విభిన్నమైన పాత్రలకు పెట్టింది పేరు జాన్ కెన్నడీ విక్టర్. ఆయన ఎవరో కాదు చియాన్ విక్రమ్. ఎలాంటి గెటప్‌నైనా వేసి నటనతో మెప్పించగలిగిన సామర్థ్యం ఈ హీరోది. ఇప్పటివరకు నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ.. చియాన్ ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గలేదు. ఎన్నో మర్చిపోలేని క్యారెక్టర్లతో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు విక్రమ్. అతడికి పేరు సంపాదించి పెట్టిన కొన్ని ప్రత్యేకమైన పాత్రల గురించి తెలుసుకోండి.
శివ పుత్రుడు
పితమగాన్ సినిమాను తెలుగులో శివ పుత్రుడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అమాయకుడి పాత్రలో చియాన్ విక్రమ్ అదరగొట్టాడు. క్రూరంగా కనిపిస్తూ జాలి, దయ కలిగున్న మనిషిగా నటించాడు. రస్టీ లుక్‌లో విక్రమ్ నటనకు జాతీయ అవార్డు లభించింది. బాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సూర్య కూడా మరో క్యారెక్టర్‌లో నటించాడు.
అపరిచితుడు
శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడులో విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో మూడు డిఫరెంట్ రోల్స్‌లో చేశాడు. తప్పులను ప్రశ్నించే అమాయకమైన రామానుజం, తప్పు చేసిన వారిని శిక్షించే అపరిచితుడు, ప్రియురాలి ప్రేమ కోసం తపించే రెమో క్యారెక్టర్‌లో నటనతో ప్రేక్షకులను మెప్పించాడు విక్రమ్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
మల్లన్న
విక్రమ్ సినిమా తీస్తున్నాడంటే ఏదో ప్రత్యేకత ఉందని అభిమానులు భావించేలా చిత్రాల్ని ఎంచుకున్నాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మల్లన్న చిత్రంలోనూ వివిధ గెటప్‌లతో అలరించాడు చియాన్. కోడి మాస్క్ ధరించి నటించడంతో పాటు లేడీ గెటప్‌లోనూ నటించాడు. కానీ, సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఐ
శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమాలో విక్రమ్ చేసిన రోల్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇందులో విచిత్రమైన వ్యాధి సోకి వృద్ధాప్యం వచ్చిన పాత్రలో మెప్పించాడు విక్రమ్. ఇందుకోసం చాలా కష్టపడ్డాడు. ఓ పాటలో బీస్ట్ గెటప్‌లోనూ మెరిశాడు. బాడీ బిల్డర్‌గానూ నటించిన ఈ టాప్ హీరో… చాలా రోజుల పాటు కేవలం మంచినీళ్లు మాత్రమే తీసుకున్నట్లు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
నాన్న
విక్రమ్ కెరీర్‌లో నాన్న సినిమా ప్రత్యేకం. సరైన మతిస్థిమితం లేని వ్యక్తి కుమార్తెతో కలిసి ఉండే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో విక్రమ్ చేసిన క్యారెక్టర్‌కి కూడా మంచి మార్కులు పడ్డాయి. తండ్రి, కూతురు మధ్య కేవలం సైగలతో వచ్చే సీన్ ఇప్పటికే చాలామందిని మెప్పించింది.
ఇంకొక్కడు
ఇరుముగన్‌గా వచ్చిన తమిళ్ సినిమా తెలుగులో ఇంకొక్కడు పేరుతో అనువాదం అయ్యింది. ఇందులో రెండు క్యారెక్టర్స్‌లో విక్రమ్ కనిపించాడు. లేడీ విలన్ రోల్‌లో అదరగొట్టాడు. ఆ గెటప్ చూస్తే నిజంగా విక్రమ్ ఇలాంటి రోల్ చేశాడా అనిపిస్తుంది. అంతలా మెప్పించాడు విక్రమ్. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది.
తంగలాన్
విక్రమ్ తదుపరి చిత్రం తంగలాన్. ఇందులో మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం