Chatrapathi Review: యాక్షన్‌ సీన్స్‌లో దుమ్మురేపిన బెల్లంకొండ.. ఛత్రపతితో హిట్‌ కొట్టినట్టేనా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Chatrapathi Review: యాక్షన్‌ సీన్స్‌లో దుమ్మురేపిన బెల్లంకొండ.. ఛత్రపతితో హిట్‌ కొట్టినట్టేనా?

    Chatrapathi Review: యాక్షన్‌ సీన్స్‌లో దుమ్మురేపిన బెల్లంకొండ.. ఛత్రపతితో హిట్‌ కొట్టినట్టేనా?

    May 12, 2023

    నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్‌, నుష్రత్‌ భరుచ్చా, కరణ్‌సింగ్‌ ఛబ్రా, సాహిల్ వేద్, అమీత్‌ శివదాస్‌, రాజేంద్ర గుప్త

    డైరెక్టర్‌: V.V. వినాయక్‌

    సంగీతం: తనిష్క్‌ బాగ్చీ

    నిర్మాత : అక్షయ్‌, ధవల్‌, జయంతీ లాల్

    టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి.. తెలుగులో సూపర్ హిట్టుగా నిలిచి ప్రభాస్‌కి మాస్ హీరో ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఇదే సినిమాతో బాలీవుడ్‌లో మాస్ హీరోగా ఎదగడానికి బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ ని ఎంచుకున్నాడు. కాగా శ్రీనివాస్‌కు హిందీ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు ఆయన చేసిన సినిమాలు హిందీలో డబ్‌ అయ్యి మంచి క్రేజ్‌ తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో దాన్ని మరింత పెంచుకునే క్రమంలో ఇవాళ ఛత్రపతి హిందీ సినిమా బాలీవుడ్‌లో రిలీజైంది. మరి సినిమా ఎలా ఉంది? శ్రీనివాస్‌ నటన ఆకట్టుకుందా? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.

    కథ: 

    ఛత్రపతి సినిమా కథ తెలుగు ప్రేక్షకలకు సుపరిచితమే. మారుమూల గ్రామంలో నివసించే మహిళ భాగ్యశ్రీకు ఇద్దరు పిల్లలు. అశోక్‌ (కరణ్‌ సింగ్‌ ఛబ్రా) సొంత బిడ్డ కాగా శివ (బెల్లంకొండ శ్రీనివాస్) పెంపుడు బిడ్డ. గ్రామంలోని వారంతా అనుకోకుండా ఊరిని ఖాళీ చేయాల్సి వస్తోంది. ఆ గందరళగోళంలో శివ తల్లి నుంచి వేరుపడతాడు. అప్పటినుంచి తన తల్లిని వేతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో శివకు హీరోయిన్‌ సాయం చేస్తుంది. అయితే రోజువారీ కూలీగా ఉన్న శివ ఛత్రపతిగా ఎలా మారాడు? తన తల్లిని చేరుకున్నాడా? లేడా? అన్నది మిగతా కథ.

    ఎవరెలా చేశారంటే?

    ఛత్రపతి హిందీ వెర్షన్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ అదరగొట్టాడు. యాక్షన్‌ సీన్స్‌లో తన మార్క్‌ను చూపిస్తూ దుమ్మురేపాడు. శ్రీనివాస్‌ కండలు తిరిగిన దేహం.. యాక్షన్‌ సీన్లను చాలా బాగా ఎలివేట్ చేసింది. ఫైట్ సీన్ల కోసం ఆయన పడ్డ కష్టం తెరపై స్పష్టంగా కనిపించింది. కొన్ని సీన్లలో ఎంతో స్టైలిష్‌గాను హీరో కనిపించాడు. నటన, డ్యాన్స్‌తోనూ అదరగొట్టాడు. నటన పరంగా హీరోయిన్‌ నుష్రత్‌ భరుచ్చాకు పెద్ద స్కోపు లేదు. కేవలం పాటలకు మాత్రమే ఆమెను పరిమితం చేశారు. నెగిటివ్‌ క్యారెక్టర్‌లో కరణ్‌సింగ్‌ ఛబ్రా ఆకట్టుకున్నాడు. సీనియర్‌ నటి భాగ్య శ్రీ, శరద్‌ ఖేల్కర్‌, ఫ్రెడ్డీ ధరువాలా, రాజేష్‌ శర్మ తమ పాత్రల మేరకు నటించారు. 

    విశ్లేషణ

    డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ ఛత్రపతి గ్లింప్స్‌ను తిరిగి తీసుకురావడంలో విఫలమయ్యాడు. దశాబ్దం క్రితం వచ్చిన స్టోరీని ఇప్పటికీ అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుంటే బాగుండేది. ఇప్పటికే ఛ‌త్రపతి చూసిన వాళ్లకు సినిమా బోర్ కొట్టిస్తుంది. పాత కథనే మక్కీకి మక్కిగా తెర‌కెక్కించ‌డం మైనస్ అయ్యింది. స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గా సాగిపోతుంది. సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్, పాటలు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. సినిమాలో ఏదైనా హైలెట్‌ సీన్స్‌ ఉన్నాయంటే అది యాక్షన్‌ సీన్స్‌ మాత్రమేనని ఆడియన్స్ చెబుతున్నారు. 1980-90లో వచ్చిన బాలీవుడ్‌ సినిమాను చూసినట్లు అనిపించిందని పేర్కొంటున్నారు. ఇక ఒక్క మాట‌లో చెప్పాలంటే బాలీవుడ్ ఛ‌త్ర‌ప‌తి ఒక‌ అవుట్ డేటెడ్ సినిమా అనే చెప్పాలి. ఫైట్స్‌ తప్ప సినిమాలో ఏమాత్రం పస లేదు. 

    ప్లస్‌ పాయింట్స్

    • హీరో నటన
    • యాక్షన్‌ సీన్స్‌

    మైనస్‌ పాయింట్స్‌

    • పాటలు
    • రొటిన్‌ సీన్స్‌
    • బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌

    రేటింగ్‌: 2/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version