• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 69th National Film Awards: జాతీయ స్థాయిలో సత్తాచాటిన టాలీవుడ్‌.. అవార్డ్స్ విజేతలు వీరే!

    69వ జాతీయ చలన చిత్ర అవార్డుల (69th National Film Awards) ప్రదానోత్సవం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. 2021కి గాను కేంద్రం ఇటీవల ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతికనిపుణులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులను విజేతలకు అందజేశారు. టాలీవుడ్‌ నుంచి పలువురు ప్రముఖులు రాష్ట్రపతి చేతుల మీదగా జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్ (Allu Arjun) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. టాలీవుడ్‌ నుంచి ఈ ఘనత సాధించిన తొలి హీరోగా బన్నీ నిలిచాడు.

    జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాధరణ పొందిన చిత్రంగా ‘RRR’ నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అవార్డును దర్శకధీరుడు రాజమౌళి రాష్ట్రపతి చేతుల మీదగా అందుకున్నారు. 

    పుష్ప చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్‌ నిలిచారు. ఈ అవార్డును రాష్ట్రపతి ముర్ము ఆయనకు అందజేశారు.

    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీకి గాను ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును ఎం. ఎం. కీరవాణి దక్కించుకున్నారు. జాతీయ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును కైవసం చేసుకున్నారు. 

    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘కొమరంభీముడో..’ పాట ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాటను ప్రాణం పెట్టి పాడిన సింగర్‌ కాల భైరవ.. ఉత్తమ నేపథ్య గాయకుడిగా నేషనల్‌ అవార్డు అందుకున్నారు.

    ఉత్తమ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌గా కింగ్‌ సోలోమన్ జాతీయ అవార్డు అందుకున్నారు. RRR చిత్రానికి గాను ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా కైవసం చేసుకున్నారు.

    టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రేమ్ రక్షిత్ జాతీయ స్థాయిలో ఉత్తమ నృత్య దర్శకుడిగా నిలిచారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి గాను రాష్ట్రపతి చేతుల మీదగా పురస్కారాన్ని అందుకున్నారు.

    ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో టాలీవుడ్‌కు చెందిన వి. శ్రీనివాస్‌మోహన్‌ జాతీయ అవార్డు దక్కించుకున్నారు. ఇతను కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి సంబంధించే తీసుకోవడం విశేషం.

    టాలీవుడ్‌ ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్‌.. కొండపొలం చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సాహిత్యం అవార్డు అందుకున్నారు. 

    జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డును చిత్ర దర్శకుడు బుచ్చిబాబు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. 

    ఇక జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ విమర్శకుడిగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పురుషోత్తమాచార్యులు అవార్డు అందుకున్నారు. 

    జాతీయ అవార్డు వేడుకల సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన విజేతలు అందరూ కలిసి దిగిన ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో అల్లుఅర్జున్‌, రాజమౌళి, ఎం.ఎం. కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ సహా పలువురు విజేతలు ఉన్నారు. ఈ ఫొటోను బన్నీ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయడం విశేషం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv