• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Guntur Kaaram On Netflix: లక్ష్యానికి అడుగు దూరంలో ఆగిపోయిన ‘గుంటూరు కారం’.. ఎలాగంటే?

    తెలుగు స్టార్‌ హీరో మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram Srinivas) దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. దాదాపు మూడు వారాల పాటు థియేటర్‌లో సత్తా చాటిన ఈ సినిమా.. ఈ అర్ధరాత్రి (ఫిబ్రవరి 9) నుంచి ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో గుంటూరు కారంలోని హైలెట్‌ సీన్లను నెటిజన్లు ఎక్స్‌లో షేర్‌ చేస్తున్నారు. #GunturKaaramOnNetflix హ్యాష్‌ట్యాగ్‌తో వాటిని ట్రెండింగ్‌ చేస్తున్నారు. 

    ఐదు భాషల్లో స్ట్రీమింగ్

    గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా (Guntur Kaaram On Netflix) గత నెల 12న థియేటర్లలో రిలీజ్ అయింది. తొలి రోజు మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఫ్యామిలీ ఆడియన్స్‌ సపోర్టుతో కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్‌ సాధించగల్గింది. అయితే థియేటర్ల ఆదరణ రోజు రోజుకూ తగ్గుతూ వస్తుండటంతో నెల రోజులు తిరగకముందే ఈ సినిమా నెట్‌ఫ్లిక్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేటర్లలో తెలుగులో మాత్రమే రిలీజైన ఈ చిత్రం.. ఓటీటీలో ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ గుంటూరు కారం చిత్రం ట్రెండింగ్ అవుతోంది. 

    మహేష్‌ను దెబ్బతీసిన హనుమాన్‌!

    గుంటూరు కారం మూవీకి మొదటి రోజు రికార్డు కలెక్షన్స్‌ వచ్చాయి.  మహేష్ బాబు ఇమేజ్‌తో పాటు త్రివిక్రమ్ స్టార్‌డమ్ కలిసి రావడంతో తొలిరోజు ఏకంగా రూ. 90 కోట్ల గ్రాస్.. రూ. 55 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. అంతేకాదు నాన్ ప్యాన్ ఇండియా క్యాటగిరిలో హైయ్యెస్ట్ ఫస్ట్ డే వసూళ్లను సాధించిన మూవీగా కూడా రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమాకు పోటీగా విడుదలైన హనుమాన్ చిత్రం.. సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ‘గుంటూరు కారం’ను దెబ్బతీసింది. అయినప్పటికీ మహేష్‌కు ఉన్న క్రేజ్‌ కారణంగా ‘గుంటూరు కారం’ చెప్పుకోతగ్గ వసూళ్లనే సాధించింది. 

    గురూజీపై తిట్ల పురాణం!

    ‘గుంటూరు కారం’ (Guntur Kaaram On Netflix) సినిమా మహేష్‌ ఫ్యాన్స్‌కు అంతగా రుచించలేదు. దీంతో అప్పట్లో వారు దర్శకుడు త్రివిక్రమ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. మహేష్‌ లాంటి హీరోను పెట్టుకొని కూడా సింగిల్‌ లైన్‌ పాయింట్‌తో సినిమాను చుట్టేసాడని విమర్శించారు. తల్లితో కుమారుడికి ఎలాంటి సంబంధం లేదంటూ ప్రామిసరి నోట్ రాసి ఇవ్వడంపైనే ఈ సినిమా మెుత్తం నడిపించారని అసహనం వ్యక్తం చేశారు. మహేష్‌ మాస్‌ లుక్‌పై పెట్టిన శ్రద్ధ స్టోరీతో పాటు స్క్రీన్‌ప్లేపై పెట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఓవరాల్‌గా మహేష్‌ ఇమేజ్‌, త్రివిక్రమ్‌ స్థాయికి తగ్గట్టు సినిమా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 

    కలెక్షన్స్‌ ఎంతంటే?

    ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) బాక్సాఫీస్ వసూళ్ల విషయానికొస్తే.. ఈ సినిమా ఇప్పటివరకూ వరల్డ్‌వైడ్‌గా రూ.126.47 కోట్ల నెట్‌ (రూ. 200 కోట్లు పైగా గ్రాస్) వసూళ్లు రాబట్టినట్లు శాక్‌నిక్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందు రూ.132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ.133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో సంక్రాంతి బరిలో నిలిచింది. అయితే లక్ష్యానికి అడుగు దూరంలో అంటే రూ.8 కోట్ల నష్టంతో గుంటూరు కారం తన పరుగును ఆపేసింది. ఏదేమైనా నెగిటివ్ టాక్‌తో ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం అంటే మాములు విషయం కాదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv