• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OTT Release This Week: ఈ వారం ఓటీటీ/ థియేటర్లలో సందడి చేసే సినిమాలు ఇవే!

    ఈ దసరా పండగకు థియేటర్లు దద్దరిల్లనున్నాయి. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు మూవీలు సినిమా హాళ్లో మోత మోగించనున్నాయి. బాలయ్య, రవితేజ ఇద్దరు పెద్ద స్టార్లు కావడంతో ఈసారి దసరా.. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచనుంది. ఇప్పటికే ఈ రెండు సినిమాల హీరోలు ప్రమోషన్లలో తెగ బీజీగా ఉన్నారు. రెండు మాస్ యాక్షన్ చిత్రాలు కావడంతో ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ రెండు పెద్ద సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ చిత్రం విజయ్ నటించిన లియో కూడా దసరా బరిలో నిలుస్తోంది. మరి ఏ చిత్రం ప్రేక్షకులను రంజింప జేయనుందో తెలియాలంటే.. కొద్దిరోజులు ఆగాల్సిందే. అటు ఓటీటీ ఫ్లాట్‌ ఫారమ్స్‌లోనూ 20కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూద్దామా…

    టైగర్ నాగేశ్వర రావు

    స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ట్రైలర్‌ను బట్టి చూస్తుంటే సినిమాలో రవితేజ మాస్ యాక్షన్‌తో ఇరగదీసినట్లు అర్థమవుతోంది. ఇక ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే దాదాపు 23 ఏళ్ల తర్వాత రేణు దేశాయ్ తిరిగి ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేస్తుండటంతో సినిమాపై మాస్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రమోషన్లలో చిత్ర యూనిట్ బిజీగా గడుపుతోంది. రవితేజ అన్ని తానై మూవీ ప్రమోషన్లలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 20న తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది.

    భగవంత్ కేసరి

    బాలకృష్ణ మాస్ డైలాగ్స్‌తో ఈ సినిమాకు భారీ హైప్ వచ్చింది. ఇదివరకు ఎప్పుడూ చూడని పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని డైరెక్టర్ అనిల్ రావుపూడి చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘భగవంత్ కేసరి ఈ పేరు సానా ఏళ్లు గుర్తుంటుంది’ అని బాలయ్య డైలగ్ ప్రేక్షకుల్లో బాగా నానుతోంది. మహిళా సాధికారత కథాంశంగా ఈ సినిమా తెరకెక్కిందని బాలయ్య ఇప్పటికే తెలిపారు. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది. థమన్ సంగీతం అందించారు. శ్రీలీల బాలయ్య కూతురుగా నటించింది. ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    లియో

    స్టార్ కాస్టింగ్‌తో వస్తున్న చిత్రం లియో. తమిళ్ సూపర్ స్టార్ విజయ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. పాన్‌ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించారు. విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించింది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఖైదీ, విక్రమ్ సినిమాలు భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు

    మ్యాన్షన్ 24

    బుల్లితెర యాంకర్, డైరెక్టర్ ఓంకార్ తెరకెక్కించిన వెబ్‌ సిరీస్ మ్యాన్షన్ 24. ఈ వెబ్ సిరీస్ హాట్‌ స్టార్‌లో అక్టోబర్ 17నుంచి స్ట్రీమింగ్ కానుంది. హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్, అవికాగోర్, బిందు మాధవి, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ వెబ్‌ సిరీస్ రానుంది. 

    TitleCategoryLanguagePlatformRelease Date
    Rick and Marty: Season 7WebseriesEnglishNetflixOctober 16
    I Walked Up A VampireWebseriesEnglishNetflixOctober 17
    The Devil on TrialWebseriesEnglishNetflixOctober 17
    Kaala PaaniWebseriesEnglishNetflixOctober 18
    Singapenne MovieTamil NetflixOctober 18
    Bodies Web SeriesEnglishNetflixOctober 19
    Captain Lazer Hawk: A Blood Dragon RemixWeb SeriesEnglish NetflixOctober 19
    Crypto BoyMovieDutch Netflix
    October 19
    NeonWeb SeriesEnglishNetflix
    October 19
    CreatureWeb SeriesTurkishNetflixOctober 20
    DoonaWeb SeriesKorean NetflixOctober 20
    Elite Season 7Web Series SpanishNetflixOctober 20
    Kandasams: The BabyMovie EnglishNetflixOctober 20
    Old DadsMovieEnglishNetflixOctober 20
    Once Upon A StudioMovieEnglishDisney Plus HotstarOctober 16
    Mansion 24Web SeriesTeluguDisney Plus HotstarOctober 17
    The Wandering Earth IIMovieMandarinAmazon PrimeOctober 18
    Permanent Roommates: Season 3Web SeriesHindiAmazon PrimeOctober 18
    Mama MashchindraMovieTeluguAmazon PrimeOctober 20
    Sayen: Desert RoadMovieEnglishAmazon PrimeOctober 20
    The Other JoyMovieEnglishAmazon PrimeOctober 20
    Transformers: The Rise of the BeastsMovieEnglishAmazon PrimeOctober 20
    Upload Season 3Web SeriesEnglishAmazon PrimeOctober 20
    Unstoppable Limited Edition Talk ShowTeluguahaOctober 17
    Red SandalwoodMovieTamilahaOctober 20
    Krishna RamaMovieTeluguE-WinOctober 22
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv