• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Infinix Hot 50 5G: రూ.10 వేలలో కళ్లు చెదిరే మెుబైల్‌.. ఈ నయా ఇన్ఫినిక్స్‌ను అసలు మిస్‌ చేసుకోవద్దు!

    ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘ఇన్ఫినిక్స్’ (Infinix) భారత్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ‘ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ’ (Infinix Hot 50 5G) పేరిట హాట్ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను పరిచయం చేసింది. తక్కువ బడ్జెట్‌లో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు కావాలని కోరుకునే వారికి తమ మెుబైల్‌ బెస్ట్ ఛాయిస్‌ అని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. మరి ఈ నయా ఫోన్‌ ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత? మెుబైల్‌కు సంబంధించిన ఇతర విశేషాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 

    మెుబైల్‌ స్క్రీన్‌

    Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్  6.7 అంగుళాల HD+ స్క్రీన్‌తో లాంచ్ అయ్యింది. 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 720 x 1600 pixels, 20:9 రేషియో, IP54 డస్ట్‌ అండ్‌ స్ప్లాష్‌ రెసిస్టెంట్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత XOS 14.5 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై మెుబైల్‌ వర్క్‌ చేస్తుంది. Mediatek Dimensity 6300 చిప్‌సెట్‌, Mali-G57 MC2 జీపీయూ మెుబైల్‌లో ఫిక్స్‌ చేశారు. 

    డిజైన్‌

    ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ 7.8mm మందంతో స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్ కర్వడ్ ఎడ్జ్‌లతో రెక్టాంగులర్ మాడ్యూల్‌పై డ్యూయల్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. డ్రీమీ పర్పుల్ వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌తో ఈ ఫోన్‌ను తయారు చేశారు. బ్యాక్ ప్యానెల్ దిగువ భాగంలో ఇన్ఫినిక్స్ 5జీ బ్రాండ్‌ క్లీన్‌గా కనిపించేలా మెుబైల్‌ను డిజైన్‌ చేశారు.

    మెుబైల్‌ స్టోరేజ్‌

    Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో లాంచ్ అయ్యింది. 128GB ROM/ 4GB RAM, 128GB ROM/ 8GB RAM మెుబైల్‌ను పొందవచ్చు. రెండు వేరియంట్లలో స్టోరేజ్‌ సామార్థ్యం స్థిరంగా ఉండటం గమనార్హం. వీటిలో మీ అవసరానికి అనుగుణంగా ఉన్న ర్యామ్‌ మెుబైల్‌ను తీసుకునే వెసులుబాటును కంపెనీ కల్పించింది. 

    కెమెరా

    ఇన్ఫినిక్స్‌ హాట్‌ 50 5జీ మెుబైల్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 48MP Sony IMX ప్రైమరీ కెమెరా, 2MP AI సెకండరీ లెన్స్‌తో పాటు ఒక ఫ్లాష్‌ లైట్‌ ఫోన్‌ వెనుక భాగంలో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ కోసం ముందువైపు 8MP కెమెరాను అమర్చారు. వీటి సాయంతో క్వాలిటీ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి.

    బ్యాటరీ

    Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్‌కు Li-Po 5000mAh పవర్‌ఫుల్‌ బ్యాటరీని అమర్చారు. 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా మెుబైల్‌కు అందించారు. దీని ద్వారా మెుబైల్‌ను వేగంగా ఛార్జ్‌ చేసుకోవచ్చు. 

    కనెక్టివిటీ ఫీచర్స్

    ఈ నయా ఇన్ఫినిక్స్ మెుబైల్‌లో అడ్వాన్స్‌డ్‌ కనెక్టింగ్‌ ఫీచర్లు ఉన్నాయి. 5G నెట్‌వర్క్‌, Wi-Fi 802.11 a/b/g/n/ac, Bluetooth 5.4, GPS, USB Type-C 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌, యాక్సిరోమీటర్‌ (accelerometer), ప్రొక్సిమిటీ (proximity), ఎలక్ట్రానికి దిక్సూచి (compass) వంటి సెన్సార్లు కూడా ఫోన్‌లో అమర్చారు. 

    కలర్ ఆప్షన్స్‌

    ఇన్ఫినిక్స్‌ హాట్‌ 50 5జీ స్మార్ట్‌ఫోన్‌ నాలుగు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. స్లీక్ బ్లాక్ (Sleek Black), వైబ్రాంట్ బ్లూ (Vibrant Blue), సేజ్ గ్రీన్ (Sage Green), డ్రీమీ పర్పుల్ (Dreamy Purple) అనే నాలుగు కలర్ వేరియంట్లలో మెుబైల్‌ను పొందవచ్చు.

    ధర ఎంతంటే?

    ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ ధరను వేరియంట్ల ఆధారంగా నిర్ణయించారు. ఈ ఫోన్ 4GB RAM, 8GB RAM వేరియంట్లలో రిలీజైన సంగతి తెలిసిందే. బేస్ వేరియంట్ ధర రూ.9,999 కాగా, 8GB  వేరియంట్ రూ.10,999కు లభించనుంది. సెప్టెంబర్ 9 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మెుబైల్‌ సేల్ ప్రారంభం కానుంది. ఈ మెుబైల్‌ ధరను తగ్గించే బ్యాంక్ డిస్కౌంట్లు కూడా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. రూ.1000 వరకూ డిస్కౌంట్‌ పొందవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv