• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    కూతురుతో క‌లిసి గ‌ణేష్ నిమ‌జ్జ‌నంలో అల్లు అర్జున్ డ్యాన్స్

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న గ‌ణేష్ నిమ‌జ్జ‌నంలో పాల్గొన్నాడు. వారి ఇంట్లో ప్ర‌తిష్టించిన వినాయ‌కుడిని నిమ‌జ్జ‌నం చేసేందుకు అల్లు అర్హ‌తో పాటు వ‌చ్చాడు. కూతురుని ఎత్తుకొని పాట‌ల‌కు స్టెప్పులేశాడు. గ‌ణ‌ప‌తి బ‌ప్ప మోరియా అంటూ వినాయ‌కుడిని సాగ‌నంపారు. ఈ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. బ‌న్నీ ప్ర‌స్తుతం పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా కోసం దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

    యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న నాగ‌శౌర్య సాంగ్

    నాగ‌శౌర్య హీరోగా న‌టించిన ‘కృష్ణ వ్రింద విహారి’ నుంచి విడుద‌లైన తార నా తార సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. యూట్యూబ్‌లో ఇప్ప‌టికే 1.5 మిలియ‌న్ వ్యూస్, 160కK లైక్‌తో ట్రెండింగ్‌లో కొన‌సాగుతుంది. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ ఈ పాట‌కు సంగీతం అందించ‌డంతో పాటు న‌కాశ్ అజీజ్‌తో క‌లిసి పాడారు. ఈ సినిమాలో నాగ‌శౌర్య‌కు జంట‌గా శెర్లీ సేతియా న‌టిస్తుంది. అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.సెప్టెంబ‌ర్ 23న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

    ట్రెండింగ్ లో రామ్ చరణ్ వీడియో

    ఆర్ఆర్ఆర్ లో ‘రామ్’ గా ఉర్రూతలూగించారు రామ్ చరణ్. ఆయన ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే చెర్రీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెగ ట్రెండవుతోంది. ‘మీ షో’ కంపెనీ యాడ్ కోసం ఈ మెగాపవర్ స్టార్ మేకప్ వేసుకున్నాడు. సేల్స్ బాయ్ గా ఇందులో చెర్రీ కనిపిస్తున్నాడు. మెగా బ్లాక్ బస్టర్ సేల్ పేరిట మీ షో ప్రముఖ సినీ తారలతో ప్రచారం కల్పిస్తోంది. మీరూ ఈ వీడియోను చూసేయండి మరి.

    ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైల‌ర్ రిలీజ్

    సుధీర్ బాబు, కృతి శెట్టి జంట‌గా న‌టించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ఈ ట్రైల‌ర్‌ను లాంచ్ చేశారు. డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న ఒక అమ్మాయిని క‌ష్ట‌ప‌డి సినిమాలో న‌టించేందుకు డైరెక్ట‌ర్‌ ఒప్పిస్తాడు. కానీ ఆమె తండ్రికి అది ఇష్టం లేక‌పోవ‌డంతో సినిమా మ‌ధ్య‌లో ఆగిపోతుంది. మ‌రి ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? అత‌డి సినిమా క‌ల నేర‌వేరిందా లేదా అనే క‌థాంశంతో సినిమా తెర‌కెక్కిన‌ట్లుగా తెలుస్తుంది. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సెప్టెంబ‌ర్ … Read more

    ‘శాకిని డాకిని’ సాంగ్ విడుద‌ల‌

    నివేతా థామ‌స్, రెజీనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ‘శాకిని డాకిని’ మూవీ నుంచి క‌దిలే క‌దిలే లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ అయింది. సుధీర్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణ బాధ్య‌త‌లు చేప‌ట్టింది. కొరియ‌న్ మూవీ ‘మిడ్‌నైట్ ర‌న్న‌ర్’ రీమేక్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. ఇప్ప‌టికే విడులైన ట్రైల‌ర్, పాట‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతున్నాయి. సెప్టెంబ‌ర్ 16న మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది.

    త‌మ‌న్నా ‘బ‌బ్లీ బౌన్స‌ర్’ ట్రైల‌ర్ విడుద‌ల‌

    త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ‘బ‌బ్లీ బౌన్స‌ర్’ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. మ‌ధుర్ బండార్క‌ర్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప‌బ్‌లో లేడీ బౌన్స‌ర్‌గా ఉద్యోగం చేసే ఒక అమ్మాయి క‌థ‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. ట్రైల‌ర్ ఆద్యంతం కామెడీగా సాగింది. త‌మ‌న్నా మొద‌టిసారిగా లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుండ‌టంతో దీనిపై ఆస‌క్తి పెరిగింది. సెప్టెంబ‌ర్ 23నుంచి మూవీ హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగు, త‌మిళ్, హిందీలో స్ట్రీమింగ్ కానుంది.

    ‘పంచతంత్ర క‌థ‌లు’ నుంచి సూప‌ర్‌హిట్ సాంగ్ రిలీజ్

    ‘పంచ‌తంత్ర క‌థ‌లు’ మూవీలో నేనేమో మోతేవ‌రి సాంగ్ సూప‌ర్‌హిట్ అయింది. ఈ పాట‌ను రామ్ మిరియాలా పాడాడు. ఈ వీడియో సాంగ్ తాజాగా రిలీజ్ చేశారు. పంచ‌తంత్ర క‌థ‌లు సినిమాలో వేర్వేరు క‌థ‌ల‌ను ఒక్క‌చోట చూపించారు. నోయ‌ల్, నందిని రాయ్ తదిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. గంగ‌మోని శేఖ‌ర్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క‌మ్రాన్ మ్యూజిక్ అందించాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.

    పూరీ జ‌గ‌న్నాథ్ మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌స్తాడా?

    పూరీ జ‌గ‌న్నాథ్ ఒక మాస్ డైరెక్ట‌ర్‌గా గ‌తంలో బెస్ట్  డైరెక్ట‌ర్స్‌గా నిలిచాడు. ముఖ్యంగా హీరోయిజం చూపించాలంటే, హీరోల‌తో ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పించాలంటే అది పూరీనే. ఇండ‌స్ట్రీకి వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న‌తో ఒక్క సినిమా చేయాల‌ని అనుకునేవారు. పూరీ హీరోల ఎలివేష‌న్ మామూలుగా ఉండ‌దు. ర‌వితేజ‌, అల్లు అర్జున్‌, మ‌హేశ్ బాబును మాస్ హీరోలుగా మార్చింది పూరీ అనే చెప్పుకోవాలి. ఇక టెంప‌ర్‌లో కూడా ఎన్‌టీఆర్ ఒక విభిన్న‌మైన పాత్ర‌లో చూపించాడు. పోకిరి సినిమాను స‌ల్మాన్‌ఖాన్ హిందీలో వాంటెడ్‌గా తెర‌కెక్కించాడు.  ఆ సినిమాతో స‌ల్మాన్ … Read more

    ఆశికి 3 వచ్చేస్తోంది.. హీరో ఎవరంటే..?

    బాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన ఆశికి, ఆశికి 2 సినిమాలకు సీక్వెల్ రాబోతోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ ప్రాజెక్టు తెరకెక్కనుంది. అనురాగ్ బసు మెగాఫోన్ పట్టుకోనున్నాడు. ముఖేశ్ భట్, భూషణ్ కుమార్ తిరిగి ఏకమై ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఆశిక్ 3 కోసం బీటౌన్ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా అప్డేట్ రావడంతో పండుగ చేసుకుంటున్నారు. కార్తీక్ ఆర్యన్ ముఖేశ్ భట్, అనురాగ్ బసు, సంగీత దర్శకుడు ప్రీతమ్ తో కలిసి ఉన్న ఫొటోను ఇన్ … Read more

    ఈ వారంలో వ‌స్తున్న‌ తెలుగు సినిమాలివే

    ఈ వారం తెలుగులో 5 సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు అన్ని ఇండ‌స్ట్రీల దృష్టి బ్ర‌హ్మాస్త్ర‌పై ఉంది. దాంతో పాటు సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కాబోతున్న సినిమాలు.. బ్ర‌హ్మాస్త్ర: సెప్టెంబ‌ర్ 9 అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ బ్ర‌హ్మాస్త్ర. ర‌ణ్‌బీర్ క‌పూర్, ఆలియా భ‌ట్, నాగార్జున‌, అమితాబ్ బ‌చ్చ‌న్, మౌనిరాయ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. గ‌త ప‌దేళ్లుగా ద‌ర్శ‌కుడు దీనిపై ప‌నిచేస్తున్నాన‌ని చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌, పాట‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి.  ఒకే ఒక జీవితం: … Read more