‘ఆర్ఆర్‌ఆర్’ (RRR) తర్వాత రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. వినాయక చవితి రోజున చరణ్ సినిమాకు సంబంధించి బిగ్ సర్‌ప్రైజ్ ఉంటుందని అంటున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
రిలీజ్ డేట్ లాక్?
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా నుంచి భారీ అప్‍డేట్ సిద్ధమైందని తెలుస్తోంది. ఎంతగానో ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్‍తో ఓ పోస్టర్‌ను మూవీ టీమ్ తీసుకొస్తున్నట్టు సమాచారం. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసే అవకాశముందని ఫిల్మ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు డిసెంబర్‌లో గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుందంటూ స్పష్టం చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
టీజర్‌కు రంగం సిద్ధం
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇప్పటివరకూ ఆశించిన స్థాయిలో కంటెంట్ రిలీజ్ కాలేదు. ఈ నేపథ్యంలో ఓ టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలలోనే టీజర్‌ను రిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేయాలని గేమ్ ఛేంజర్ టీమ్ భావిస్తున్నట్లు తెలిసింది. తద్వారా ఒకే నెలలో రెండు అప్‌డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ చివరి వారంలో ఈ టీజర్ విడుదల కావొచ్చని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.
క్రిస్మస్‌కే ఎందుకు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను మెగా హీరో రామ్‌చరణ్ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటించిన ‘సలార్’ (Salaar: Part 1 – Ceasefire) చిత్రం గతేడాది క్రిస్మస్ కానుకగానే విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే సలార్ క్రిస్మస్‌కే రిలీజ్ కావడానికి ఓ కారణం ఉంది. 2024 సంక్రాతి బరిలో మహేష్ బాబు (గుంటూరు కారం), నాగార్జున (నాసామి రంగ), వెంకటేష్ (సైంధవ్), తేజ సజ్జా (హనుమాన్) వంటి స్టార్ హీరోలు నిలిచారు. వారితో పోటి పడి కలెక్షన్స్ పంచుకోవడం కన్నా సోలోగా వచ్చి మంచి వసూళ్లు సాధించాలని ప్రభాస్‌తో పాటు సలార్ యూనిట్ నిర్ణయించారు. ప్రస్తుతం అదే విధంగా రామ్‌చరణ్ & కో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 2025 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ లాకై ఉంది. అలాగే వెంకటేష్- అనిల్ రావిపూడి చిత్రంతో పాటు అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. కాబట్టి క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తే ప్రభాస్ తరహాలోనే బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించవచ్చని రామ్‌చణ్ భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
డైరెక్టర్ శంకర్ భారీ ఆశలు!
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ‘ఐ’, ‘స్నేహితుడు’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్ తిరిగి సక్సెస్ బాటలో పడేందుకు ‘గేమ్ ఛేంజర్’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్ ఛేంజర్’ పూడుస్తుందని దిల్ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్