• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Animal OTT: యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో ఆ సీన్లు లేకపోవడమే రచ్చకు కారణమైందా?

    ఓటీటీ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘యానిమల్’ (Animal) చిత్రం ఎట్టకేలకు స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (#AnimalOnNetflix)లో ప్రసారం అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో శుక్రవారం (జనవరి 26న) అందుబాటులోకి వచ్చింది. సినిమా బాగుందా? బాగాలేదా? అన్న విషయాన్ని పక్కన పెడితే ఓ విషయంలో మాత్రం ఓటీటీ ప్రేక్షకులు ‘యానిమల్‌’పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా చెప్పుకుంటూ వచ్చిన విషయాన్ని చిత్ర యూనిట్‌ పక్కన పెట్టేయడంపై డిసప్పాయింట్ అవుతున్నారు. ఆ మేటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    అసంతృప్తికి కారణమదే!

    యానిమల్‌ ప్రమోషన్స్ సందర్భంగా సినిమా గురించి ఎన్నో విషయాలు చెప్పిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. థియేటర్లలో 3 గంటల 21 నిమిషాల మూవీ కాకుండా మరిన్ని సీన్లు ఉన్నాయని చెప్పాడు. ఈ క్రమంలోనే ఓటీటీలోకి ఎడిట్ చేసిన సన్నివేశాలు కూడా జోడిస్తామని తెగ ఊరించారు. దీంతో యానిమల్ ఓటీటీ వెర్షన్‌పై అందర్లో చెప్పలేనంత క్యూరియాసిటీ పెరిగింది. థియేటర్‌లో సినిమా చూసిన వారు సైతం అదనపు సీన్లు జోడిస్తుండంతో ఓటీటీ వెర్షన్‌పై ఆసక్తి పెంచుకున్నారు. తీరా చూస్తే థియేటర్లలో చూసిన సినిమా కట్‌నే ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. దీంతో అదనపు సన్నివేశాలు ఉంటాయని భావించిన వారంతా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. 

    నెటిజన్ల మండిపాటు

    డైరెక్టర్‌ సందీప్‌ చెప్పినట్లు 8 నిమిషాల సీన్లను కాకుండా కేవలం 3 నిమిషాల అదనపు సీన్లను మాత్రమే ఓటీటీ వెర్షన్‌లో యాడ్‌ చేసినట్లు తెలుస్తోంది. యానిమల్‌ థియేటర్‌ వెర్షన్‌ నిడివి 3 గంటల 21 నిమిషాలు. అదే ఓటీటీ వెర్షన్‌ తీసుకుంటే 3 గంటల 24 నిమిషాలుగా ఉంది. దీని ప్రకారం కేవలం మూడు సీన్లను మాత్రమే ఓటీటీలో వెర్షన్‌లో యాడ్‌ చేశారని వీక్షకులు అంటున్నారు. ట్విటర్‌ (ఎక్స్‌)లో #Animal హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అదనపు సీన్లు కూడా పట్టి పట్టి చూస్తే కానీ గుర్తించలేమని అంటున్నారు. కొత్త సీన్లను ఎక్స్‌పెక్ట్‌ చేసిన తమకు తీవ్ర నిరాశే ఎదురైందని పేర్కొంటున్నారు. మెుత్తంగా యానిమల్‌ వ్యవహారంపై కొందరు క్రేజీగా కామెంట్స్‌ చేస్తుంటే మరికొందరు మూవీ యూనిట్‌ తమను మోసం చేసిందని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

    కోరుకున్న సీన్లు అవేనా!

    యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో తాము ఏ సీన్లను కోరుకున్నామో కొందరు నెటిజన్లు ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా స్పష్టం చేశారు. ఫ్లైట్‌లో హీరో, హీరోయిన్ల మధ్య జరిగే రొమాన్స్‌, రణ్‌బీర్‌ – త్రిప్తి దిమ్రితో శారీరకంగా కలిసే సన్నివేశాలకు అదనపు సీన్లను జత చేసి మరింత బోల్డ్‌గా చూపిస్తారని ఆశించినట్లు పోస్టులు పెట్టారు. మరికొందరు ఆ పోస్టులను లైక్‌ చేయడం ద్వారా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకొందరు నెటిజన్లు యాక్షన్‌ సీన్స్‌లో మరింత వైలెంట్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసినట్లు చెప్పారు. సెన్సార్‌ బోర్డు ప్రేక్షకులకు చూపించకుండా కట్‌ చేసిన రొమాన్స్‌, వైలెన్స్‌ సీన్లు అన్ని ఓటీటీలో ఉంటాయని భావించి భంగపడినట్లు కామెంట్స్‌ చేశారు.

    మరోవైపు ప్రశంసలు కూడా!

    ఇదిలా ఉంటే మెుదటిసారి యానిమల్‌ చిత్రాన్ని చూసినవారు మాత్రం సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రన్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) నటన అద్భుతమంటూ కొనియాడుతున్నారు. డైరెక్టర్‌ సందీప్‌ వంగా టేకింగ్‌, స్క్రీన్‌ప్లే చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాలను, హీరోయిజాన్ని ఆయన చక్కగా ఎలివేట్‌ చేశారని కొనియాడుతున్నారు. అంతేకాకుండా యానిమల్‌ చిత్రంలోని హైలెట్‌ సీన్లను తమ ఎక్స్‌ ఖాతాల ద్వారా షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పోస్టులు కూడా #Animal హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాయి. 

    బాక్సాఫీసుపై కాసుల వర్షం!

    డిసెంబర్‌ 1న విడుదలైన యానిమల్‌ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాకు బాలీవుడ్‌లో రెండోది. ఆయన మెుదటి చిత్రం కబీర్‌ సింగ్‌ (Kabir Singh). యానిమల్‌ వరల్డ్‌వైడ్‌గా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌కు జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించింది. తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అటు తండ్రి పాత్రలో అనిల్‌ కపూర్‌ జీవించారు. చిత్ర విజయంలో తన వంతు పాత్ర పోషించారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv