• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రామ్ సీతా రామ్ సాంగ్ విడుదల

    ఆదిపురుష్ సినిమా నుంచి మరో సాంగ్ విడుదలైంది. ‘రామ్ సీతారాం సీతారాం జయ జయరాం’ పాట రిలీజైంది. సాంగ్‌లో విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. రాముడు- సీత పాత్రల మధ్య పరిణయాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.

    ఆదిపురుష్‌ సూపర్ రికార్డు

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మరో ఘనత సాధించింది. గత 90 రోజులుగా యూట్యూబ్‌లో అత్యధికంగా వెతికిన టాపిక్‌గా ఆదిపురుష్ ట్రైలర్ నిలిచింది. ఆదిపురుష్ ఫస్ట్ సింగిల్ జైశ్రీరామ్ సాంగ్ అన్ని భాషాల్లో కలిపి 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈసాంగ్ ఒక్క యూట్యూబ్‌లోనే కాకుండా.. ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

    నిఖిల్ హీరోగా ‘ద ఇండియా హౌస్’

    రామ్‌చరణ్ కొత్త బ్యానర్ ‘వీ మెగా పిక్చర్స్’ తొలిసారిగా చేయబోతున్న చిత్రం ‘ద ఇండియా హౌస్’. నిఖిల్ సిద్ధార్థ హీరోగా, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాణ బాధ్యతలు పంచుకోనుంది. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా టీజర్‌ని చిత్రబృందం రిలీజ్ చేసింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. స్వాతంత్ర సమరంలో వెలుగులోకి రాని సంఘటన ఆధారంగా దీనిని తెరకెక్కిస్తున్నారు.

    థ్రిల్లింగ్‌గా ‘టక్కర్’ ట్రైలర్

    కోలీవుడ్ హీరో సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా నటించిన ‘టక్కర్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో యాక్షన్, లవ్, రొమాంటిక్, కామెడీ అంశాలు ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ మూవీ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఉంది. సిద్ధార్థ్ తన పాత్రలో ఒదిగిపోయినట్లుగా కనిపిస్తోంది. ఈ మూవీని డైరెక్టర్ కార్తీక్ జి.క్రిష్ తెరకెక్కించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

    ఆసక్తికరంగా ‘సత్తిగాని రెండెకరాలు-1’ ట్రైలర్

    జగదీష్ ప్రతాప్ భండారీ, వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తిలు ప్రధాన పాత్రలు పోషించిన ‘సత్తిగాని రెండెకరాలు-1’ చిత్రం విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 26న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సత్యదేవ్, వెంకీ కుడుముల, అనుదీప్‌లు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. డార్క్ కామెడీ జానర్లో మూవీని రూపొందించారు. ఈ సినిమాకు అభినవ్ దండా దర్శకత్వం వహించారు. మైత్రీమూవీమేకర్స్ వారు నిర్మించారు.

    Tollywood Heroines: యంగ్‌ హీరోలతో జత కడుతున్న స్టార్ హీరోయిన్స్.. అవకాశాలు లేకపోవడమే కారణమా?

    స్టార్‌ హీరోల పక్కన యంగ్ హీరోయిన్లు నటించడం మాములే. కానీ స్టార్‌ హీరోయిన్‌ల పక్కన ఓ యంగ్ హీరో నటించడం అరుదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే జరుగుతోంది. స్టార్‌ హీరోయిన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత, అనుష్క శెట్టి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌లు యంగ్‌ హీరోలతో జతకడుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. వరుస ఫ్లాపులు, చేతిలో సినిమాలు లేకపోవడంతో వీరంతా చిన్న హీరోలతోనూ రొమాన్స్‌ చేసేందుకు సిద్ధమైపోతున్నారు.  సమంత అగ్రకథానాయిక అయిన సమంత.. డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా చేయబోతోంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో చేస్తున్న … Read more

    Unique Promotions: ప్రమోషన్స్‌తోనే పడేశారు.. సోషల్ మీడియాలో ‘మేమ్‌ ఫేమస్‌’ రచ్చ రచ్చ..!

    సుమంత్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’. ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చేస్తున్న ప్రమోషన్స్‌ ఆకట్టుకుంటున్నాయి. రొటిన్‌ ప్రమోషన్స్‌లా కాకుండా చిత్ర యూనిట్‌ వినూత్నంగా తమ సినిమాను ప్రమోట్‌ చేసుకుంటోంది. డీజే బ్యాండ్‌తో స్వయంగా సెలబ్రిటీల దగ్గరకు వెళ్లి తమ ప్రమోషన్స్‌లో వారిని భాగస్వామ్యం చేస్తోంది. ‘మేమ్‌ ఫేమస్‌’ను ప్రమోట్‌ చేస్తూ సెలబ్రిటీలు చెబుతున్న డైలాగ్స్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. … Read more

    ‘మోసగాళ్లకు మోసగాడు’ 4K ట్రైలర్ రిలీజ్

    దివంగత సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా రీ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. మే 31న కృష్ణ జయంతి సందర్భంగా ఈ మూవీని 4K వెర్షన్‌ను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఆవిష్కరించారు. ఈ ట్రైలర్‌కు ఫ్యాన్స్, ఆడియెన్స్ నుంచి సానుకూల స్పందన వస్తోంది. కాగా ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం 1971 విడుదలై ఘనవిజయం సాధించింది. సత్యనారాయణ, ప్రభాకర్, గుమ్మడి, జ్యోతిలక్ష్మీలు నటించారు.

    సిద్ధార్థ్ టక్కర్ ట్రైలర్ విడుదల

    సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా నటిస్తున్న టక్కర్ మూవీ ట్రైలర్ విడుదలైంది. ‘ఆశ ప్రపంచాన్ని మరిపిస్తుంది. అదే ఆశ మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఆ ఆశను నెరవేర్చుకోవడానికి ధనమే నిధి’ అంటూ సిద్ధార్థ్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. కార్తీక్ జి క్రిష్ డైరెక్షన్ వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

    ‘వాట్ ద ఫిష్’ ఫస్ట్ లుక్ రిలీజ్

    మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘వాట్ ద ఫిష్’ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదలైంది. మనోజ్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఈ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ చూస్తే టెక్నో ఫాంటసీ మూవీగా ‘వాట్ ద ఫిష్’ తెరకెక్కుతున్నట్ల తెలుస్తోంది. మనోజ్ సరికొత్త గెటప్‌లో అలరించాడు. కాగా ఈ సినిమాను వరుణ్ కోరుకొండ రూపొందించారు. విశాల్, సూర్య బెజవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Courtesy Twitter: Manoj Manchu