విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). ‘గీతా గోవిందం’ (Geetha Govindam) లాంటి క్లాసిక్ హిట్ తర్వాత డైరెక్టర్ పరుశురామ్ (Parasuram) విజయ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్ ఇస్తూ వస్తోన్న చిత్ర యూనిట్.. తాజాగా ఓ సాంగ్ ప్రొమోను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ప్రోమో.. మ్యూజిక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. #FamilyStar హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట వైరల్ కూడా అవుతోంది.
ఈ సాంగ్ నా ఫేవరేట్: విజయ్
‘ఫ్యామిలీస్టార్’కి సంబంధించి మొదటి సాంగ్ ప్రోమోను సోమవారం రాత్రి చిత్రబృందం రిలీజ్ చేసింది. ‘నంద నందన’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించి గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. మెలోడియస్ BGM అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది. పూర్తి పాటని రేపు (బుధవారం) రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ‘నంద నందన’ పాటను అనంత్ శ్రీరామ్ స్వరపరచగా సిద్ శ్రీరామ్ (Sid Sriram) పాడారు. దీంతో పాటపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పాట ప్రోమో షేర్ చేసిన విజయ్.. ‘మొదటిపాట.. నా ఫెవరేట్.. మీకు కూడా 7న కచ్చితంగా ఫేవరెట్ అవుతుంది’ అని పోస్ట్ చేశాడు. కాగా, ఈ చిత్రానికి గోపి సుందరం సంగీతం అందిస్తున్నారు.
ఫిదా చేస్తున్న మృణాల్..!
ఈ సాంగ్ ప్రోమోలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తళతళ మెరిసిపోయింది. మృణాల్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘సీతారామం’ తర్వాత తిరిగి ఆ స్థాయిలో ట్రెడిషనల్ లుక్‌లో మృణాల్ కనిపించింది. నుదిటిన బొట్టుతో అచ్చమైన తెలుగమ్మాయిగా కనువిందు చేసింది. 28 సెకన్లు ఉన్న ఈ చిన్న ప్రోమోలోనే మృణాల్ ఈ స్థాయి ఇంపాక్ట్ చూపిస్తే ఇక సినిమాలో ఆమె ఎంతగా మెస్మరైజ్ చేస్తుందోనని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. మృణాల్‌ను ఎలా చూడాలని తెలుగు ఆడియన్స్ కోరుకుంటున్నారో ఈ చిత్రంలో ఆమె రోల్ అలాగే ఉంటుందన్న అంచనాలు కూడా ఈ ప్రోమోతో మెుదలయ్యాయి.
‘దేవర’ స్థానంలో..!
‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్‌పై కూడా చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఆ రోజునే ఎన్టీఆర్ (Jr NTR) ‘దేవర’ (Devara) చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్‌లో జాప్యం వల్ల ఆ రోజున ‘దేవర’ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ‘ఫ్యామిలీ స్టార్’ను రిలీజ్ చేసేందుకు ఆ డేట్‌నే మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాకి నిర్మాతగా దిల్‌రాజు వ్యవహరిస్తున్నారు. ‘ఖుషీతో మంచి హిట్ అందుకున్న విజయ్.. ఇక ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’తో కూడా ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేయాలని ప్రయత్నిస్తున్నాడు.
ఒక్క డైలాగ్‌తో మూవీపై హైప్!
గతంలో వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ గ్లింప్స్.. ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ‘ఐరనే వంచాలా ఏంటి?’ అని విజయ్ చెప్పిన డైలాగ్ సినిమాకు బోలెడంత బజ్‌ను తీసుకొచ్చింది. అప్పట్లో ఈ డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ డైలాగ్‌పై రీల్స్ చేస్తూ సినిమాను నెటిజన్లకు మరింత చేరువ చేశారు. దీంతో ఈ సినిమా కథ ఏంటి? ఇందులో విజయ్ ఫెమినిస్ట్ (Feminist) పాత్రలో కనిపిస్తాడా? అన్న క్యూరియాసిటీ అందరిలో పెరిగి పోయింది.
సినిమా కథపై క్రేజీ అప్‌డేట్!
ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా కథకు సంబంధించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. సినిమా కథ అదేనంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అదేంటి అంటే.. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా కథ.. మెగాస్టార్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’ (Gang Leader Movie)కి దగ్గరగా ఉంటుందట. విజయ్ మూవీ కూడా ‘గ్యాంగ్ లీడర్’లాగే ముగ్గురు అన్నదమ్ముల కథ అట. అందులో విజయ్ శాంతి.. చిరంజీవి ఇంట్లో అద్దెకి వచ్చినట్టు, ఇందులో మృణాల్ ఠాకూర్ .. విజయ్ ఇంట్లో రెంట్‌కి దిగుతుందట. కాకపోతే ఇది హీరోయిన్ రీవెంజ్ స్టోరీ అని అంటున్నారు. చివర్లో విజయ్ ఆమెకు అండగా నిలబడతాడని చెబుతున్నారు. ఈ కథ నిజమో కాదో తెలియాలంటే.. ఏప్రిల్ 5 వరకు వేచి చూడాల్సిందే.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!