• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రీ రిలీజ్‌కు సిద్ధమైన ముత్తు

    సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన క్లాసిక్ మూవీ ‘ముత్తు’ సినిమా రీరిలీజ్‌కు సిద్ధమైంది. తమిళ్ సహా తెలుగులో కూడా ఈ చిత్రం రిలీజ్‌ చేయనున్నారు. ఇంకా డేట్ ఫిక్స్ చేయనప్పటికీ నవంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రజినీకాంత్ కెరీర్‌లో ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌ సినిమాగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రజిని సరసన మీనా హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

    చిరంజీవి కొత్త నుంచి లెటెస్ట్ అప్‌డేట్

    మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబోలో వస్తున్న MEGA156 చిత్రం నుంచి లెటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని కీరవాణి తెలిపారు. ఇక ఈ పూజా కార్యక్రమంలో మెగాస్టార్ కొబ్బరికాయ కొట్టి లెజెండరీ దర్శకుడు కె రాఘవేంద్రరావు క్లాప్‌తో సినిమాని ప్రారంభించారు. https://x.com/UV_Creations/status/1716705085076681107?s=20

    భగవంత్ కేసరి రికార్డు కలెక్షన్లు

    బాలకృష్ణ లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 106. 2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. మరోవైపు అమెరికాలోనూ భగవంత్ కేసరి అదరగొడుతోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సంపాదించడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా శ్రీలీల కూతురుగా నటించింది. థమన్ సంగీతం అందించగా.. అనిల్ రావుపూడి డైరెక్ట్ చేశారు.

    OTT Releases This Week (Oct 24-28): ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న తెలుగు సూపర్ హిట్ చిత్రాలు ఇవే!

    దసరా పండుగ వేళ భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో వంటి  పెద్ద సినిమాలు విడుదల కావడంతో ఈ వారం థియేటర్లలో రిలీజ్‌కు చెప్పుకోదగ్గ సినిమాలు అయితే ఏమి లేవు. అయితే సంపూర్ణేష్ బాబు నటించిన మార్టిన్ లూథర్ కింగ్, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్ నటించిన ఘోస్ట్ చిత్రాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఇక ఓటీటీల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దాదాపు 20కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్దమయ్యాయి. ఇటీవల రిలీజైన చంద్రముఖి2, స్కందతో పాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. … Read more

    నాని కొత్త సినిమా టైటిల్ వచ్చేసిందోచ్‌..!

    ‘NANI 31’ చిత్రం టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్‌ చేశారు. ‘సరిపోదా శనివారం’ అనే పేరును సినిమాకు ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌, గ్లింప్స్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. సాయి కుమార్ వాయిస్ ఓవర్‌తో ఉన్న ఈ గ్లింప్స్ వీడియో ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుల్ నటించనుంది. విలక్షణ నటుడు ఎస్.జే. సూర్య కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రానికి జేక్స్ బెజొయ్ సంగీతం అందిస్తున్నారు.

    ‘లియో’ డివైడ్‌ టాక్.. డైరెక్టర్‌ ఏమన్నారంటే!

    లియో సినిమాపై నెటిజన్ల నుంచి వస్తోన్న మిశ్రమ స్పందనలపై డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ స్పందించారు. వాళ్ల నుంచి వచ్చే కామెంట్స్‌ను విశ్లేషించుకుంటానన్నారు. ప్రేక్షకుల అభిప్రాయం కోసం మరికొన్ని రోజులు తాను ఎదురుచూస్తానని చెప్పారు. తదుపరి చిత్రంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటానన్నారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌ నుంచి రజనీకాంత్‌ సినిమా పనులు మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. కాగా, లియో చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే ఏకంగా రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

    రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ గ్లింప్స్‌ రిలీజ్‌

    రాహుల్ రవింద్రన్‌ దర్శకత్వంలో రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మేకర్స్ ఓ స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ‘ప్రాణం కంటే ఎక్కువగా తనను ప్రేమిస్తుందనుకునే ఓ కుర్రాడు.. ఆ కుర్రాడిని ప్రేమించడానికి సర్వం కోల్పోయానుకునే లోలోపల భరించలేని బాధ అనుభవించే అమ్మాయి. వీరిద్దరి ప్రేమ గాధ ఏలా ఉంటుందన్న కాన్సెప్ట్‌’తో సినిమా తెరకెక్కినట్లు గ్లింప్స్‌ చూస్తే తెలుస్తోంది. అంతేకాకుండా ఇదొక ట్రాజిక్‌ లవ్‌ స్టోరీ అని, ఈ కుర్రాడు సైకో లాంటి మనిషని అర్థమవుతుంది. The world … Read more

    భగవంత్ కేసరి రికార్డు వసూళ్లు

    బాలయ్య నటించిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.32 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు రూ.19 కోట్లు కొల్లగొట్టడంతో ఈ చిత్రం రూ.50 కోట్ల మార్కును దాటేసింది. మొత్తానికి రెండు రోజుల్లోనే రూ.51.12 కోట్ల గ్రాస్ సాధించింది. ఇక వీకెండ్స్ ఉండటంతో కలెక్షన్లు ఇంకా సాలిడ్‌గా ఉండే అవకాశం ఉంది. అటు అమెరికాలోనూ భగవంత్ కేసరి 8 లక్షల డాలర్స్‌ మార్క్‌ను దాటేసింది.

    బోల్డ్ సీన్లలో పాయల్ రాజ్‌పూత్ అరాచకం

    అజయ్ భూపతి డైరెక్షన్‌లో వస్తున్న మంగళవారం మూవీ నుంచి ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్‌ను బట్టి చూస్తుంటే ప్రతి మంగళవారం ఓ ఊరిలో ఆడపిల్లలు చనిపోవడం మిస్టరీగా కనిపించింది. హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్ బోల్డ్ సీన్లలో యాక్ట్ చేసింది. కాగా ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అంజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ట్రైలర్ అయితే మంచి హైప్‌ను క్రియేట్ చేసింది అని చెప్పవచ్చు.

    RRR నిర్మాణ సంస్థ బ్యానర్‌లో నాని కొత్త సినిమా

    నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. అయితే ఈ చిత్రాన్ని RRR మూవీ మేకర్స్ DVV ఎంటర్‌టైన్‌ నిర్మించనుంది. నాని31 వర్కింగ్ టైటిల్‌తో సినిమాను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో ‘అంటే సుందరానికీ’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు మాత్రం రాలేదు. మరోవైపు హీరో నాని హాయ్‌ నాన్న సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయాలని … Read more