సినీ ప్రియులు ఏ భాషలో కొత్త సినిమా ఉన్నా వెతుక్కుని మరి వెళ్లి చూస్తారు. ముఖ్యంగా ఈ జనరేషన్ యూత్.. తెలుగు సినిమాలతో పాటు హాలీవుడ్ చిత్రాలను సైతం ఎంతో ఇష్టంగా చూస్తుంటారు. అద్భుతమైన కథ, కథనంతో సాగే యాక్షన్ సినిమాలను చూసి వినోదాన్ని పొందుతుంటారు. అయితే హాలీవుడ్ అంటే కేవలం యాక్షన్ చిత్రాలు మాత్రమే కాదు. అక్కడ హృదయాలను హత్తుకునే రొమాంటిక్ సినిమాలు (Best Hollywood Romance Movies) కూడా ఉన్నాయి. ఇప్పటివరకూ హాలీవుడ్‌లో వచ్చిన టాప్ రొమాంటిక్ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
When Harry Met Sally (1989)
నటి నటులు: మెగ్ ర్యాన్, బిల్లీ క్రిస్టల్
డైరెక్టర్ : రాబ్ రీనర్
ఒకే యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్స్ చేసిన హ్యారీ, సాలీ.. న్యూయార్క్‌లో కలుసుకుంటారు. అప్పటికే వారు ప్రేమలో విఫలమై ఉన్నందు వల్ల ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అయితే ఒక పురుషుడు, స్త్రీ లైంగిక సంబంధం లేకుండా స్నేహితులుగా ఉండగలరా? అన్న ప్రశ్న వారికి ఎదురవుతుంది. దానికి వారు ఏం సమాధానం చెప్పారు? అన్నది స్టోరీ.
Sleepless in Seattle (1993)
నటినటులు : టామ్ హ్యాన్క్స్, మెగ్ ర్యాన్
డైరెక్టర్ : నోరా ఎప్రాన్
శ్యామ్ భార్య చనిపోవడంతో అతడు కొడుకుతో ఒంటరిగా జీవిస్తుంటాడు. ఒక రోజు అతడు ఓ టీవీ షోలో పాల్గొంటాడు. రిపోర్టర్ అన్నీ రీడ్.. అతడి మాటలకు ఆకర్షితురాలవుతుంది. ఆమెకు నిశ్చితార్థం జరిగినప్పటికీ ప్రేమికుల రోజున అతడికి ఆహ్వానం పలుకుతుంది. ఆ తర్వాత ఏమైంది? వారు కలుసుకున్నారా? లేదా? అన్నది స్టోరీ.
The Notebook (2004)
నటీనటులు : ర్యాన్ గోస్లింగ్, రచెల్ మెక్ ఆడమ్స్
డైరెక్టర్ : నిక్ క్యాసావెట్స్
నోహ్ కాల్హౌన్ అనే యువకుడు అల్లీ అనే సంపన్న యువతిని ప్రేమిస్తాడు. ఈ క్రమంలో రెండవ ప్రపంచ యుద్ధంలో దేశం తరపున పోరాడేందుకు యుద్ధ భూమికి వెళ్తాడు. తమ ప్రేమ ముగిసిందని భావించిన అల్లీ మరోక వ్యక్తిని ఇష్టపడుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత నోహ్ తిరిగి రావడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.
Titanic (1997)
నటినటులు : లియోనార్డో డికాప్రియా, కేట్ విన్‌సెల్ట్
డైరెక్టర్ : జేమ్స్ కామెరాన్
రోజ్‌కు సంపన్న వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. ఆమె తనకు కాబోయే భర్తతో టైటానిక్ షిప్‌లో ప్రయాణిస్తుండగా అక్కడ జాక్ అనే యువకుడ్ని ప్రేమిస్తుంది. ఓ ఉపద్రవం వారిద్దరినీ వేరు చేస్తుంది. రోజ్ కోసం జాక్ ప్రాణ త్యాగం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
La la land (2016)
నటీనటులు : ర్యాన్ గోస్లింగ్, ఎమ్మా స్టోన్
డైరెక్టర్ : డామీన్ చాజెల్లె
సంగీతకారుడు సెబాస్టియన్, నటి మియా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. తమ వృత్తుల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అయితే వారి కీర్తి పెరిగే కొద్ది వారి మధ్య ప్రేమ తగ్గుతూ వస్తుంది. కొందరు వ్యక్తులు వారి ప్రేమను బలహీన పరుస్తారు. చివరికి వారు ఒక్కటిగా ఉన్నారా? లేదా?
Carol (2015)
నటీనటులు : కేట్ బ్లాన్‌చెట్, రూనీ మారా
డైరెక్టర్ : టాడ్ హేయ్‌నెస్
1950లో ఫొటోగ్రాఫర్ థెరిస్.. కరోల్ అనే అందమైన అమ్మాయిని చూస్తాడు. ఆమె విచారంగా ఉండటాన్ని గమనించి కరోల్‌కు విడాకులైన విషయాన్ని తెలుసుకుంటాడు. థెరిస్‌ను రోజూ కలుస్తూ ఆమెకు దగ్గరవుతాడు. వారు ఒక్కటయ్యే క్రమంలో వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. నైతిక పోరాటం చేస్తారు.
Eternal Sunshine of the Spotless Mind (2004)
నటీనటులు: జిమ్ క్యారీ, కేట్ విన్‌సెల్ట్
డైరెక్టర్ : మైఖేల్ గాండ్రీ
జోయెల్, క్లెమెంటైన్ ఒకరినొకరు ప్రేమించుకొని కొన్ని కారణాల వల్ల విడిపోతారు. జ్ఞాపకాలను చెరిపేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే తాము ఇప్పటికీ డీప్‌గా లవ్ చేసుకుంటున్నట్లు గ్రహించడంతో కథ మలుపు తిరుగుతుంది.
The Curious Case of Benjamin Button (2008)
నటినటులు: బ్రాడ్ పిట్, కేట్ బ్లాన్‌చెట్
డైరెక్టర్ : డేవిడ్ ఫిన్‌చెర్
బెంజమన్ బటన్ ఒక అరుదైన సమస్యతో జన్మిస్తాడు. పుట్టడమే వృద్ధుడి శారీరక స్థితితో జన్మించిన అతడు సంవత్సరాలు గడుస్తున్న కొద్ది రివర్స్‌లో అతడి ఏజ్ తగ్గుతూ వస్తుంది. బెంజమన్.. డైసీ అనే డ్యాన్సర్‌ను గాఢంగా ప్రేమిస్తాడు. కాలం గడుస్తున్న కొద్ది వారి వయసులు పరస్పరం విరుద్దంగా మారుతుండటంతో కథ ఆసక్తికరంగా మారుతుంది.
500 Days of Summer (2009)
నటీనటులు : జోసెఫ్ గార్డన్, జూలీ డెస్‌చానెల్
డైరెక్టర్ : మార్క్ వెబ్
టామ్ ఒక గ్రీటింగ్ కార్డ్ రైటర్. అతడు సమ్మర్ తర్వాత తన ప్రేయసితో విడిపోతాడు. అయితే వేసవిలో ఆ 500 రోజులు ఆమెతో ఎలా గడిపానన్న విషయాన్ని టామ్ సమీక్షించుకుంటాడు. అలా చేయడం ద్వారా అతడు తన జీవిత లక్ష్యాన్ని గ్రహిస్తాడు.
‘Before’ Trilogy (1995 – 2013)
నటీనటులు : ఈథన్ హావ్‌కే, జూలీ డెల్పీ
డైరెక్టర్ : రిచర్డ్ లింక్‌లేటర్
‘బిఫోర్ ట్రయాలజీ’.. హాలీవుడ్‌లోని ఉత్తమ రొమాన్స్ ఫిల్మ్ ఫ్రాంచైజీ. ఆ సంస్థ నుంచి వచ్చిన ‘బిఫోర్ సన్‌రైజ్’ (Before Sunset), ‘బిఫోర్ సన్‌సెట్’ (Before Midnight), ‘బిఫోర్ మిడ్‌నైట్’ (Before Midnight) మూవీస్ అద్భుతమైన రొమాంటిక్ చిత్రాలుగా గుర్తింపు పొందాయి. ఈ మూడు సినిమాలు జెస్సీ, సెలిన్ ప్రేమకథల చుట్టు తిరుగుతుంది.
Never Let me go (2010)
నటీనటులు : క్యారి ముల్లీగన్, ఆండ్రూ గర్‌ఫీల్డ్, కియారా నైట్లీ, ఎల్లా పుర్నెల్
డైరెక్టర్: మార్క్ రోమనెక్
రూత్, కాథీ, టామీ ఓ ఇంగ్లీష్ బోర్డింగ్ స్కూల్‌లో చదువుకుంటారు. లవ్‌కు సంబంధించిన బాధాలను ఎదుర్కొంటారు. పరిస్థితులు ఆ ముగ్గురి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందన్నది కథ.
