• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Eagle Movie: ‘ఈగల్‌’ గురించి పూనకాలు తెప్పించే మాట చెప్పిన నిర్మాత.. అదే నిజమైతే!

    మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’ (Eagle Movie). అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran), కావ్యా థాపర్‌ (Kavya Thapar) హీరోయిన్లుగా నటించారు. నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషించారు. రవితేజతో ‘ధమాకా’ సినిమాని నిర్మించిన టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, ప్రమోషన్‌ పోస్టర్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈగల్‌పై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. దీంతో సినిమాపై హైప్‌ మరింత పెరిగింది. 

    ‘ఈగల్’ క్లైమాక్స్‌.. నెవర్‌ బిఫోర్‌!

    తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన ‘ఈగల్’ నిర్మాత విశ్వ ప్రసాద్.. మూవీ క్లైమాక్స్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈగల్.. చివరి 40 నిమిషాలు నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. ఇంత వరకు తెలుగులో అలాంటి అవుట్ పుట్ వచ్చి ఉండదు. ఎక్కువ చేసి చెప్పడం లేదు, బాహుబలితో కంపేర్ చేయడం లేదు గానీ.. లోకేష్ కనకరాజు స్టైల్లో క్లైమాక్స్ ఉంటుంది. సాధారణ తెలుగు సినిమాల క్లైమాక్స్‌కి పూర్తి భిన్నంగా ఉంటుంది. తెలుగులో ఇప్పటిదాకా ఇలాంటి క్లైమాక్స్ చూసి ఉండరు’ అంటూ సినిమాపై మరింత హైప్ పెంచేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈగల్‌ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో పెరిగిపోయింది. 

    టికెట్‌ రేట్లు సాధారణమే..

    గత కొంతకాలంగా స్టార్‌ హీరో సినిమా వస్తుందంటే టికెట్‌ రేట్లు పెంచడం అనివార్యమవుతోంది. అయితే రవితేజ ‘ఈగల్‌’ (Eagle) చిత్రం మాత్రం టికెట్‌ పెంపునకు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. ఈగల్‌ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాధారణ టికెట్ రేట్లు ఉంచడం విశేషం. దీని ప్రకారం హైదరాబాద్ పీవీఆర్ – ఐనాక్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ‘ఈగల్’ టికెట్ రేటు రూ.200గా ఉండనుంది. ఏషియన్ మల్టీప్లెక్స్‌లలో కొన్ని చోట్ల రూ.175కే టికెట్ పొందవచ్చు. ఇక సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు విషయానికి వస్తే… బాల్కనీ రేటు రూ.150 మాత్రమే. మెజారిటీ సింగిల్ స్క్రీన్లలో రూ.110, కొన్ని థియేటర్లలో రూ.145లకు టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు.

    ‘ఈగ‌ల్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌!

    ఇక ఈగల్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్ అంటూ కొన్ని అంకెలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీని ప్రకారం.. ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.21 కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం. ఏపీ, తెలంగాణ‌లో క‌లిపి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.17 కోట్ల‌కు జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. ఓవ‌ర్‌సీస్‌లో రూ.2 కోట్లు.. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుతో పాటు ఇత‌ర రాష్ట్రాలు కలిపి మ‌రో రూ.2 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. దీని ప్రకారం 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈగల్‌ రిలీజ్ అవుతోంది.

    తగ్గిన రవితేజ మార్కెట్‌!

    రవితేజ రీసెంట్‌ మూవీ ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’తో పోలిస్తే ‘ఈగల్‌’ ప్రీరిలీజ్ బిజినెస్ భారీ కోత పడింది. టైగర్‌ నాగేశ్వరరావు థియేట్రిక‌ల్ హ‌క్కులు గతంలో రూ.37 కోట్ల‌కు అమ్ముడుపోయాయి. ర‌వితేజ కెరీర్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా అది నిలిచింది. దానితో పోలిస్తే ‘ఈగ‌ల్’ మాత్రం రూ.16 కోట్లు త‌క్కువకే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ ప‌రంగా చూస్తే మాత్రం ర‌వితేజ టాప్-5 చిత్రాల్లో ఒక‌టిగా ఈగ‌ల్ నిలిచింది. రావ‌ణాసుర‌, ఖిలాడి సినిమాల థియేట్రిక‌ల్ హ‌క్కులు రూ.22 కోట్ల వ‌ర‌కు అమ్ముడుపోగా.. వాటి త‌ర్వాత నాలుగో స్థానంలో ఈగ‌ల్ నిలిచింది.

    ఈగల్‌లో రవితేజ పాత్ర అదే!

    ఈగ‌ల్ సినిమాలో ర‌వితేజ రైతు స‌మ‌స్య‌ల‌పై పోరాడే షూట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ట్రైలర్‌, టీజర్‌ చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. వాస్తవానికి ఈగల్‌ సినిమా సంక్రాంతికి రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ సంక్రాంతి బ‌రిలో గుంటూరు కారం, సైంధ‌వ్‌, నా సామిరంగ‌, హ‌నుమాన్ రిలీజ్ కావ‌డంతో ఈగ‌ల్ వాయిదాప‌డింది. అటు రవితేజ తన త‌ర్వాతి చిత్రాన్ని డైరెక్టర్‌ హ‌రీష్ శంక‌ర్‌తో చేస్తున్నాడు. దీనికి ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశముంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv