ఆర్య ‘కెప్టెన్’ మూవీ సాంగ్ రిలీజ్
ఆర్య హీరోగా నటిస్తున్న ‘కెప్టెన్’ మూవీ నుంచి ‘కైలా’ అనే మెలొడి సాంగ్ రిలీజ్ అయింది. డి.ఇమ్మాన్ మ్యూజిక్ అందించిన ఈ పాటను తెలుగులో యజీన్ నాజిర్, శ్రినిషా జయశీలన్ కలిసి పాడారు. ఈ సినిమాలో ఆర్య ఆర్మీ జవాన్ పాత్రలో కనిపించనున్నాడు. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్. శక్తి సౌందరరాజన్ దర్శకత్వం వహించాడు. థింక్ స్టూడియోస్ దీన్ని నిర్మించింది. సెప్టెంబర్ 8న సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది.