• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 69th Filmfare Awards 2024: బాలీవుడ్ ఇలాకాలో టాలీవుడ్‌ జెండా.. తెలుగోడి సత్తా అంటే ఇదే!

    బాలీవుడ్‌ ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ (69th FilmFare Awards) అవార్డుల జాబితా వచ్చేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ వేదికగా అట్టహసంగా సాగిన ఈ వేడుకలో విజేతలను ప్రకటించారు. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు. టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన యానిమల్‌ (Animal) చిత్రానికి అవార్డుల పంట పడింది. అందరూ ఊహించినట్లుగానే సందీప్‌.. ఫిల్మ్‌ఫేర్‌ వేడుకల్లో తన సత్తా ఏంటో చూపించాడు. మెుత్తం ఐదు అవార్డులను కొల్లగొట్టి టాలీవుడ్‌ జెండా బాలీవుడ్‌లో ఎగిరేలా చేశాడు. 

    బాలీవుడ్‌లో ‘యానిమల్‌’ తుఫాన్‌!

    డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ‘యానిమల్’ చిత్రం థియేటర్లలో ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.910 కలెక్షన్లను సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా సత్తాచాటుతోంది. తాజాగా ప్రకటించిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లోనూ సందీప్‌ మూవీ ‘యానిమల్‌’ దుమ్మురేపింది. నటుడు, గాయకుడు, సంగీతం (పాటలు), నేపథ్య సంగీతం, సౌండ్ డిజైన్‌ ఇలా మెుత్తం ఐదు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ఈ వేడుకల్లో అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా నిలిచింది.

    అదరగొట్టిన ‘12th ఫెయిల్‌’

    ఇటీవల విడుదలైన ‘12th ఫెయిల్‌’ (12th Fail) చిత్రం కూడా యానిమల్‌ తరహాలోనే 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ అవార్డు వేడుకల్లో అదరగొట్టింది. యానిమల్‌తో సమానంగా ఐదు అవార్డులను గెలుచుకొని అందరిచేత ప్రశంసలు అందుకుంది. ఉత్తమ క్రిటిక్స్ నటుడు అవార్డుతో పాటు సినిమా, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌, దర్శకుడు విభాకాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. దీంతో 12th ఫెయిల్‌ అవార్డుల సంఖ్య ఐదుకు చేరాయి. మరోవైపు ‘రాకీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహాని’ నాలుగు అవార్డులు గెలుచుకొని మూడో స్థానంలో నిలిచింది.

    బెస్ట్‌ యాక్టర్స్‌గా భార్య భర్తలు

    ఫిల్మ్ ఫేర్ – 2024 పురస్కారాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు భార్యాభర్తలకు వచ్చాయి. ‘యానిమల్’ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor) అవార్డు అందుకోగా ‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని’ సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆలియా భట్ (Alia Bhatt) అవార్డు గెలుచుకున్నారు. పెళ్లి తర్వాత వీళ్లిద్దరి జంటకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు రావడం ఇది తొలిసారి. ఇక ఉత్తమ నటుడు క్రిటిక్స్‌ విభాగంలో విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌), ఉత్తమ నటి (క్రిటిక్స్‌) రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ), ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ) అవార్డులు సొంతం చేసుకున్నారు. 

    69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో విజేతలు వీరే:

    ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌

    ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జొరామ్‌

    ఉత్తమ దర్శకుడు:  విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)

    ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)

    ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌)

    ఉత్తమ నటి: అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)

    ఉత్తమ నటి (క్రిటిక్స్‌): రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌)

    ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ)

    ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)

    ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య(తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే)

    ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం: యానిమల్‌ 

    ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్‌ బాబల్‌ ( అర్జన్‌ వెయిలీ- యానిమల్‌)

    ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్‌)

    ఉత్తమ కథ: అమిత్‌ రాయ్‌ (OMG 2)

    ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)

    ఉత్తమ డైలాగ్‌: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv