మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara: Part 1). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు సరిగ్గా 22 రోజుల సమయమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగా బుధవారం (సెప్టెంబర్ 4) థర్డ్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘దావూదీ’ (Daavudi Song) అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదే సమయంలో పెద్ద ఎత్తున ట్రోల్‌కు సైతం ఈ సాంగ్ గురవుతోంది. ఈ విచిత్ర పరిస్థితి చూసి అటు దేవర టీమ్‌తో పాటు తారక్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ‘దావూదీ’ పాటపై వస్తున్న ప్రశంసలు, విమర్శల గురించి ఈ కథనంలో పరిశీలిద్దాం.
పెప్పీ బీట్‌తో వచ్చిన ‘దావూదీ’
‘దేవర’ చిత్రం నుంచి ఇటీవల రిలీజైన ‘ఫియర్’ (Fear Song), ‘చుట్టమల్లే’ (Chuttamalle Song) పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో సహజంగానే మూడో పాటపై పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మేకర్స్ బుధవారం (సెప్టెంబర్ 4) సాయంత్రం ‘దావూదీ’ పేరుతో ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో తారక్ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. అటు తారక్‌కు దీటుగా స్టెప్పులేసి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అదరహో అనిపించుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ పాటను అనిరుద్ పెప్పీ బీట్‌తో రూపొందించారు. రామజోగయ్య శాస్త్రి తెలుగులో లిరిక్స్ అందించారు. నకష్ అజీజ్, ఆకాశ స్వరాన్ని సమకూర్చారు.
యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్..
‘దావూదీ’ సాంగ్‌కు యూట్యూబ్‌లో విశేష ఆదరణ లభిస్తోంది. 24 గంటలు పూర్తికాకుండానే ఈ చిత్రం 25 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దేవర టీమ్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దావూదీ సాంగ్‌లోని తారక్, జాన్వీ కపూర్ బ్యూటీఫుల్ ఫోజును ఈ పోస్టర్‌లో పొందుపరిచింది. ప్రస్తుతం ‘దావూదీ’ సాంగ్ జాతీయ స్థాయిలో యూట్యూబ్‌లో నెంబర్ 1 పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది. గంట గంటకు లక్షల్లో వ్యూస్ పెంచుకుంటూ 50 మిలియన్ వ్యూస్ దిశగా దూసుకుపోతోంది.
మెస్మరైజింగ్ డ్యాన్స్
దావూదీ సాంగ్‌లో తారక్ డ్యాన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తారక్ ఎనర్జిటిక్ స్టెప్పులు పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన అతి కష్టమైన స్టెప్పులను సైతం తారక్ చాలా ఈజీగా వేశారు. దావూదీ సాంగ్‌లో తారక్ జోష్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ నాటు నాటు పాటను గుర్తుకు తెచ్చింది. అటు జాన్వీ కపూర్ కూడా తారక్‌కు ధీటుగా స్టెప్పులేసి తానూ ఏమాత్రం తక్కువ కాదని నిరూపించింది. అటు సోషల్ మీడియాలోనూ వీరిద్దరి డ్యాన్స్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తారక్‌ను ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఒక దశాబ్దం వెనక్కి వెళ్లి చూసినా తారక్‌లో ఇదే ఎనర్జీ ఉందంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. దావూదీ సాంగ్ షూటింగ్ సమయంలో కండరాల నొప్పితో తారక్ బాధపడ్డారని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఆ బాధను భరిస్తూనే అద్భుతంగా డ్యాన్స్ చేయడం నిజంగా గ్రేట్ అంటూ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో తారక్‌ను పోలుస్తూ మరో నెటిజన్ పెట్టిన పోస్టు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
వెంటాడుతున్న ట్రోల్స్
దేవర థర్డ్ సింగిల్ ‘దావూదీ’పై ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలు సైతం వస్తున్నాయి. కొందరు నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ సాంగ్‌ను ట్రోల్ చేస్తున్నారు. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ బాగోలేదని కామెంట్స్ చేస్తున్నారు. తమిళ స్టార్ విజయ్ నటించిన ‘బీస్ట్’ చిత్రంలోని ‘అరబిక్ కుత్తు’ను తలపిస్తోందంటూ పోస్టులు పెడుతున్నారు. విజయ్, తారక్ వేసిన స్టెప్స్ కూడా సేమ్ టూ సేమ్ ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు. అటు ఎన్టీఆర్‌ను సైతం వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. జాన్వీ కంటే ఎన్టీఆర్ తక్కువ ఎత్తు ఉన్నాడని, అందుకే ఆమె బెండ్ అయ్యి మరీ స్టెప్పులు వేయాల్సి వచ్చిందని ట్రోల్ చేస్తున్నారు. ‘దావూదీ’ పాటలో తారక్ హైహీల్స్ లాంటి షూస్‌ను వేసుకోవాడాన్ని కొందరు హైలేట్ చేస్తున్నారు. ఓ వైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలతో ‘దావూదీ’ పాటకు వింత పరిస్థితి ఎదురవుతోంది.
సెప్టెంబర్ 27న థియేటర్లలో ‘దేవర’
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా ‘దేవర’. దీనికి ముందు వీళ్లిద్దరి కలయికలో ‘జనతా గ్యారేజ్’ సినిమా వచ్చింది. అంతకు ముందు ‘బృందావనం’ చిత్రానికి రచయితగానూ కొరటాల శివ పని చేశారు. దీంతో వీరిద్దరు ఎలాంటి మ్యాజిక్ చేస్తారోనని తారక్ అభిమానులతో పాటు సినీ ఆడియన్స్‌తో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ‘దేవర’ సినిమాకు ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్