నాని లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తద్వారా తొలి 8 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.73.6 కోట్లు (GROSS) కొల్లగొట్టి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడి వడిగా అడుగువేస్తోంది. థియేటర్ ఆక్యుపెన్సీ ఏమాత్రం తగ్గకపోవడంతో రెండు మూడు రోజుల్లోనే ఈ ఫీట్ సాధించే అవకాశం స్పష్టం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.
Contents
దసరా (Dasara)
నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా‘ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.120.4 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. రూ.55 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం నాని కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా నిలిచింది. అటు తొలి రోజున రూ.38.7 కోట్లు కొల్లగొట్టి అత్యధిక డే1 వసూళ్లు రాబట్టిన నాని ఫిల్మ్‌గానూ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని అందుకునేందుకు ‘సరిపోదా శనివారం’ దూసుకెళ్తోంది.
Budget : 55cr
First Day Collection Worldwide : 38.7cr
Worldwide Collection : 120.4cr
Overseas Collection : 21.8cr
India Gross Collection : 98.6cr
ఈగ (Eega)
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ చిత్రం నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఉంది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100.3 కోట్లు కొల్లగొట్టింది. అయితే ఇందులో నాని ఫుల్‌లెంగ్త్ పాత్ర చేయలేదు. అతడిది గెస్ట్ రోల్‌లాగా అనిపిస్తుంది. అందుకే ట్రేడ్ వర్గాలు నాని రూ.100 కోట్ల సినిమాల జాబితాలో ఈగను చేర్చలేదు.
Budget : 30cr
First Day Collection Worldwide : 6.5cr
Worldwide Collection : 100.3cr
Overseas Collection : 13.8cr
India Gross Collection : 86.5cr
హాయ్ నాన్న (Hi Nanna)
నాని రీసెంట్ చిత్రం ‘హాయ్ నాన్న’ రూ.77.2 కోట్ల (GROSS) కలెక్షన్స్‌తో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. శౌర్యువ్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం తండ్రి కూతురు సెంటిమెంట్‌తో వచ్చింది. ఇందులో నానికి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. తొలి రోజున ఈ చిత్రం రూ.10.5 కోట్లు కొల్లగొట్టింది. నటుడిగా నానికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
Budget : 45cr
First Day Collection Worldwide : 10.5cr
Worldwide Collection : 77.2cr
Overseas Collection : 18.5cr
India Gross Collection : 58.7cr
సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)
నాని లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ ప్రస్తుతానికి ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం రూ.73.6 కోట్ల (GROSS) కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్ వద్ద రన్ అవుతోంది. ఏ క్షణంలోనైనా ఈ జాబితాలో పైకి ఎగబాకవచ్చు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రూ.55 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరక్కించారు. తొలిరోజే ఈ సినిమా రూ.21.8 కోట్లు కొల్లగొట్టింది. మూడు రోజుల్లోనే లాభాల్లోకి అడుగుపెట్టింది.
Language : Telugu
Budget : 55cr
First Day Collection Worldwide : 21.8cr
Worldwide Collection : 73.6cr (still running)
Overseas Collection : 22.4cr (still running)
India Gross Collection : 51.4cr (still running)
MCA మిడిల్ క్లాస్ అబ్బాయి (MCA: Middle Class Abbayi)
నాని హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.72.6 కోట్లు రాబట్టింది. ఇందులో నానికి జోడీగా సాయిపల్లవి చేసింది. వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ బాగుందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపించాయి.
Budget : 25cr
First Day Collection Worldwide : 15.6cr
Worldwide Collection : 72.6cr
Overseas Collection : 10.2cr
India Gross Collection : 62.4cr
నేను లోకల్ (Nenu Local)
నాని, కీర్తి సురేష్ జంటగా చేసిన ‘నేను లోకల్‘ చిత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కేవలం రూ.15 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.61.2 కోట్లు (GROSS) వసూలు చేసింది. తద్వారా ఈ జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. ఈ మూవీ నటుడిగా నానికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
Budget : 15cr
First Day Collection Worldwide : 9.7cr
Worldwide Collection : 61.2cr
Overseas Collection : 9.8cr
India Gross Collection : 51.4cr
నిన్ను కోరి (Ninnu Kori)
శివ నిర్వాణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ ఫిల్మ్ కూడా నాని కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో నాని లవ్ ఫెయిల్యూర్ అయిన యువకుడిగా నటించాడు. రూ.20కో ట్ల ఖర్చుతో రూపొందిన ఈ ఫిల్మ్ వరల్డ్‌వైడ్‌గా రూ.59.2 కోట్లు రాబట్టింది.
Budget : 20cr
First Day Collection Worldwide : 10.6cr
Worldwide Collection : 59.2cr
Overseas Collection : 10.3cr
India Gross Collection : 48.9cr
జెర్సీ (Jersey)
నటుడిగా నాని మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘జెర్సీ‘. గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 58.7 కోట్లు రాబట్టింది. ఒక్క ఇండియాలోనే రూ. 47.3 కోట్లు తన ఖాతాలో వేసుకుంది.
Budget : 30cr
First Day Collection Worldwide : 11.2cr
Worldwide Collection : 58.7cr
Overseas Collection : 11.4cr
India Gross Collection : 47.3cr
శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy)
పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.51.8 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఇందులో సాయి పల్లవితో పాటు కృతి శెట్టి హీరోయిన్‌గా చేసింది.
Budget : 40cr
First Day Collection Worldwide : 11.7cr
Worldwide Collection : 51.8cr
Overseas Collection : 6.5cr
India Gross Collection : 45.3cr
భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy)
నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన పదో చిత్రంగా ‘భలే భలే మగాడివోయ్’ నిలిచింది. మారుతీ డైరెక్షన్‌లో రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.50.2 కోట్లను రాబట్టింది. ఇందులో మతిమరుపు ఉన్న వ్యక్తిగా నాని అద్భుత నటన కనబరిచాడు.
Budget : 10cr
First Day Collection Worldwide : 5.2cr
Worldwide Collection : 50.2cr
Overseas Collection : 11.6cr
India Gross Collection : 38.6cr
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్