నటీనటులు : టొవినో థామస్, చెంబన్ వినోద్, రోషన్ మ్యాథ్యూ, రీమా కల్లింగల్, షైన్ టామ్ చాకో, అభిరామ్ రాధా కృష్ణ
డైరెక్టర్: ఆషిక్ అబు
సినిమాటోగ్రఫీ : గిరిష్ గంగాధరన్
ఎడిటింగ్ : వి. సాజన్
సంగీతం : బిజిబాల్, రెక్స్ విజయన్
నిర్మాతలు : అషిక్ అబు, రీమా కల్లింగల్
ఓటీటీ : ఆహా
డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి ఈ వారం ఓ మలయాళ హర్రర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. 1964లో మలయాళంలో వచ్చిన ‘భార్గవి నిలయం’ (Bhargavi Nilayam) సినిమాను తిరిగి 2023లో ‘నీలవెలిచం’ (Neelavelicham) పేరుతో కొన్ని మార్పులు చేసి రిమేక్ చేశారు. ఈ మూవీలో స్టార్ హీరో టోవినో థామస్, రీమా కల్లింగల్, రోషన్ మాథ్యూ, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించారు. అశిక్ అబు దర్శకత్వం వహించాడు. గతేడాది ఏప్రిల్‌లో రిలీజ్ అయిన ఈ చిత్రం మలయాళ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. తాజాగా ఆ సినిమాను తెలుగులో ‘భార్గవి నిలయం’ (Bhargavi Nilayam)గా అనువాదం చేసి ఓటీటీలో తీసుకొచ్చారు. ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
సముద్రతీరానికి సమీపంలో ఉన్న పల్లెటూళ్లో భార్గవి నిలయం చాలా రోజులుగా మూతపడి ఉంటుంది. ఆ బంగళా పేరు వింటనే ఊరివాళ్లు వణికిపోతుంటారు. భార్గవి (రీమా కల్లింగల్) అనే అమ్మాయి ఆత్మగా మారి ఆ ఇంట్లో తిరుగుతుందని అందులో అడుగుపెట్టిన వారిని చంపడానికి ప్రయత్నిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో బషీర్ (టోవినో థామస్) అనే రైటర్ ఆ ఊరికి కొత్తగా వస్తాడు. భార్గవి నిలయం చరిత్ర గురించి తెలియక అందులో అద్దెకు దిగుతాడు. ఇల్లు మారేందుకు డబ్బుల్లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఆత్మతో స్నేహం చేస్తాడు. ఆమెపై కథ రాయాలని ఫిక్సవుతాడు. అసలు భార్గవి ఎందుకు చనిపోయింది? ఆమెను ప్రాణంగా ప్రేమించిన శివకుమార్ (రోషన్ మాథ్యూ) ఎలా అదృశ్యం అయ్యాడు? ఈ ప్రేమ జంట జీవితంలోని మిస్టరీని బషీర్ ఎలా బయటపెట్టాడు? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
రచయిత పాత్రలో టోవినో థామస్ నటన బాగుంది. అతడి లుక్, డైలాగ్ డెలివరీ గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా అనిపిస్తాయి. సినిమా మెుత్తాన్ని ఆయన భుజస్కందాలపై వేసుకొని మోశారు. కీలక సన్నివేశాల్లో నటుడిగా తన మార్క్ ఏంటో చూపించాడు. అటు ప్రేమ జంటగా రీమా కల్లింగల్, రోషన్ మథ్యూ పర్వాలేదనిపించారు. విలన్‌గా టామ్ చాకో యాక్టింగ్ బాగుంది. విలన్ పాత్రపై అతడు గట్టి ప్రభావాన్నే చూపారు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ఆషిక్ అబు ఒక రొటిన్ స్టోరీనే ఈ సినిమాకు ఎంచుకున్నప్పటికీ కథనాన్ని మాత్రం ఆసక్తికరంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఒక ప్రేమ జంట జీవితంలోని విషాదాన్ని ఓ రచయిత వెలికితీసే క్రమంలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. భార్గవి ఆత్మ ఉన్న ఇంట్లో హీరో దిగడం, ఆ ఊరి వాళ్లు భయంకరమైన కథలతో అతడ్ని భయపెట్టడం ఇంటస్ట్రింగ్‌గా అనిపిస్తాయి. అసలేం జరుగుతుందా అన్న ఆసక్తిని కలిగిస్తాయి. ఈ క్రమంలో వచ్చే కొన్ని హార్రర్ ఎలిమెంట్స్ భయపెడతాయి. ఇంటర్వెల్‌కు ముందు హీరోకు ఆత్మతో దోస్తీ కుదరడంతో సెకండాఫ్‌పై ఆసక్తి ఏర్పడుతుంది. ద్వితియార్థంలో భార్గవి – శివకుమార్ లవ్‌స్టోరీ, వారి ప్రేమకథకు విలన్ ఎవరన్నది డైరెక్టర్ చూపించారు. భార్గవి మరణానికి కారణంతో పాటు ఆమె రివేంజ్ డ్రామాను ఆసక్టికరంగా చూపించి కథ ముగించారు. అయితే రొటిన్ స్టోరీ, బోరింగ్ లవ్ ట్రాక్, రెగ్యులర్ హార్రర్ సీన్స్ సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ మంచి పనితీరు కనబరిచాడు. తన కెమెరా పనితనంతో 1964 కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టాడు. అటు నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- టోవినో థామస్ నటన
- ఆసక్తికర కథనం
- సాంకేతిక విభాగం
మైనస్ పాయింట్స్
- రొటిన్ హార్రర్ కాన్సెప్ట్
- థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం