హువావే బ్రాండ్ నుంచి మరో కొత్త స్మార్ట్ వాచ్ భారత మార్కెట్‌లోకి విడుదలైంది. Huawei Watch D2 పేరుతో గురువారం ఆవిష్కరించబడింది. ఇది Huawei Watch Dకి అప్‌గ్రెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. తాజా వేరబుల్‌లో 1.82-అంగుళాల AMOLED డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది 80 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్, బీపీ మానిటరింగ్, (SpO2), ECG, బాడీ టెంపరేచర్ సెన్సార్‌లను కూడా కలిగి ఉంది. Huawei Watch D2 అంబ్యులేటరీ బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ (ABPM) ను కూడా మద్దతు ఇస్తుంది.
Huawei Watch D2 స్పెసిఫికేషన్‌లు:
హువావే స్మార్ట్ వాచ్ డిస్‌ప్లే 480×408 పిక్సెల్ రిజల్యూషన్, 1500 nits గరిష్ట బ్రైట్‌నెస్, 347 ppi పిక్సెల్ డెన్సిటీ, ఆల్‌వేస్ -ఆన్ డిస్‌ప్లే (AOD) మోడ్‌తో కూడి ఉంటుంది. 1.82-అంగుళాల AMOLED డిస్‌ప్లే దీని ప్రత్యేకత. ఈ వేరబుల్ అల్యూమినియం అల్లాయ్‌తో తయారు చేయబడింది. దీంతో ఈ స్మార్ట్ వాచ్ ప్రీమియం లుక్‌తో అట్రాక్ట్ చేస్తోంది. వినియోగదారులకు జూమ్, వాల్యూమ్ నియంత్రించేందుకు అనువుగా రొటేటింగ్ డిజిటల్ క్రౌన్‌ను కలిగి ఉంది. ఇది ECG రీడింగ్స్‌కు సపోర్ట్ చేస్తుంది.
Huawei Watch D2 IP68 రేటింగ్‌ను కలిగి ఉంది, ఇది చెమటపట్టే వర్కౌట్లు, వర్షపు జల్లు వంటి పరిస్థితులను తట్టుకోగలదు. ఈ స్మార్ట్‌వాచ్ iOS ఆండ్రాయిడ్‌పై పనిచేస్తుంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఇది 80 కంటే ఎక్కువ క్రీడా మోడ్‌లను కలిగి వినియోగదారులకు అనుకూలమైన ప్రిఫరెన్స్‌ను అందిస్తుంది.
అదనంగా, Huawei Watch D2 అంబ్యులేటరీ బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ (ABPM) ఫీచర్‌తో వస్తుంది, ఇది 24 గంటలపాటు స్మార్ట్ వాచ్ ధరించినవారి రక్తపోటును కొలుస్తుంది, పగలు, రాత్రి మొత్తం రోజుకు సరాసరి గణాంకాలను లెక్కించగలదు, రక్తపోటు రిథమ్‌ను కూడా విశ్లేషిస్తుంది. ఈ డేటా హైపర్‌టెన్షన్, గుండె సంబంధిత రిస్క్ అంచనాలకు ఉపయోగపడుతుందని Huawei చెబుతుంది. ఈ వేరబుల్ రక్త ఆమ్లజనిత సంతృప్తి (SpO2) రేటును మరియు హృదయ స్పందన రేటును ట్రాక్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇది నిద్ర, శారీరక కార్యకలాపాలు, శరీర ఉష్ణోగ్రత, మానసిక ఒత్తిడిని సెన్సార్‌ల సాయంతో పర్యవేక్షిస్తుంది.
Huawei Watch D2లో బ్లూటూత్ 5.2, NFC ఉంది. ఇందులో IMU సెన్సార్, IR సెన్సార్, ECG సెన్సార్, బారోమెట్రిక్ సెన్సార్, హాల్ సెన్సార్, ఒత్తిడి సెన్సార్, ఆప్టికల్ హృదయ స్పందన సెన్సార్, బాడీ టెంపరేచర్ సెన్సార్ ఉన్నాయి. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. వినియోగదారులు ఈ వేరబుల్‌లో UP & DOWN బటన్స్‌ను ఒత్తడం ద్వారా స్క్రీన్‌షాట్లను తీసుకోవచ్చు.
Huawei Watch D2ని కొనుగోలు చేసే వినియోగదారులు Huawei Health+కి ఉచితంగా మూడు నెలల సభ్యత్వాన్ని పొందుతారు. సాధారణ వినియోగంలో ఈ వేరబుల్ 6 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని, ABPM ఫీచర్‌తో ఒక రోజు వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని హువావే చెబుతుంది. దీని కొలతలు 48x38x13.3mm, బరువు 40 గ్రాములు. దీంతో వాచ్‌ను చేతిపై ధరించినప్పుడు హ్యండీ ఫీలింగ్‌ను అందిస్తుంది.
Huawei Watch D2 ధర:
Huawei Watch D2 ధర EUR 399 (సుమారుగా రూ. 38,000) గా ఉంది. ఇది ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో మాత్రమే ప్రీ ఆర్డర్లకు అందుబాటులో ఉంది. అమెజాన్‌లో సెప్టెంబర్ 27 నుంచి అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది.