Citadel Honey Bunny Review: ఇండియన్‌ స్పైగా అదరగొట్టిన సామ్‌.. ‘సిటాడెల్: హనీ బన్నీ’ ఎలా ఉందంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Citadel Honey Bunny Review: ఇండియన్‌ స్పైగా అదరగొట్టిన సామ్‌.. ‘సిటాడెల్: హనీ బన్నీ’ ఎలా ఉందంటే?

    Citadel Honey Bunny Review: ఇండియన్‌ స్పైగా అదరగొట్టిన సామ్‌.. ‘సిటాడెల్: హనీ బన్నీ’ ఎలా ఉందంటే?

    November 7, 2024

    నటీనటులు: వరుణ్‌ ధావన్‌, సమంత, కేకే మేనన్‌, సికందర్‌ ఖేర్‌, షకీబ్‌ సలీమ్‌, సిమ్రన్‌ తదితరులు

    రచన: సీత.ఆర్‌ మేనన్‌, రాజ్‌ అండ్‌ డీకే

    దర్శకత్వం: కృష్ణ డి.కె, రాజ్‌ నిడిమోరు

    సంగీతం : అమన్‌ పంత్‌

    సినిమాటోగ్రఫీ : జోహన్‌ హుర్లిన్‌ 

    ఎడిటింగ్‌ : సుమిత్‌ కొటియన్‌

    స్ట్రీమింగ్‌ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

    విడుదల తేదీ : నవంబర్‌ 7, 2024

    హిందీలో ‘ఫ్యామిలీ మ్యాన్‌’ (Family Man), ‘ఫర్జీ’ (Farzi) వంటి విజయవంతమైన సిరీస్‌లను రూపొందించి దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే ఎంతో గుర్తింపు సంపాదించారు. రీసెంట్‌గా వారి దర్శకత్వంలో రూపొందిన మరో మోస్ట్ వాంటెడ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’. బాలీవుడ్‌ స్టార్‌ హీరో వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan), గ్లామర్‌ బ్యూటీ సమంత (Samantha Ruth Prabhu) ఈ సిరీస్‌లో లీడ్‌ రోల్స్‌లో నటించారు. ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ (Citadel Honey Bunny Review) పేరుతో అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. జేమ్స్‌ బాండ్ మూవీల తరహాలో స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్‌ ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఫ్యామిలీ మ్యాన్‌ తరహాలోనే సమంత మరోమారు ఆకట్టుకుంటుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.

    కథేంటి

    బన్నీ (వరుణ్ ధావన్) ఓ స్టంట్ మ్యాన్. అదే సమయంలో సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. గురు (కేకే మేనన్‌) ప్రైవేటు సీక్రెట్‌ ఏజెన్సీ నాయకుడిగా ఉంటాడు. ఓ రోజు షూటింగ్‌ సమయంలో జూనియర్ ఆర్టిస్టు హనీ (సమంత)తో బన్నీకి పరిచయం ఏర్పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బన్నీతో కలిసి ఓ సీక్రెట్‌ ఆపరేషన్‌ చేసేందుకు హనీ ఒప్పుకుంటుంది. మిషన్‌ సమయంలో జరిగిన నాటకీయ పరిణామాల వల్ల హనీ చనిపోయిందని బన్నీ భావిస్తాడు. 8 ఏళ్ల తర్వాత హనీ బతికే ఉందన్న విషయం తెలుస్తుంది. అంతేకాదు తమ కలయికతో పుట్టిన నాడియా (కశ్వీ మజ్ముందార్‌) అనే ఐదేళ్ల కూతురు కూడా ఉన్నట్లు తెలుసుకుంటాడు. దీంతో విదేశాల్లో ఉన్న బన్నీ ఆమెను వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు. మరోవైపు హనీ, ఆమె కూతుర్ని చంపేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు? తన భార్యను వెతుక్కుంటూ వచ్చిన బన్నీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హనీ దగ్గర ఉన్న అర్మాడాలో ఏముంది? దాని కోసం ఎందుకు విలన్‌ గ్యాంగ్‌ వెతుకుతుంది? అన్నది స్టోరీ. (Citadel Honey Bunny Review) 

    ఎవరెలా చేశారంటే

    బన్నీ పాత్రలో బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ సెటిల్డ్‌గా నటించాడు. యాక్షన్స్‌ సీక్వెన్స్‌లో తనమార్క్‌ చూపించి అదరగొట్టాడు. ఇక సిరీస్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సమంత నటన గురించే. తన నటనతో పాటు ఫైట్ సీన్స్‌లోనూ సామ్‌ దుమ్మురేపింది. సీక్రెట్ ఏజెంట్‌గా, లవర్‌గా, తల్లిగా సమంత మూడు వేరియేషన్స్‌లో చక్కగా నటించింది. సమంత, వరుణ్‌ లిప్‌లాక్‌ సీన్స్‌  యూత్‌కు కన్నుల విందుగా అనిపిస్తుంది. ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ తరహాలో ఇందులో కూడా హాట్‌ సీన్స్‌లో సామ్ నటించింది. సిరీస్‌ మెుత్తం వరుణ్‌, సామ్‌ స్క్రీన్‌ ప్రజెన్స్ చుట్టే తిరిగింది. తన గ్లామర్‌తో సమంత కట్టిపడేసింది. నాడియా పాత్ర కథలో భావోద్వేగాలను పండించేందుకు బాగా ఉపయోగపడింది. ఆ పాత్ర చేసిన చిన్నారి అద్భుతంగా నటించింది. కేకే మేనన్‌, సిమ్రన్‌, సహా బన్నీ టీమ్‌లో ఉన్న మిగిలినవాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. 

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    కథ పరంగా ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ (Citadel Honey Bunny Review)లో పెద్దగా కొత్త దనం కనిపించదు. కానీ కథను ప్రజెంట్‌ చేసే విధానం, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం రాజ్‌ అండ్‌ డీకే టీమ్‌ తమ మార్క్‌ చూపించారు. ప్రతి ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా విభజించి 1992, 2000 సంవత్సరాల్లో పార్లర్‌గా కథను నడపడం ఆకట్టుకుంది. ప్రస్తుత కథలోని పాత్రలు, వాటికి గతంలో ఒకదానితో ఒకటికి ఉన్న కనెక్షన్స్‌ను ఎలాంటి గందరగోళం లేకుండా క్లీన్‌గా ప్రజెంట్‌ చేశారు. తొలి రెండు ఎపిసోడ్స్‌ పాత్రల పరిచయానికే సరిపోయినా మూడో ఎపిసోడ్‌ నుంచి స్టోరీలోకి తీసుకెళ్లారు డైరెక్టర్స్‌. ప్రపంచాన్ని, దేశాధినేతలను శాసించగల ఆర్మార్డ్‌ వస్తువును దక్కించుకునేందుకు హనీ-బన్నీ, విలన్‌ గ్యాంగ్‌ చేసే పోరాటం ఆకట్టుకుంటుంది. అయితే ‘ఫ్యామిలీ మ్యాన్‌’ స్థాయి థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ లేకపోవడం, ఎలాంటి ట్విస్టులు లేకుండా కూల్‌గా కథ సాగిపోవడం, ఒక్కో ఎపిసోడ్‌ 50 నిమిషాల పైనే నిడివి ఉండటం మైనస్‌గా మారింది. 

    టెక్నికల్‌గా..

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే అన్ని విభాగాలు (Citadel Honey Bunny Review) మంచి పనితీరు కనబరిచాయి. అమన్ పంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. జోహన్ హెర్లీన్ సినిమాటోగ్రఫి ఈ మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్. ఫైట్స్, ఛేజింగ్ సీన్లను క్యాప్చర్ చేసిన తీరు యాక్షన్ లవర్స్‌ను ఆకట్టుకొనేలా ఉంది. అయితే నిడివి విషయంలో జాగ్రత్త పడి ఉంటే బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉండాల్సింది. రూసో, రాజ్ డీకే అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

    ప్లస్‌ పాయింట్స్‌

    • సమంత, వరుణ్‌ధావన్‌
    • యాక్షన్‌ సీక్వెన్స్‌
    • టెక్నికల్‌ టీమ్‌

    మైనస్‌ పాయింట్స్‌

    •  రొటీన్‌ స్టోరీ
    •  నిడివి
    • ట్విస్టులు లేకపోవడం

    Telugu.yousay.tv Rating : 3/5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version