• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Salaar English On Netflix: గ్లోబల్‌ స్థాయికి ‘సలార్‌’ క్రేజ్‌.. ఇక రికార్డుల మోతే!

    ప్రభాస్‌ (Prabhas) హీరోగా కేజీఎఫ్‌ (KGF) ఫేమ్ ప్రశాంత్‌నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం ‘సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌’. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన సలార్‌.. టాప్‌-10 మూవీస్‌లో ఒకటిగా ట్రెండ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చిన సలార్‌.. తాజాగా గ్లోబల్‌ లాంగ్వేజ్‌ (Salaar English On Netflix) లోనూ అందుబాటులోకి వచ్చింది.

    గ్లోబల్‌ రేంజ్‌కు ‘సలార్‌’..!

    సలార్ ఇంగ్లీష్ వెర్షన్‍ను నెట్‍ఫ్లిక్స్ తాజాగా  (ఫిబ్రవరి 5) అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘భారీ డిమాండ్ల నేపథ్యంలో గ్లోబల్ ఆడియన్స్ కోసం సలార్‌ను ఇంగ్లీష్ వెర్షన్‌లోనూ స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. ఎట్టకేలకు ఇంగ్లిష్ వెర్షన్‍ను నెట్‍ఫ్లిక్స్ (Salaar English On Netflix) తీసుకురావటంతో గ్లోబల్ రేంజ్‍లో సలార్ మరింత దుమ్మురేపే అవకాశం ఉంది. చాలా దేశాల్లో సలార్‌ మరింత ట్రెండ్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా మరోమారు ప్రభాస్‌ పేరు మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది.

    ఇంగ్లీష్‌ వెర్షన్‌ వైరల్‌..

    సలార్‌ చిత్రం ఇంగ్లీష్‌లో ప్రసారం అవుతుండటంతో ఈ మూవీలోని హైలెట్‌ సీన్స్‌ నెట్టింట వైరల్‌గా అవుతున్నాయి. ఆంగ్ల వెర్షన్‌లో ఉన్న ఈ సీన్లను ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. #SalaarEnglishOnNetflix హ్యాష్‌ట్యాగ్‌తో అవి ట్రెండ్ అవుతున్నాయి. అయితే సలార్ సినిమా ఇంగ్లీష్ వెర్షన్‍లోకి రాకముందే గ్లోబల్ రేంజ్‍లో దుమ్మురేపింది. ఇంగ్లీష్ సబ్‍టైటిల్స్‌తో చాలా దేశాల్లోని ప్రజలు ఈ మూవీని చూసేశారు. అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ‘సలార్ గోస్ గ్లోబల్’ అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం విశేషం. 

    మరి హిందీలో ఎప్పుడు!

    ఇక సలార్ హిందీ వెర్షన్ మాత్రం (Salaar English On Netflix) ఇప్పటి వరకు నెట్‍ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రాలేదు. ఈ విషయంపై సదరు స్ట్రీమింగ్‌ వర్గాలు అప్‍డేట్ కూడా ఇవ్వలేదు. సినిమా విడుదల తేదీ నుంచి ఓటీటీలోకి రావడానికి 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉండడం వల్లే హిందీ వెర్షన్ ఆలస్యమవుతోందని సమాచారం. అయితే మార్చిలో సలార్‌ హిందీ వెర్షన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే నెట్‍ఫ్లిక్స్ అధికారిక ప్రకటన కూడా చేయనుందని వార్తలు వస్తున్నాయి. 

    షారుక్‌ను ఢీకొట్టి నిలబడ్డ ప్రభాస్‌!

    బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్ (Shah Rukh Khan) నటించిన డంకీ (Dunki), సలార్ (Salaar) చిత్రాలు గతేడాది డిసెంబర్‌లో బాక్సాఫీస్ వద్ద తలపడ్డాయి. అయితే సలార్ చిత్రమే కలెక్షన్లలో దుమ్మురేపింది. షారుక్‌ మూవీని వెనక్కి నెట్టి.. సలార్ అదరగొట్టింది. దీంతో ఉత్తరాదిలో ప్రభాస్‍కు ఉన్న విపరీతమైన క్రేజ్ మరోసారి రుజువైంది. హిందీలో సలార్‌ చిత్రానికి సుమారు రూ.170 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

    సలార్‌ 2 షూటింగ్‌ ఎప్పుడంటే?

    సలార్‌ సినిమాకు సీక్వెల్‌ (Salaar Part 2: Shouryaanga Parvam) కూడా రానుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీక్వెల్ షూటింగ్‌ ఈ సమ్మర్‌లోనే మొదలు కానుందట. ఇందుకోసం ప్రభాస్‌ 2 నెలల డేట్స్‌ కూడా ఇచ్చేసినట్లు సమాచారం. సమ్మర్‌లో షూటింగ్‌ ప్రారంభించి డిసెంబర్‌ 22న సలార్‌ రెండో భాగాన్ని రిలీజ్‌ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందట. దీనికి సంబంధించి మరిన్ని అప్‌డేట్స్‌ త్వరలోనే రానున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv