నటీనటులు : భాను ప్రకాష్, సృజన్, మణి ఏగుర్ల, మోహన్ భగత్, రవీందర్ బొమ్మకంటి, అంజయ్య మిల్కూరి, పద్మ, తదితరులు
రచన, దర్శకత్వం : అనంత్ వర్ధన్
సంగీతం : సంజీత్ ఎర్రమిల్లి
సినిమాటోగ్రఫీ : ముత్యాల సునీల్
ఎడిటర్: వెంకట్ రెడ్డి
నిర్మాత : వినోద్ అనంతోజు
ఓటీటీ : ఈటీవీ విన్
ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఇటీవల వరుసగా ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‍లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే ‘సోపతులు’ అనే ఫిల్మ్‌ను స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చింది. విద్యార్థుల స్నేహ బంధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ప్రధానంగా ఇద్దరు బాలలు చుట్టూ సాగిన ఈ చిత్రం ఎలా ఉంది? ఆ స్నేహితుల మధ్య అనుబంధం ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
చింటు (మాస్టర్ భానుప్రకాశ్), గుడ్డు (సృజన్) బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. అనుకోకుండా వచ్చిన కొవిడ్‌తో వారు దూరమవ్వాల్సి వస్తుంది. లాక్‌డౌన్ వల్ల పని లేకపోవడంతో గుడ్డూ కుటుంబం మహబూబాబాద్ నుంచి సొంతూరికి వెళ్లిపోతుంది. గుడ్డూ దూరం కావడంతో చింటు ఒంటరి తనం ఫీలవుతాడు. దోస్తును కలుసుకునేందుకు వయసుకు మించిన ప్రయత్నాలు చేస్తాడు. మరోవైపు గుడ్డూ సైతం ఎలాగైనా మిత్రుడిని చూడాలని అనేక ప్రయాసలు పడుతుంటాడు. మరి వారిద్దరు కలిశారా? ఫొటోగ్రాఫర్‌గా స్థిరపడాలనే చింటు అన్నయ్య కల నెరవేరిందా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
ఇందులో పాత్రలు తక్కువే అయినా తెరపైన కనిపించిన ప్రతీ ఒక్కరి నటన సంతృప్తి ఇస్తుంది. చింటుగా మాస్టర్ భాను ప్రకాశ్ ఆకట్టుకున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. గుడ్డూగా సృజన్ సైతం మెప్పించాడు. వారిద్దరు ఎంతో సహజంగా నటించారు. కథ మెుత్తం వారిద్దరి చుట్టే తిరిగింది. అటు ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ మోహన్ భగత్ కూడా ఓ కీలక పాత్రలో నటించి పర్వాలేదనిపించాడు. చింటు అన్నయ్యగా మణి ఏగుర్ల, అనూష రమేశ్, అంజిమామ తదితరులు పాత్రల మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
కొవిడ్/లాక్‌డౌన్‌ను కథా వస్తువుగా తీసుకొని ఇద్దరు చిన్నారుల స్నేహాన్ని ఎంతో అందంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు అనంత్ వర్ధన్. కొవిడ్ వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఎలాంటి ఇబ్బిందులు పడ్డాయో కళ్లకు కట్టాడు. చింటు, గుడ్డు, వారి ఫ్యామిలీ నేపథ్యంతో కథను నెమ్మదిగా ప్రారంభించిన డైరెక్టర్ కథలో ముందుకెళ్లెకొద్ది ఆసక్తి రగిలించాడు. ఆన్‌లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్ లేక గుడ్డూ పడే ఇబ్బందులు హృదయాన్ని హత్తుకుంటాయి. చింటూ అన్నయ్య పాత్రను నేటి యువతకు అద్దం పట్టేలా తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్ కూడా సంతృప్తి ఇస్తుంది. అయితే కమర్షియల్ హంగులు లేకపోవడం, మలుపు కొరవడటం, ఊహకందేలా కథనం సాగడం, పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం తీసుకోవడం, కొన్ని పాత్రల ముగింపు అంసపూర్ణంగా ఉండటం వంటివి మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫీ బాగుంది. నేపథ్యం సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటర్ తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- బాలల నటన
- భావోద్వేగాలు
- సంగీతం
మైనస్ పాయింట్స్
- కమర్షియల్ హంగులు లేకపోవడం
- ఊహాకందేలా కథనం సాగటం
Celebrities Featured Articles Telugu Movies
Samantha: నన్ను ‘సెకండ్ హ్యాండ్, యూజ్డ్’ అంటున్నారు!