• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Prabhas Mother sentiment Movies: ఈ సినిమాలు.. చూస్తే కన్నీళ్లు ఆగవు!

    సృష్టిలో ప్రతీ ప్రాణికీ మూల కారణం ‘అమ్మ’. అటువంటి తల్లి గురించి చెప్పాలంటే భాష చాలదు. మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ‘అమ్మ’ పాత్ర‌.. నిజ జీవితంలోనే కాకుండా సినిమాల్లోనూ చిర‌స్మ‌ర‌ణీయం. అందుకే అమ్మ సెంటిమెంట్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్‌లో ఎన్నో రకాల చిత్రాలు వచ్చాయి. మనసుకు హత్తుకునే కథలతో చక్కటి విజయాలను అందుకున్నాయి. ఇదిలా ఉంటే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas Mother Sentiment Movies) కు కూడా అమ్మ సెంటిమెంట్‌తో ఉన్న చిత్రాలు తీశారు. అతడి కెరీర్‌లో ఘన విజయాలు సాధించిన చిత్రాలన్ని దాదాపుగా తల్లి సెంటిమెంట్‌తో వచ్చినవే. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

    సలార్‌

    ‘కేజీఎఫ్‌’ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘సలార్‌’ (Salaar). ఇందులో ప్రభాస్‌ ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. అదే సమయంలో తల్లి మాటను జవదాటని కొడుకు గాను మెప్పించాడు. తల్లి-కొడుకుల సెంటిమెంట్‌ వర్కౌట్‌ కావడంతో పాటు.. ప్రభాస్‌ మార్క్‌ యాక్షన్‌తో సలార్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్‌ నటించగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ (Prithviraj Sukumaran) కీలక పాత్రలో కనిపించాడు. 

    బాహుబలి

    ప్రభాస్ హీరోగా రాజమౌళి (S.S. Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ (Baahubali), బాహుబలి 2 (Baahubali 2) చిత్రాలలోనూ తల్లి-కొడుకుల సెంటిమెంట్‌ దాగుంది. ప్రభాస్‌, రమ్యకృష్ణ పాత్రల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు వీక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. కాగా, ఇందులో రానా (Rana Daggubati).. ప్రభాస్‌కు సోదరుడిగా నటించాడు. అనుష్క (Anushka Shetty) హీరోయిన్‌గా చేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రంతో ప్రభాస్‌ క్రేజ్‌ జాతీయ స్థాయిలో పెరిగిపోయింది. అప్పటివరకు టాలీవుడ్‌కే పరిమితమైన డార్లింగ్ ఫేమ్‌.. అన్ని ఇండస్ట్రీలకు పాకింది. 

    ఛత్రపతి

    ప్రభాస్‌ కెరీర్‌లో వచ్చిన మరో మదర్‌ సెంటిమెంట్‌ చిత్రం (Prabhas Mother Sentiment Movies) ‘ఛత్రపతి’ (Chatrapathi). దీనిని కూడా దర్శకధీరుడు రాజమౌళినే తెరకెక్కించారు. ఈ సినిమా ప్రధానంగా యాక్షన్‌ చుట్టూ తిరిగినా.. కథలో తల్లి సెంటిమెంట్‌ అంతర్లీనమై ఉంటుంది. ఇందులో ప్రభాస్‌ తల్లిగా భానుప్రియ (Bhanu Priya) నటించారు. వారిద్దరి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు వీక్షకుల కళ్లు చెమడ్చేలా చేస్తాయి. కాగా, ఇందులో ప్రభాస్‌కు జోడీగా నటి శ్రియా (Shriya Saran) చేసింది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తిరుగులేని విజయాన్ని అందుకుంది.

    యోగి

    ప్రభాస్‌ కెరీర్‌లో వచ్చిన తొలి మదర్‌ సెంటిమెంట్‌ చిత్రం (Prabhas Mother Sentiment Movies) ‘యోగి’ (Yogi Movie). ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద గొప్ప విజయం సాధించనప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను మాత్రం ఎంతగానో ఆకట్టుకుంది. టెలివిజన్‌లో కొన్ని వందలసార్లు అత్యధిక TRP రేటింగ్‌తో ఈ చిత్రం ప్రసారమైంది. ఇందులో ప్రభాస్‌ తల్లిగా సీనియర్‌ నటి శారద (Actress Sarada) నటించారు. హీరోయిన్‌గా నయనతార (Nayanthara) చేసింది. వి.వి. వినాయక్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రానికి రమణ గోగుల, గురు కిరణ్‌ సంగీతం అందించారు. కోట శ్రీనివాసరావు, ప్రదీప్‌ రావత్‌, ముమైత్‌ ఖాన్‌, వేణు మాధవ్‌, సునీల్‌ ముఖ్య పాత్రలు పోషించారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv