• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best Hollywood Romantic Movies: ప్రేమ లోకంలో మునిగేలా చేసే అద్భుతమైన హాలీవుడ్ చిత్రాలు!

    సినీ ప్రియులు ఏ భాషలో కొత్త సినిమా ఉన్నా వెతుక్కుని మరి వెళ్లి చూస్తారు. ముఖ్యంగా ఈ జనరేషన్‌ యూత్‌.. తెలుగు సినిమాలతో పాటు హాలీవుడ్‌ చిత్రాలను సైతం ఎంతో ఇష్టంగా చూస్తుంటారు. అద్భుతమైన కథ, కథనంతో సాగే యాక్షన్‌ సినిమాలను చూసి వినోదాన్ని పొందుతుంటారు. అయితే హాలీవుడ్ అంటే కేవలం యాక్షన్‌ చిత్రాలు మాత్రమే కాదు. అక్కడ హృదయాలను హత్తుకునే రొమాంటిక్‌ సినిమాలు (Best Hollywood Romance Movies) కూడా ఉన్నాయి. ఇప్పటివరకూ హాలీవుడ్‌లో వచ్చిన టాప్‌ రొమాంటిక్‌ చిత్రాలు ఏవో ఇప్పుడు … Read more

    Eagle Day 1 Collections: రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు!  

    మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) నటించిన యాక్షన్ సినిమా ‘ఈగల్’ (Eagle). నిన్న (ఫిబ్రవరి 9) థియటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజయింది. ఇందులో రవితేజకు జోడీగా కావ్య థాపర్ (Kavya Thapar) నటించగా.. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధుబాల.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ యాక్షన్ సినిమాలాగా ఈగల్‌ తెరకెక్కింది. మెుదటి షో నుంచే హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం.. తొలిరోజు మంచి … Read more

    Guntur Kaaram On Netflix: లక్ష్యానికి అడుగు దూరంలో ఆగిపోయిన ‘గుంటూరు కారం’.. ఎలాగంటే?

    తెలుగు స్టార్‌ హీరో మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram Srinivas) దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. దాదాపు మూడు వారాల పాటు థియేటర్‌లో సత్తా చాటిన ఈ సినిమా.. ఈ అర్ధరాత్రి (ఫిబ్రవరి 9) నుంచి ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో గుంటూరు కారంలోని హైలెట్‌ … Read more

    Eagle Movie: ‘ఈగల్‌’ గురించి పూనకాలు తెప్పించే మాట చెప్పిన నిర్మాత.. అదే నిజమైతే!

    మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’ (Eagle Movie). అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran), కావ్యా థాపర్‌ (Kavya Thapar) హీరోయిన్లుగా నటించారు. నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషించారు. రవితేజతో ‘ధమాకా’ సినిమాని నిర్మించిన టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, ప్రమోషన్‌ పోస్టర్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు … Read more

    James Cameron: ‘RRR’ కిక్కు ఇంకా దిగలేదన్న హాలీవుడ్‌ డైరెక్టర్‌.. రాజమౌళిపై ప్రశంసలు!

    దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) ఒకరు. అపజయం ఎరుగని డైరెక్టర్‌గా ఆయన తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) మూవీతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చారు. ఈ క్రమంలోనే ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరాన్‌ (James Cameron).. మరోమారు మన దర్శకధీరుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఓ అంతర్జాతీయ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.  జేమ్స్‌ కామెరాన్‌ ఏమన్నారంటే? తాజాగా సాటర్న్‌ అవార్డుల కార్యక్రమంలో … Read more

    Cameraman Gangatho Rambabu: థియేటర్ల వద్ద పవన్‌ ఫ్యాన్స్‌ రచ్చ… సినిమా రీరిలీజ్‌కు కారణమదే!

    పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా తమన్నా భాటియా (Tamannaah Bhatia) నటించింది. ప్రకాష్‌ రాజ్‌, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలు పోషించారు. బద్రి (2000) తర్వాత పవన్‌ – పూరి కాంబోలో వచ్చిన రెండో చిత్రమిది. అప్పట్లో ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఇవాళ ఈ సినిమా రీరిలీజ్‌ … Read more

    Family Star: ఒక్క డైలాగ్‌తో మూవీపై హైప్‌! ‘ఫ్యామిలీ స్టార్‌’.. చిరంజీవి హిట్ సినిమాకు రీమేక్?

    విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star). ‘గీతా గోవిందం’ (Geetha Govindam) లాంటి క్లాసిక్‌ హిట్‌ తర్వాత డైరెక్టర్‌ పరుశురామ్‌ (Parasuram) విజయ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్‌ ఇస్తూ వస్తోన్న చిత్ర యూనిట్‌.. తాజాగా ఓ సాంగ్‌ ప్రొమోను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ప్రోమో.. మ్యూజిక్‌ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. #FamilyStar హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట వైరల్‌ కూడా అవుతోంది.  ఈ … Read more

    Salaar English On Netflix: గ్లోబల్‌ స్థాయికి ‘సలార్‌’ క్రేజ్‌.. ఇక రికార్డుల మోతే!

    ప్రభాస్‌ (Prabhas) హీరోగా కేజీఎఫ్‌ (KGF) ఫేమ్ ప్రశాంత్‌నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం ‘సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌’. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన సలార్‌.. టాప్‌-10 మూవీస్‌లో ఒకటిగా ట్రెండ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చిన సలార్‌.. … Read more

    Prabhas Mother sentiment Movies: ఈ సినిమాలు.. చూస్తే కన్నీళ్లు ఆగవు!

    సృష్టిలో ప్రతీ ప్రాణికీ మూల కారణం ‘అమ్మ’. అటువంటి తల్లి గురించి చెప్పాలంటే భాష చాలదు. మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ‘అమ్మ’ పాత్ర‌.. నిజ జీవితంలోనే కాకుండా సినిమాల్లోనూ చిర‌స్మ‌ర‌ణీయం. అందుకే అమ్మ సెంటిమెంట్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్‌లో ఎన్నో రకాల చిత్రాలు వచ్చాయి. మనసుకు హత్తుకునే కథలతో చక్కటి విజయాలను అందుకున్నాయి. ఇదిలా ఉంటే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas Mother Sentiment Movies) కు కూడా అమ్మ సెంటిమెంట్‌తో ఉన్న చిత్రాలు తీశారు. అతడి కెరీర్‌లో ఘన … Read more

    Double iSmart Movie: రామ్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మూవీలో అదిరే ట్విస్ట్‌.. పూరి మార్క్ ఫ్లాష్‌ బ్యాక్‌!

    టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ (Ram Pothineni), స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart). వీరి కాంబోలో 2019లో వచ్చి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ (iSmart Shankar) చిత్రానికి రీమేక్‌గా ఇది వస్తోంది. తొలి భాగం సూపర్‌ హిట్‌గా నిలవడంతో పార్ట్‌ 2పై ఆసక్తి నెలకొంది. 2023 జులైలో పూజ కార్యక్రమాలతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంగా.. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ షెడ్యూల్‌ షూటింగ్‌ ముంబయిలో … Read more