Pride & Prejudice (2005)
నటీనటులు: కీరా నైట్లీ, మ్యాథ్యూ, కారే ముల్లిగన్, రోసముండ్ పైక్, సిమన్ వుడ్స్ తదితరులు
డైరెక్టర్ : జో వ్రైట్
ఇది బెన్నెట్ అనే మహిళకు పుట్టిన నలుగురు కుమార్తెల కథ. ధనవంతులైన భర్తలు కావాలని ఆమె కూతుర్లు పట్టుబడతారు. మరి వారి కలలు ఎలా నెరవేరాయి? వారు ఎలాంటి భర్తలను పొందారు? అన్నది కథ.
Broke back mountain (2005)
నటీనటులు : హీత్ లెడ్జర్, జేక్ గైలెన్‌హాల్, మిచెల్లె విలియమ్స్, అన్ని హాథ్‌వే
డైరెక్టర్ : ఆంగ్ లీ
ఇద్దరు గొర్రెల కాపరులు.. ఎన్నిస్, జాక్ ఒకరినొకరు ఇష్టపడతారు. లైంగిక, భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉంటారు. వారిద్దరూ తమ స్నేహితులను వివాహం చేసుకోవడంతో బంధం క్లిష్టంగా మారుతుంది.
Dirty Dancing (1987)
నటీ నటులు : పాట్రిక్ స్వేజీ, జెన్నిఫర్ గ్రే
డైరెక్టర్ : ఎమిలీ ఆర్డొలినో
ఫ్రాన్సిస్ తన తల్లిదండ్రులతో విహార యాత్రకు వెళ్లినప్పుడు అక్కడ ఓ రిసార్టులోని డ్యాన్స్ మాస్టర్‌తో ప్రేమలో పడుతుంది. వారి ప్రేమను యువతి తండ్రి తిరస్కరిస్తాడు. మరి వారు ఒక్కటయ్యారా?
Call Me By Your Name (2017)
నటీనటులు : టైమోథీ చలామెట్, అర్మీ హామర్
డైరెక్టర్ : లుకా గ్వాడాగ్నినో
1983 వేసవి కాలంలో కథ జరుగుతుంది. 17 ఏళ్ల ఎలియో పెర్ల్‌మాన్.. తన తండ్రి సహాయకుడు ఆలివర్‌ను ఇష్టపడుతుంది. వారు ఆ వేసవిలో ఎంతో సంతోషంగా గడుపుతారు. అయితే, ఓ ఘటన వారి జీవితాలను తలకిందులు చేస్తుంది.
Shakespeare in Love (1998)
నటీనటులు : జోసెఫ్ ఫ్లెన్నస్, గ్వినేత్ పాల్ట్రో
డైరెక్టర్ : జాన్ మాడెన్
విలియం షేక్ స్పియర్.. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఒక అందమైన యువతిని చూసి ప్రేరణ పొందుతాడు. ఓ నాటకం రాయడానికి సిద్ధమవుతాడు. ఈ క్రమంలో వారు శరీరకంగా దగ్గరవుతారు. అయితే యువతి చేసిన పని వల్ల వారి జీవితాలు తలకిందులవుతాయి.
The fault in our Star (2014)
నటీనటులు : షాయ్‌లెనె వూడ్లీ, అన్సెల్ ఎల్గర్ట్
డైరెక్టర్ : జోష్ బూన్
హాజెల్, అగస్టస్ అనే ఇద్దరు క్యాన్సర్ బాధితులు.. క్యాన్సర్ సపోర్టు గ్రూప్ ద్వారా కలుసుకుంటారు. త్వరలోనే వారు ప్రేమలో పడతారు. కష్టకాలంలో వారు ఒకరికొకరు బాసటగా నిలుస్తారు. అయితే విధి వారిపై కన్నెర్ర చేస్తుంది. .
Four Weddings and a Funeral (1994)
నటీనటులు : హ్యూజ్ గ్రాన్ట్, ఆండీ మెక్‌డొవెల్
డైరెక్టర్ : మైక్ నెవెల్
ఇంట్రోవర్ట్ అయిన చార్లెస్.. అమ్మాయిలను దురదృష్టంగా భావిస్తుంటాడు. ఒక పెళ్లిలో క్యారీ అనే అందమైన యువతిని చార్లెస్ చూస్తాడు. ఆ అమ్మాయి తనకు అదృష్ట దేవత కాగలదని విశ్వసిస్తాడు. మరి వారిద్దరు ఎలా ఒక్కటయ్యారు? ఈ క్రమంలో చార్లెస్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్