సెప్టెంబర్ నెలలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో చాలా సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. థియేటర్లలో ఈ సినిమాలు మిస్ అయిన వారు ఓటీటీలో వీటిని నేరుగా వీక్షించవచ్చు. స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాంతో పాటు ఆ సినిమాల స్టోరి కూడా మీకోసం అందిస్తున్నాం. మరి మీ అభిరుచికి తగ్గ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.
Demonte Colony 2
ఈ చిత్రం సెప్టెంబర్ 27 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. డెబీ (ప్రియా భవానీ శంకర్) భర్త శ్యామ్ అనుమానస్పదంగా సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఓ పుస్తకం చదవడం వల్లే అతడు చనిపోయినట్లు ఆమెకు తెలుస్తుంది. తన భర్తలాగే ఆ బుక్ చదివిన మరికొందరు కూడా సూసైడ్ చేసుకున్నట్లు గ్రహిస్తుంది. ఈ క్రమంలోనే శ్రీనివాస్ (అరుళ్ నిధి) అతడి కవల సోదరుడు కూడా బుక్ చదువుతారు. ఇది గ్రహించిన డెబీ వారిని ఎలా కాపాడింది? ఇంతకీ ఆ బుక్ వెనకున్న దుష్ట శక్తి ఏంటి? అన్నది స్టోరీ.
Maruthi Nagar Subramanyam
ఈ సినిమా సెప్టెంబర్ 20 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక స్టోరీ విషయానికొస్తే.. సుబ్రమణ్యం (రావు రమేశ్) 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కానీ కోర్టు స్టే వల్ల అది హోల్డ్‌లో ఉండి పోతుంది. చేస్తే ప్రభుత్వ ఉద్యోగమే చేయాలని సంకల్పించి మరో పని చేయకుండా సుబ్రమణ్యం ఖాళీగానే ఉంటాడు. భార్య సంపాదనపై జీవిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి ఖాతాలో రూ.10 లక్షలు జమ అవుతాయి. ఆ డబ్బు ఎవరిది? సుబ్రమణ్యంకు జాబ్ వచ్చిందా? లేదా? అతడి కొడుకు అంకిత్ లవ్ ట్రాక్ ఏంటి? అన్నది స్టోరీ.
Thiragabadara Saami
ఈ సినిమా సెప్టెంబర్ 19 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక స్టోరీ విషయానికొస్తే.. గిరి (రాజ్ తరుణ్) చాలా పిరికివాడు. ప్రతి దానికి భయపడుతూ ఉంటాడు. ప్రేయసి శైలజా (మాల్వీ మల్హోత్ర) అలా కాదు. చాలా దూకుడుతో వైలెంట్‌గా ఉంటుంది. టీజ్ చేసిన వారిని ఇరగ దీస్తుంటుంది. శైలజాను కంట్రోల్ చేయలేక గిరి ఎలాంటి తిప్పలు పడ్డాడు? ఎప్పుడూ సౌమ్యంగా ఉండే గిరి ఎందుకు తిరగబడాల్సి వచ్చింది? అన్నది స్టోరీ.
Parakramam
ఈ సినిమా సెప్టెంబర్ 14 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక స్టోరీ విషయానికొస్తే.. లోవరాజుకు నాటకాలంటే ఇష్టం. తండ్రి రాసిన పరాక్రమం అనే నాటకాన్ని హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో వేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో నగరానికి వస్తాడు. మరి నాటకం వేశాడా? లోవరాజు లవ్ స్టోరీ ఏంటి? తన తండ్రి సత్తిబాబు రాసిన పరాక్రమం కథేంటి? అన్నది స్టోరీ.
Aay
ఈ సినిమా సెప్టెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక స్టోరీ విషయానికొస్తే, కార్తీక్, సుబ్బు, హరి బాల్య స్నేహితులు. వర్క్ ఫ్రమ్ హోం కోసం ఊరికి వచ్చిన కార్తీక్ పల్లవి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఒకే కులం అని భావించి కార్తీక్‌ను కూడా పల్లవి ఇష్టపడుతుంది. అయితే నిజం తెలిసి అతడ్ని వదిలేసి ఇంకో పెళ్లికి రెడీ అవుతుంది. వారిద్దరిని కలిపేందుకు సుబ్బు, హరి ఎలాంటి పాట్లు పడ్డారు? చివరికీ వారు ఒక్కటయ్యారా? లేదా? అన్నది స్టోరీ.
Mr. Bachchan
ఈ సినిమా సెప్టెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక స్టోరీ విషయానికొస్తే, ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీ పరుడు. ఓ రైడ్ కారణంగా సస్పెండ్ అవుతాడు. తర్వాత సొంతూరుకి వెళ్లి జిక్కీ (భాగ్య శ్రీ)ని ప్రేమిస్తాడు. పెళ్లికి రెడీ అవుతున్న క్రమంలో ఉద్యోగంలో చేరాలని బచ్చన్‌కు పిలుపు వస్తుంది. తదుపరి రైడ్ ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో చేయాల్సి వస్తుంది. అధికారులను సైతం భయపట్టే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది స్టోరీ.
Committee Kurrollu
ఈ సినిమా సెప్టెంబర్ 12 నుంచి ఈటీవి విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక స్టోరీ విషయానికొస్తే, పురుషోత్తంపల్లి గ్రామంలో 12 ఏళ్లకు ఒకసారి జాతర నిర్వహిస్తారు. జాతర జరిగిన 10 రోజులకు పంచాయతీ ఎన్నికలు ఉండటంతో సర్చంచ్ బుజ్జి (సాయి కుమార్)పై శివ (సందీప్ సరోజ్) బరిలోకి దిగుతాడు. గత జాతర గొడవలో శివ స్నేహితులైన 10 మందిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో ఉత్సవం పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని తీర్మానం చేస్తారు. ఆ తర్వాత ఏమైంది? రిజర్వేషన్ల అంశం శివ గ్యాంగ్‌ను ఎలా విచ్ఛిన్నం చేసింది? స్నేహితులు తిరిగి కలిశారా? లేదా? అన్నది స్టోరీ.
Aaha
ఈ సినిమా సెప్టెంబర్ 7నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక స్టోరీ విషయానికొస్తే, ఇంద్రజిత్ సుకుమారన్, మనోజ్ కె. జయన్, అమిత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆహ’. మలయాళ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి బిబిన్ పాల్ దర్శకత్వం వహించారు. వేర్వేరు పనులు చేస్తూ జీవనం సాగించే ఓ గ్రామానికి చెందిన యువకులు ఓ ఆట ద్వారా ఎలా క్రేజ్ సంపాదించారు అన్నది ఈ సినిమా కథాంశం.
Satya
ఈ చిత్రం సెప్టెంబర్ 6నుంచి ఈటీవి విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక స్టోరీ విషయానికొస్తే, సత్య (హమరేష్) ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ చదువుతూ ఫ్రెండ్స్‌తో హాయిగా జీవిస్తుంటాడు. తండ్రి కోరిక మేరకు ఇష్టంలేక పోయిన కార్పోరేట్ కాలేజీలో చేరతాడు. అక్కడి స్టూడెంట్స్ లో-క్లాస్ అంటూ సత్యను ఎగతాళి చేస్తుంటారు. ఇలాంటి టైమ్‌లో తోటి స్టూడెంట్ పార్వతి (ప్రార్థన సందీప్) పరిచయమవుతుంది. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? కాలేజీలో సత్య ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడు? అన్నది స్టోరీ.
Nindha
ఈ సినిమా సెప్టెంబర్ 6 నుంచి ఈటీవి విన్‌లోస్ట్రీమింగ్ అవుతోంది. ఇక స్టోరీ విషయానికొస్తేఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపిన కేసులో ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది. దీంతో తీర్పు చెప్పిన న్యాయమూర్తి బాధతో కన్నుమూస్తారు. ఈ కేసులో అసలైన నేరస్థుడిని పట్టుకునేందుకు జడ్డి కొడుకు బయలు దేరతాడు. ఆరుగురు అనుమానుతుల్ని కిడ్నాప్ చేసి నిజం రాబట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అతడికి సంచలన నిజాలు తెలుస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
Simbaa
ఈ సినిమా సెప్టెంబర్ 6 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక స్టోరీ విషయానికొస్తే.. పార్థ గ్రూప్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులు హత్యకు గురవుతారు. దీని వెనక టీచర్ అక్షిక (అనసూయ), జర్నలిస్టు ఫాజిల్ (మాగంటి శ్రీనాథ్) ఉన్నట్లు నిర్ధారించి పోలీసులు అరెస్టు చేస్తారు. అయినప్పటికీ పార్థ గ్యాంగ్‌లోని మరో వ్యక్తి హత్యకు గురవుతాడు. అసలు ఆ హత్యలకు కారణం ఏంటి? పార్థ మనుషులనే ఎందుకు హత్య చేస్తున్నారు? వీటితో మ్యాన్ పురుషోత్తం రెడ్డి (జగపతి బాబు)కి సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.
Double iSmart
ఈ సినిమా సెప్టెంబర్ 5 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫాం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మాఫియా డింపుల్ బిగ్ బుల్(సంజయ్ దత్) మరణం లేకుండా ఉండాలని అనుకుంటాడు. ఈ క్రమంలో వైద్యులు అతనికి ఓ సలహా ఇస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ గురించి వివరిస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ చేస్తే అలాంటి అవకాశం ఉందని చెబుతారు. బిగ్ బుల్ మెమోరిని రకరకాల వ్యక్తులకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. కానీ విఫలమవుతుంది. ఈక్రమంలో ఇస్మార్ట్ శంకర్ గురించి బిగ్ బుల్‌కు తెలుస్తుంది. తన మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేసేందుకు శంకర్‌ను ఎంచుకుంటారు. మరీ శంకర్ బ్రేయిన్‌లోకి బిగ్ బుల్ మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? అనేది కథ
Bhargavi Nilayam
ఈ సినిమా సెప్టెంబర్ 5 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూలు అయితే అందాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే. ‘భార్గవి నిలయం’లో భార్గవి అనే అమ్మాయి ఆత్మగా తిరుగుతుందని ఊరి వాళ్లు నమ్ముతుంటారు. ఈ క్రమంలో బషీర్ (టోవినో థామస్) అనే రైటర్ ఆ ఊరికి కొత్తగా వచ్చి ఆ ఇంట్లో అద్దెకు దిగుతాడు. ఇల్లు మారేందుకు డబ్బుల్లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మతో స్నేహం చేస్తాడు. అసలు భార్గవి ఎందుకు చనిపోయింది? ఆమె ప్రేమకథ ఏంటి? ఆ ప్రేమ జంట మిస్టరీని బషీర్ ఎలా బయట పెట్టాడు? అన్నది స్టోరీ.
Movie | Date | OTT | Category |
---|---|---|---|
Demonte Colony 2 | 27 Sep 2024 | Zee5 | Film |
Maruthi Nagar Subramanyam | 20 Sep 2024 | Aha | Film |
Thiragabadara Saami | 19 Sep 2024 | Aha | Film |
Parakramam | 14 Sep 2024 | Aha | Film |
Aay | 12 Sep 2024 | Netflix | Film |
Mr. Bachchan | 12 Sep 2024 | Netflix | Film |
Committee Kurrollu | 12 Sep 2024 | ETV Win | Film |
Aaha | 12 Sep 2024 | Aha | Film |
Satya | 07 Sep 2024 | Aha | Film |
Nindha | 06 Sep 2024 | ETV Win | Film |
Simbaa | 06 Sep 2024 | Aha | Film |
Double iSmart | 05 Sep 2024 | Prime Video | Film |
Bhargavi Nilayam | 05 Sep 2024 | Aha | Film |
Celebrities Featured Articles Movie News
Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్!