• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Adipurush: పెళ్లిపై క్లారిటీ.. ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్ 

    ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. అడుగడుగునా ఆధ్యాత్మికత ఫరిడవిల్లేలా సభా ప్రాంగణాన్ని నిర్వహకులు తీర్చిదిద్దారు. దాదాపు లక్షకు పైగా పాసులు మంజూరు చేయగా అంతకుమించి అభిమానులు వేడుకకు వచ్చారు. ఎటు చూసినా రాముడి స్వరూపమే. జై శ్రీరామ్ నినాదమే. అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకలో ముఖ్య అతిథులతో పాటు ప్రభాస్, కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ సహా సినిమాకు పనిచేసిన నటీనటులు ఇతర టెక్నిషియన్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రభాస్, కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు … Read more

    ‘ఆదిపురుష్’ యాక్షన్ ట్రైలర్ వచ్చేసింది!

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతిసనన్ హీరోయిన్‌గా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ నుంచి మరో ట్రైలర్ రిలీజైంది. తిరుపతిలో ప్రి రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేదికపైనే ‘ఆదిపురుష్’ యాక్షన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఫైనల్ ట్రైలర్‌లో యాక్షన్ సన్నివేశాలు అదుర్స్ అనిపిస్తున్నాయి. కాగా ఈ మూవీని డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించారు. టీ సీరీస్ ఫిల్మ్ సంస్థ నిర్మించింది.

    ‘ఆదిపురుష్’ యాక్షన్ ట్రైలర్ వచ్చేసింది!

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతిసనన్ హీరోయిన్‌గా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ నుంచి మరో ట్రైలర్ రిలీజైంది. తిరుపతిలో ప్రి రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేదికపైనే ‘ఆదిపురుష్’ యాక్షన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఫైనల్ ట్రైలర్‌లో యాక్షన్ సన్నివేశాలు అదుర్స్ అనిపిస్తున్నాయి. కాగా ఈ మూవీని డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించారు. టీ సీరీస్ ఫిల్మ్ సంస్థ నిర్మించింది.

    LIVE: ఆదిపురుష్ ప్రీరిలీజ్ వేడుకలు

    తిరుపతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ వేడుకలను ప్రారంభమయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన ప్రభాస్ అభిమానులతో తిరుపతి గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. జై శ్రీరాం.. జై శ్రీరాం నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించండి. మరి కొద్దిసేపట్లో ప్రభాస్ వచ్చి మాట్లాడనున్నారు.

    ‘సైతాన్’ ట్రైలర్: ‘రానానాయుడు’కు మించి!

    డైరెక్టర్ మహీ వి రాఘవ్ తెరకెక్కించిన ‘సైతాన్’ వెబ్ సీరీస్ ట్రైలర్ విడుదలైంది. క్రైమ్, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సీరీస్ అంతా బూతులమయంగా ఉంది. ఇందులోని బూతు డైలాగులకు ఫ్యామిలీ ఆడియన్స్ చెవులు మూసుకోవాల్సిందే. ట్రైలర్‌లో పచ్చి బూతులు, అడల్ట్ సన్నివేశాలే కన్పిస్తాయి. బూతుల్లో ‘సైతాన్’ సీరీస్ ‘రానానాయుడు’ వెబ్ సీరీస్‌కు మించి ఉంది. షెల్లి నబుకుమార్, దేవయాని శర్మ, జాఫర్ సాధిక్, రిషి కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ సీరీస్ జూన్ 15 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

    ‘భోళా మేనియా’ సాంగ్ వచ్చేసింది

    భోళా శంకర్ నుంచి మొదటి పాట విడుదలైంది. ‘భోళా మేనియా’ అంటే సాగే ఈ గీతాన్ని రేవంత్ ఆలపించారు. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. త్రిశూలం కీ చైన్‌ని స్టైలుగా తిప్పుతూ చిరు స్టెప్పులు వేస్తుంటే ఫిదా అవ్వాల్సిందే. మెహర్ రమేశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆగస్టు 11న సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను నిర్మించింది.

    జైలర్ సినిమా షూటింగ్ పూర్తి

    సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందుకు మూవీ టీమ్ సెలబ్రేట్ కూడా చేసున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండవుతున్నాయి. ఈ సినిమాలో రజినీకాంత్ పవర్ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారట. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఆగస్టు 10న జైలర్ మూవీ విడుదలకానుంది. ఈ సినిమాలో తమన్న, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, నాగబాబు, జాకీష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. It's a wrap … Read more

    మహేష్ బాబు దెబ్బకు యూట్యూబ్ షేక్

    సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ మూవీ నుంచి విడుదలైన ‘మాస్ స్ట్రైక్ గ్లింప్స్’ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియో ఇప్పటి వరకు 20 మిలియన్ వ్యూస్ సాధించి దూసుకెళ్తోంది. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గ్లింప్స్‌ను మరోస్థాయిలో ఉంచింది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘గుంటూరు కారం’ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

    మిస్టర్ పోలిశెట్టి మూవీ తాజా అప్‌డేట్ ఇదే

    నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, అయితే ఈ సినిమా నుంచి తాజా అప్ డేట్ వచ్చింది. ఈ మూవీలో తొలి పాటను ఆల్రెడీ విడుదల చేయగా, ఇప్పుడు రెండో పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హతవిధీ హీరో కష్టాలకు అంతు ఏది? అంటూ రామజోగయ్య శాస్త్రి అందించిన ఈ పాటను హీరో ధనుష్ పాడారు. చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. మహేష్ బాబు.పి, దర్శకత్వం వహిస్తున్నారు.

    పవన్ కళ్యాణ్ సినిమాపై తేజ క్రేజీ కామెంట్స్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాపై డైరెక్టర్ తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన అహింస చిత్రం ప్రమోషన్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్.. పవన్ కళ్యాణ్‌ కోసం మీరు ఎలాంటి కథను తయారు చేస్తారు అని ప్రశ్నించాడు. ‘రీసెంట్‌గా వచ్చిన ఉస్తాద్ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. పవన్ సినిమా అంటే ఆ విధంగా ఉండాలి. చూడగానే సినిమా హిట్ అనే ఫీలింగ్ వచ్చింది’ అని చెప్పుకొచ్చాడు. Here's what Sensational Director #Teja says … Read more