడితే ఓ విషయంలో మాత్రం ఓటీటీ ప్రేక్షకులు ‘యానిమల్‌’పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా చెప్పుకుంటూ వచ్చిన విషయాన్ని చిత్ర యూనిట్‌ పక్కన పెట్టేయడంపై డిసప్పాయింట్ అవుతున్నారు. ఆ మేటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.  … Read more