• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    పూరీ జ‌గ‌న్నాథ్ మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌స్తాడా?

    పూరీ జ‌గ‌న్నాథ్ ఒక మాస్ డైరెక్ట‌ర్‌గా గ‌తంలో బెస్ట్  డైరెక్ట‌ర్స్‌గా నిలిచాడు. ముఖ్యంగా హీరోయిజం చూపించాలంటే, హీరోల‌తో ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పించాలంటే అది పూరీనే. ఇండ‌స్ట్రీకి వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న‌తో ఒక్క సినిమా చేయాల‌ని అనుకునేవారు. పూరీ హీరోల ఎలివేష‌న్ మామూలుగా ఉండ‌దు. ర‌వితేజ‌, అల్లు అర్జున్‌, మ‌హేశ్ బాబును మాస్ హీరోలుగా మార్చింది పూరీ అనే చెప్పుకోవాలి. ఇక టెంప‌ర్‌లో కూడా ఎన్‌టీఆర్ ఒక విభిన్న‌మైన పాత్ర‌లో చూపించాడు. పోకిరి సినిమాను స‌ల్మాన్‌ఖాన్ హిందీలో వాంటెడ్‌గా తెర‌కెక్కించాడు.  ఆ సినిమాతో స‌ల్మాన్ … Read more

    ఆశికి 3 వచ్చేస్తోంది.. హీరో ఎవరంటే..?

    బాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన ఆశికి, ఆశికి 2 సినిమాలకు సీక్వెల్ రాబోతోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ ప్రాజెక్టు తెరకెక్కనుంది. అనురాగ్ బసు మెగాఫోన్ పట్టుకోనున్నాడు. ముఖేశ్ భట్, భూషణ్ కుమార్ తిరిగి ఏకమై ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఆశిక్ 3 కోసం బీటౌన్ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా అప్డేట్ రావడంతో పండుగ చేసుకుంటున్నారు. కార్తీక్ ఆర్యన్ ముఖేశ్ భట్, అనురాగ్ బసు, సంగీత దర్శకుడు ప్రీతమ్ తో కలిసి ఉన్న ఫొటోను ఇన్ … Read more

    ఈ వారంలో వ‌స్తున్న‌ తెలుగు సినిమాలివే

    ఈ వారం తెలుగులో 5 సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు అన్ని ఇండ‌స్ట్రీల దృష్టి బ్ర‌హ్మాస్త్ర‌పై ఉంది. దాంతో పాటు సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కాబోతున్న సినిమాలు.. బ్ర‌హ్మాస్త్ర: సెప్టెంబ‌ర్ 9 అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ బ్ర‌హ్మాస్త్ర. ర‌ణ్‌బీర్ క‌పూర్, ఆలియా భ‌ట్, నాగార్జున‌, అమితాబ్ బ‌చ్చ‌న్, మౌనిరాయ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. గ‌త ప‌దేళ్లుగా ద‌ర్శ‌కుడు దీనిపై ప‌నిచేస్తున్నాన‌ని చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌, పాట‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి.  ఒకే ఒక జీవితం: … Read more

    అల్ల‌రి న‌రేశ్ ‘ఉగ్రం’ షూటింగ్ స్టార్ట్

    అల్ల‌రి న‌రేశ్, విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న రెండో సినిమా ‘ఉగ్రం’. నేటి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లుగా చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి రిలీజ్ చేసిన వీడియోలో అల్ల‌రి న‌రేశ్ మొహానికి మ‌సి పూసుకొని భ‌యంక‌రంగా ఉగ్ర‌రూపంలో క‌నిపిస్తున్నాడు. మ‌రో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో ఆయ‌న క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. మిర్నా మీన‌న్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

    జాన్వీ కపూర్ లేటెస్ట్ హాట్ పిక్స్

    బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తాజా ఫొటో షూట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. బ్లూకలర్ పొట్టి జీన్స్, వైట్ కలర్ స్ర్పింగ్ సమ్మర్ ధరించి కొంటె చూపులతో ఈ అమ్మడు ఫోజులిచ్చింది. కాళ్లు, చేతులతో పలు రకాల స్టిల్స్ ఇస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచుతుంది. తనను ఈ డ్రెస్సులో చూసిన అభిమానులు తెగ ఫిధా అవుతున్నారు. మరోవైపు ఈ పిక్స్ చూసిన నెటిజన్లు వావ్, సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి. Courtesy Instagram: Courtesy Instagram: … Read more

    ఆస‌క్తిక‌రంగా ‘ర‌హ‌స్య’ ట్రైల‌ర్

    నివాస్ సిస్తు, సారా ఆచార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ‘ర‌హ‌స్య’ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల అయింది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉంది. ఒక టెర్ర‌రిస్టును హ‌త్య చేసిన వ్య‌క్తిన పట్టుకునే ప‌నిలో పోలీసుల‌తో పాటు ఎన్ఐఏ త‌ల‌మున‌క‌ల‌వుతుంది. హీరో, హీరోయిన్ ఇద్ద‌రూ పోలీసాఫీస‌ర్లుగా న‌టించారు. శివశ్రీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సునీల్ క‌శ్య‌ప్ మ్యూజిక్ అందించాడు. ఎస్ఎస్ఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్ర‌న్ని నిర్మించింది.

    ఆర్య ‘కెప్టెన్’ మూవీ సాంగ్ రిలీజ్

    ఆర్య హీరోగా న‌టిస్తున్న ‘కెప్టెన్’ మూవీ నుంచి ‘కైలా’ అనే మెలొడి సాంగ్ రిలీజ్ అయింది. డి.ఇమ్మాన్ మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను తెలుగులో య‌జీన్ నాజిర్, శ్రినిషా జ‌య‌శీల‌న్ క‌లిసి పాడారు. ఈ సినిమాలో ఆర్య ఆర్మీ జ‌వాన్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ హీరోయిన్‌. శ‌క్తి సౌంద‌ర‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. థింక్ స్టూడియోస్ దీన్ని నిర్మించింది. సెప్టెంబ‌ర్ 8న సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల అవుతుంది.

    సోష‌ల్‌మీడియాకు బ్రేక్ ఇచ్చిన ఛార్మి

    సోష‌ల్‌మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్న‌ట్లుగా నిర్మాత ఛార్మీ కౌర్ ప్ర‌క‌టించింది. పూరీ క‌నెక్ట్స్ మ‌రో పెద్ద ప్రాజెక్ట్‌తో తిరిగొస్తుంది అంటూ ట్వీట్ చేసింది. లైగ‌ర్‌ మూవీపై విమ‌ర్శ‌లు, ట్రోల్స్ వ‌స్తుండ‌టంతో చిల్ గ‌య్స్ బ్ర‌త‌కండి, బ్ర‌త‌క‌నివ్వండి అని పోస్ట్ చేసింది. లైగ‌ర్ సినిమా ఫ్లాప్ త‌ర్వాత చిత్ర‌బృందం నిరాశ‌లో మునిగిపోయింది. గ‌తంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్రారంభించిన జ‌న‌గ‌ణ‌మ‌న సినిమాకు కూడా బ్రేక్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తుంది. ఇంత పెద్ద డిజాస్ట‌ర్ త‌ర్వాత మ‌ళ్లీ అప్పుడే పాన్ ఇండియా రేంజ్ సినిమా వ‌ద్ద‌ని పూరీ జ‌గ‌న్నాథ్ అనుకుంటున్న‌ట్లుగా … Read more

    నాగ‌శౌర్య రొమాంటిక్ సాంగ్ మేకింగ్ చూశారా?

    నాగ‌శౌర్య హీరోగా న‌టించిన ‘కృష్ణ వ్రింద విహారి’ నుంచి వర్షంలో వెన్నెల సాంగ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ సాంగ్ మేకింగ్ వీడియోను తాజాగా విడుద‌ల చేశారు. రొమాంటిక్ సీన్స్ చేసేట‌ప్పుడు హీరో, హీరోయిన్ ఎంత ఇబ్బంది ప‌డ్డారో ఇందులో చూడ‌వ‌చ్చు. అదేవిధంగా షూటింగ్ కోసం వెళ్లిన అంద‌మైన‌ లొకేష‌న్ల‌ను మొత్తం చూపించారు. శెర్లీ సేతియా ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. అనీశ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సెప్టెంబ‌ర్ 23న మూవీ విడుద‌ల కానుంది.

    ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైలర్ డేట్ ఫిక్స్

    ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీ ట్రైలర్ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. ఈమేరకు విడుదల చేసిన స్పెషల్ వీడియోలో హీరో సుధీర్ బాబు ట్రైలర్ లాంచ్ డేట్‌ను ప్రకటించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు రేపు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు చెప్పాడు. కాగా ఈ సినిమాను మోహన కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. హీరోయిన్‌గా కృతిశెట్టి నటిస్తోంది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రం ఈనెల 16న విడుదల కానుంది.