• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VD 13 టైటిల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

    పరుశురామ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ- మృణాల్ ఠాకూర్ జంటగా VD13 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి లెటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్‌ను అక్టోబర్ 19న రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అదికూడా తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

    OTT Release This Week: ఈ వారం ఓటీటీ/ థియేటర్లలో సందడి చేసే సినిమాలు ఇవే!

    ఈ దసరా పండగకు థియేటర్లు దద్దరిల్లనున్నాయి. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు మూవీలు సినిమా హాళ్లో మోత మోగించనున్నాయి. బాలయ్య, రవితేజ ఇద్దరు పెద్ద స్టార్లు కావడంతో ఈసారి దసరా.. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచనుంది. ఇప్పటికే ఈ రెండు సినిమాల హీరోలు ప్రమోషన్లలో తెగ బీజీగా ఉన్నారు. రెండు మాస్ యాక్షన్ చిత్రాలు కావడంతో ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ రెండు పెద్ద సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ చిత్రం విజయ్ నటించిన లియో కూడా దసరా బరిలో … Read more

    మాస్ లుక్‌లో అదరగొట్టిన వెంకటేష్

    విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. టీజర్‌లో మాస్‌ లుక్‌తో వెంకటేష్ అదరగొట్టాడు. గతంలో ఎన్నడూ చూడని బాడీ లాంగ్వేజ్‌తో సూపర్బ్‌గా కనిపించాడు. కాగా ఈ చిత్రాన్ని శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వెంకటేష్‌కు 75వ చిత్రం కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో సైంధవ్ నిర్మించారు. మాస్ లుక్‌లో వచ్చి టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

    సిద్ధూ జొన్నలగడ్డ సరసన కేజీఎఫ్‌ హీరోయిన్

    యంగ్ హీరో సిద్ధూ జొన్నల గడ్డ, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా ఓ కొత్త చిత్రం రాబోతుంది. ఈ సినిమా టైటిల్‌ను తాజాగా రివీల్ చేశారు. ‘తెలుసు కదా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కాగా ఈ చిత్రాన్ని నీరజ కోన డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రేమ, స్నేహం, కుటుంబం, త్యాగం వంటి అంశాల ప్రాతిపదికను ఈ చిత్రం తెరకెక్కుతోందని మూవీ మేకర్స్ తెలిపారు.

    శ్రీలీల గ్లిజరిన్ పెట్టకున్నా ఏడ్చేసింది: బాలయ్య

    భగవంత్ కేసరి ప్రెస్‌ మీట్‌లో బాలకృష్ణ మాట్లాడారు. భగవంత్ కేసరి మహిళా సాధికారతను హైలైట్ చేస్తూ తెరకెక్కిన చిత్రం. దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్ పరిశీలిస్తే అతడి చిత్రాలు అన్ని కూడా అద్భుతంగా ఉంటాయి. నా కూతురి పాత్రలో శ్రీలీల అద్భుతంగా నటించారు. ఎమోషనల్ సీన్లలో గ్లిజరిన్ అవసరం లేకుండా జీవించారు అంటూ ప్రశంసలు కురిపించారు. మంచి భవిష్యత్ ఉందంటూ ఆశీర్వదించారు. థమన్ అందించిన సాంగ్స్, బీజీఎం బాగుందని చెప్పుకొచ్చారు.

    బాలయ్యకు అపార అనుభం: శ్రీలీల

    భగవంత్ కేసరి ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడిన హీరోయిన్ శ్రీలీల బాలయ్యపై ప్రశంసలు కురిపించింది. ‘బాలయ్య కూతురని ఫస్ట్ చెప్పినప్పుడు కొంచెం వెనకడుగు వేశాను. గ్లామర్ రోల్స్ ఎప్పుడైన చేయవచ్చు. కానీ నటనకు అవకాశం ఉన్న విజ్జి పాత్రను చేసేందుకు ఒప్పుకున్నాను. బాలయ్య ఇంక్రిడబుల్ మ్యాన్. ఆయన నుంచి షూటింగ్‌లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కేవలం నటన పరంగానే కాదు. సమాజంలోని ఇతర విషయాలపై ఆయనకు ఆపార అనుభవం ఉంది అని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కోరిక మేరకు బాలయ్యతో శ్రీలీల డ్యాన్స్ చేసి … Read more

    భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వర్ బుకింగ్స్ స్టార్ట్

    దసరా బరిలోకి దిగుతున్న బాలయ్య సినిమా భగవంత్ కేసరి, రవితేజ చిత్రం టైగర్ నాగేశ్వర్‌రావు అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. అలాగే తమిళ్ డబ్బింగ్ చిత్రం విజయ్ నటించిన లియో సినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. భారీ అంచనాలతో ఈ మూడు సినిమాలు దసరా బరిలో పోటీపడుతున్నాయి. టైగర్ నాగేశ్వర్‌రావు, భగవంత్ కేసరి సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్లు సినిమాలపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

    సైంధవ్ మూవీ టీజర్ టైం లాక్

    విక్టరీ వెంకటేష్ నటిస్తున్న మూవీ ‘సైంధవ్’. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 11.34గంటలకు రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వెంకటేష్ కామెంట్ చేస్తూ.. చాలా రోజుల తర్వాత ఓ యాక్షన్ సినిమాలో నటిస్తున్నా. దగ్గుపాటి అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉంటుందని హామీ ఇస్తున్నా అని తెలిపారు.

    గంజా శంకర్‌గా సుప్రీం హీరో

    మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మరో కొత్త సినిమాను ప్రారంభించారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గంజా శంకర్ అనే టైటిల్‌ను ఖరారా చేశారు. ఈ సినిమాలో సాయి ధరమ్ గంజాయి అమ్మే వ్యక్తిగా కనిపించనున్నారు. ఈరోజు సుప్రీం హీరో బర్త్‌ డే సందర్భంగా స్పెషల్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరిలియో సంగీతం అందిస్తున్నారు. సాయి ధరమ్ ఎన్నడు చేయని పాత్రను చేస్తున్నాడు. డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నట్లు టాక్.

    రీ రిలీజ్‌కు రెడీ అయిన శంకర్‌దాదా MBBS

    మెగాస్టార్ నటించిన బ్లాక్‌బాస్టర్ మూవీ శంకర్‌దాదా MBBS చిత్రం రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాను నవంబర్‌ 4న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో సొనాలి బింద్రే, శ్రీకాంత్ ప్రధాన పాత్రాల్లో నటించగా.. జయంత్ పరాన్జీ దర్శకత్వం వహించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. కామెడీ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.