పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ మూవీ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా తమన్నా భాటియా (Tamannaah Bhatia) నటించింది. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలు పోషించారు. బద్రి (2000) తర్వాత పవన్ – పూరి కాంబోలో వచ్చిన రెండో చిత్రమిది. అప్పట్లో ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇవాళ ఈ సినిమా రీరిలీజ్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రీరిలీజ్‌కు కారణమదేనా!
టాలీవుడ్‌లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ (Cameraman Gangatho Rambabu Re Release) ఒకరు. పైగా ఏపీ రాజకీయాల్లో జనసేన (Janasena Party) అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందని విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ పొలిటికల్ యాక్షన్ మూవీ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ రీరిలీజ్ కావడం ఆసక్తి రేపుతోంది. ఆయన పొలిటికల్ మైలేజ్‌ను మరింత పెంచేందుకు సినిమా రీరిలీజ్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న వేళ.. ఈ సినిమా రీరిలీజ్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.
థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ రచ్చ!
‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా రీరిలీజైన థియేటర్లలో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. కొత్త సినిమా రిలీజైనంత ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పేపర్ కటింగ్స్‌ను గాల్లోకి విసిరేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతేకాకుండా మూవీలోని సీన్లను నెట్టింట షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. #CameramanGangathoRambabu హ్యాష్‌ట్యాగ్‌తో ఆ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్యా థియేటర్లలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu Re Release) చిత్రాన్ని ప్రదర్శించారు. హీరో ఎంట్రీ సందర్భంగా ఫ్యాన్స్ చేసిన గోలతో థియేటర్ దద్దరిల్లింది. మరికొన్ని థియేటర్లలోనూ పవన్ ఎంట్రీ సందర్భంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.
సినిమా ప్రదర్శనకు ముందు సంధ్య థియేటర్ బయట ఫ్యాన్స్ నినాదాలు చేశారు. పవన్ అప్‌కమింగ్ మూవీ ‘ఓజీ’ పేరుతో పరిసరాలను దద్దరిల్లేలా చేశారు. అదే సమయంలో ‘బాబులకే బాబు కళ్యాణ్ బాబు’ అంటూ స్లోగన్స్ కూడా ఇచ్చారు. బాణాసంచా సైతం కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఏపీలోని వైజాగ్‌లో కూడా ఈ చిత్రం రీరిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ సందడి చేశారు. ముఖ్యంగా ఓ థియేటర్‌కు భారీగా వచ్చిన పవన్ ఫ్యాన్స్.. జనసేన జెండాలను ప్రదర్శించారు. స్క్రీన్ వద్దకు వెళ్లి ఈలలు, కేకలు వేస్తూ ఊర్రూతలూగించారు.
పవన్ ఎంట్రీ సందర్భంగా నటుడు ఎం.ఎస్ నారాయణ చెప్పే డైలాగ్స్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
సినిమాలోని ‘ఎక్స్‌ట్రాడ్నరీ’ పాట సందర్భంగా ఫ్యాన్స్ మరింత ఊగిపోయారు. కుర్చీలపైన నిలబడి మరి పవన్ స్టెప్పులను ఎంజాయ్ చేశారు.
‘మెలికలు తిరుగుతుంటే’ పాట కూడా పవన్ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించింది. ఈ పాటలో పవన్ స్టెప్పులను హైలేట్ చేస్తూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఓ థియేటర్‌లో పదుల సంఖ్యలో పవన్ ఫ్యాన్స్ స్క్రీన్ వద్దకు వెళ్లి చిందులు వేశారు. పాటను హమ్ చేస్తూ గోల గోల చేశారు.
పవన్ రాజకీయ జీవితాన్ని ప్రతిబింబిచేలా సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ను జనసైనికులు వైరల్ చేస్తున్నారు.