• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తొలిరోజు లియో రికార్డు వసూళ్లు

    తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’ తొలి రోజు రికార్డు కలెక్షన్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల మేర గ్రాస్బ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది కోలివుడ్ నుంచి విడుదలైన సినిమాల్లో ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా టాప్‌లో నిలిచింది. లోకేష్ కనగరాజు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ సంపాదించింది. ఇక నార్త్ అమెరికాలోనూ ‘లియో’ రికార్డు వసూళ్లు సాధించింది. అయితే కొంతమంది యాంటీ విజయ్ ఫ్యాన్స్ మాత్రం ‘లియో డిజాస్టర్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

    టైగర్ నాగేశ్వరరావు ట్విట్టర్ రివ్యూ

    మాస్ మహారాజ రవితేజ నటించిన టైగర్‌నాగేశ్వరరావు మూవీ నేడు విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ కామెంట్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ‘రవితేజ మాస్ యాక్షన్ అదిరిపోయింది. ఫస్టాఫ్ విజువల్ ఫీస్ట్. హీరో ఇంట్రడక్షన్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. లవ్‌ ట్రాక్ బాలేదు. సెకండాఫ్ సాగదీసినట్లు ఉంది. పాటలు మెప్పించవు. లెంగ్తీ రన్‌ టైం సినిమాకు మైనస్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. పూర్తి రివ్యూ మరికాసేపట్లో..

    ఆస్కార్ మెంబర్‌గా జూ. ఎన్టీఆర్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్కార్ అకడామీ మెంబర్‌గా సెలెక్ట్ అయ్యాడు. తాజాగా అకాడమీ కొత్త మెంబర్స్ లిస్ట్‌ని ఆస్కార్ అనౌన్స్ చేసింది. ఎన్టీఆర్ ఆస్కార్ మెంబర్‌గా సెలెక్ట్ కావడంతో సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మెంబర్ షిప్‌ వల్ల ఆస్కార్ నామినేడ్ చేసే చిత్రాలకు ఓటింగ్ చేసే అవకాశం ఎన్టీఆర్‌కు లభిస్తుంది.

    ‘లియో’ సినిమా ట్విట్టర్ రివ్యూ

    తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాపై ప్రేక్షకులు తమ అభిప్రాయలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ‘ఫస్టాప్ సూపర్‌గా ఉంది. ఎప్పటిలాగే లోకేష్ కనగరాజ్‌ టేకింగ్ బాగుంది. విజయ్ లుక్ కొత్తగా ఉంది. అనిరుధ్ బీజీఎం అదిరిపోయింది. అయితే సెకండాఫ్ తేలిపోయింది. అర్జున్, సంజయ్ దత్ క్యారెక్టర్లు ఎంటర్ అయిన తరవాత సినిమా గాడి తప్పింది. క్లైమాక్స్ మాములుగా ఉంది’ అని కామెంట్ చేస్తున్నారు. పూర్తి రివ్యూ కాసేపట్లో..

    భగవంత్ కేసరి ట్విట్టర్ రివ్యూ

    బాలయ్య నటించిన భగంత్ కేసరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయలను ట్వీట్ చేస్తున్నారు. ప్రతిఒక్కరు తమ కూతుళ్లతో తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. బాలకృష్ణ చాలా కొత్తగా కనిపించారు. డైలాగ్స్, యాక్షన్ సీన్లు బాగున్నాయి. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరింది. సెకండాఫ్ మాస్ ఎంటర్‌టైనర్. థమన్ బీజీఎం కాస్త నిరుత్సాహపరిచింది. కథ బాగున్నా అనిల్ రావుపూడి నరేషన్ ప్లాట్‌గా ఉంది అని చెబుతున్నారు. పూర్తి రివ్యూ కాసెపట్లో..

    69th National Film Awards: జాతీయ స్థాయిలో సత్తాచాటిన టాలీవుడ్‌.. అవార్డ్స్ విజేతలు వీరే!

    69వ జాతీయ చలన చిత్ర అవార్డుల (69th National Film Awards) ప్రదానోత్సవం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. 2021కి గాను కేంద్రం ఇటీవల ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతికనిపుణులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులను విజేతలకు అందజేశారు. టాలీవుడ్‌ నుంచి పలువురు ప్రముఖులు రాష్ట్రపతి చేతుల మీదగా జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్ (Allu Arjun) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ … Read more

    టైగర్ నాగేశ్వరరావు రన్ టైం ఫిక్స్

    దసరా బరిలో నిలవనున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ బోర్డు నుంచి U/A క్లీన్ సర్టిఫికెట్ పొందింది. ఇక సినిమా టోటల్ రన్‌ టైం 2 గంటల 52 నిమిషాలకు కుదించారు. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని డెరెక్టర్ వంశీ తెరకెక్కించారు. ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వజ హీరోయిన్లుగా నటించారు. రేణుదేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

    భగవత్ కేసరి రికార్డు బుకింగ్స్

    భగవంత్ కేసరి అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదరగొడుతోంది. నిన్న టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవగా హాట్‌ కేక్‌ల్లాగా అమ్ముడు పోతున్నాయి. విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఆన్‌లైన్‌లో హౌస్‌ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కాగా ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది. శ్రీలీల బాలకృష్ణ కూతురుగా నటించింది. థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. మహిళా సాధికారత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

    ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న చంద్రముఖి 2

    రాఘవా లారెన్స్- కంగనా రనౌత్ నటించిన చంద్రముఖి 2 చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది. ఈ సినిమా అక్టోబర్ 27నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపని చంద్రముఖి 2 ఓటీటీలో ఏమేరకు ఆదరణ పొందుతుందో చూడాలి. పసలేని స్క్రీన్ ప్లే, కథతో చంద్రముఖి 2 ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కంగనా నటన బాగున్నా జ్యోతిక మేర భయపెట్టలేకపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నష్టాలను మిగిల్చింది.

    మెగాస్టార్ అభిమానిగా పుష్ప రాజ్

    పుష్ప-2 మూవీ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. పుష్ప-2లో అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా కనిపించనున్నాడని తెలిసింది. 2000 దశకంలో టాలలీవుడ్‌ను మెగాస్టార్ రూల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ టైంలో జరిగిన స్టోరీ కావడంతో పుష్ప రాజ్ మెగాస్టార్‌కు పెద్ద ఫ్యాన్‌గా తెరకెక్కిస్తున్నారంట. ప్రస్తుతం ఆ సీన్లకు సంబంధించి షూట్ చేస్తున్నారు. ‘ఇంద్ర’ రిలీజ్ టైంలో పుష్పరాజ్ గెటప్‌, చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని తెరకెక్కిస్తున్నారు.