సాధారణంగా మల్టీప్లెక్సుల్లో సినిమా చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక టికెట్‌కు రూ.250కి పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే సెప్టెంబర్ 20న మాత్రం సినీ ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. కేవలం రూ.99 టికెట్‌తో ఎంచక్కా మల్టీప్లెక్సుల్లో కొత్త సినిమాను చూసేయచ్చు. ఏ షో అయినా, ఏ సినిమా అయిన చూసే అవకాశాన్ని మల్టీప్లెక్స్ అసోసియేషన్ కల్పిస్తోంది. అయితే కొన్ని షరతులు మాత్రం వర్తిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఒక్క రోజు మాత్రమే..
జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) సెప్టెంబర్ 20న సినీ ప్రియులకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ. 99తో మీకు ఇష్టమైన సినిమాను మల్టీఫ్లెక్స్‌లో చూడవచ్చని వెల్లడించింది. సెప్టెంబర్ 20న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాల్లోని 4 వేలకు పైగా స్క్రీన్లలో కేవలం రూ.99 రూపాయలకే నచ్చిన సినిమాని వీక్షించవచ్చు. అయితే ఈ ఆఫర్ 3D, రెక్లైనర్లు, ప్రీమియం ఫార్మాట్ స్క్రీన్లకు వర్తించదు. ఇక ఆలస్యం లేకుండా వెంటనే శుక్రవారం టికెట్ బుక్‌చేసుకోండి.
హైదరాబాద్‌లోనూ..
హైదరాబాద్‌లోని PVR, INOX, మిరాజ్, ఏషియన్, సినీపోలీస్ వంటి ప్రధాన మల్టీప్లెక్స్‌లో కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఈ మల్లీఫ్లెక్స్‌లలో ప్రదర్శిస్తున్న అన్ని సినిమాలను కూడా రూ. 99కే ఒక టికెట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ ఆరోజు ప్రదర్శించే అన్ని సినిమాలతో పాటు అన్ని షోలకు వర్తించనుంది. ఒక లాగిన్‌పై ఆరు టికెట్లు బుక్ చేసుకోవచ్చని మల్టీప్లెక్స్ వర్గాలు వెల్లడించాయి.
టికెట్ ఎలా పొందాలంటే?
రూ.99 రూపాయల టిక్కెట్ ఆఫర్‌ను ఆన్లైన్, ఆఫ్లైన్లలో పొందవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ముందుగా సినిమా బుకింగ్ సైట్స్‌లోకి వెళ్లి మీ లొకేషన్ని ఎంచుకోవాలి. ఆపై సెప్టెంబర్ 20వ తేదీని సెలక్ట్ చేసి మీరు చూడాలనుకుంటున్న సినిమాపై క్లిక్ చేయండి. తర్వాత బుక్ యువర్ టికెట్ ఆప్షన్‌కు వెళ్లి మీ సీటును రిజర్వ్ చేసుకుని చెల్లింపులు పూర్తి చేయాలి. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రూ.99తో పాటు అదనంగా బుకింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆఫ్‌లైన్‌లో నేరుగా బుకింగ్ కౌంటర్ల వద్ద తీసుకుంటే ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. మీ సౌలభ్యాన్ని బట్టి టికెట్స్ తీసుకోండి.
ఆదరణ పెరుగుతోంది!
దేశవ్యాప్తంగా సినిమా ధియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది. 75శాతం ఆక్యూపెన్సీ ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే MAIలో దేశవ్యాప్తంగా 11సంస్థలకు చెందిన 5000 మల్టీప్లెక్స్ స్క్రీన్లు సభ్యులుగా ఉన్నాయి. దేశంలో రోజు రోజుకూ OTTలకు ఆదరణ పెరగడం, ధియేటర్స్‌కు, మల్టీప్లెక్స్ వెళ్లే వారి సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో MAI ఇలాంటి ఆఫర్స్ ప్రకటిస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.