Controversial Movies: విడుదలకు ముందే విమర్శలు.. సినిమాలు మాత్రం సూపర్ హిట్లు..! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Controversial Movies: విడుదలకు ముందే విమర్శలు.. సినిమాలు మాత్రం సూపర్ హిట్లు..! 

    Controversial Movies: విడుదలకు ముందే విమర్శలు.. సినిమాలు మాత్రం సూపర్ హిట్లు..! 

    May 19, 2023

    సినిమాలను అమితంగా ఇష్టపడే దేశంలో భారత్‌ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ ఏటా వందల చిత్రాలు రిలీజవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయి. ప్రతీ మనిషి జీవితంలో సినిమాలు ఓ భాగం కావడంతో అవి సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు విడుదలకు ముందే వివాదస్పదంగా మారుతున్నాయి. ఆ చిత్రాలను బ్యాన్‌ చేయాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలే పుట్టుకొచ్చాయి. భారత్‌లో తీవ్ర వివాదానికి కారణమైన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  

    ది కేరళ స్టోరీ

    భారత్‌లో విడుదలకు ముందే తీవ్ర విమర్శలను మూటగట్టుకున్న సినిమా ‘కేరళ స్టోరీ’. కేరళలో గత కొన్నేళ్లలో అదృశ్యమైన 32 వేల మంది మహిళలు ఎక్కడనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. నలుగురు యువతులు మతం మారి, అనంతరం ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో కథ నడుస్తుంది. తప్పిపోయిన అమ్మాయిలు ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారితీసింది. దీనిపై కేరళ సీఎం సహా, ప్రతిపక్ష కాంగ్రెస్‌, ముస్లిం సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. సమాజంలో అల్లర్లు సృష్టించేలా ఈ సినిమా ఉందంటూ ఆరోపించాయి. వీటన్నింటిని దాటుకొని రిలీజైన ‘ది కేరళ స్టోరీ’ పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. ఇందులో ఆదా శర్మ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

    Image Credit: wikipedia/commons

    ఫర్హానా

    నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వంలో హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ నటించిన ‘ఫర్హానా’ సినిమాపై కూడా వివాదం చెలరేగింది. ముస్లింల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై కొన్ని ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సినిమాలో ముస్లిం మహిళలను, హిజాబ్‌ను అవమానించేలా డైలాగ్‌లు ఉన్నాయని కొన్ని ఇస్లామిక్ సంస్థలు ఆరోపించాయి. వివాదం మరింత ముదురుతుండటంతో మేకర్స్‌ స్పందించారు. ఈ సినిమా ఏ మతం సెంటిమెంట్‌లకు వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. మే 12న రిలీజైన ఫర్హానా చిత్రం హిట్‌ టాక్ తెచ్చుకుంది. 

    Image Credit: wikipedia/commons

    ది కాశ్మీర్‌ ఫైల్స్‌

    2022లో వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది కాశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం అప్పట్లో తీవ్ర దుమారానికి కారణమైంది. కశ్మీరీ పండిట్లను మిలిటెంట్లు ఏ విధంగా హింసించి చంపారో అన్న అంశాన్ని ఇతివృత్తంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా రాజకీయరంగు పులుముకోవడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భాజపా పాలిత రాష్ట్రాలు ఈ ప్రదర్శనలకు పన్ను రాయితీలు సైతం ఇచ్చాయి. అయితే, ది కాశ్మీర్‌ ఫైల్స్‌లో వాస్తవాలను వక్రీకరించి చూపించారంటూ కాంగ్రెస్‌ మండిపడింది. 

    Image Credit: wikipedia/commons

    పఠాన్‌

    బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ రీసెంట్‌ మూవీ ‘పఠాన్‌’ పైనా విడుదలకు ముందు వివాదం చెలరేగింది. చిత్రంలోని ‘బేషరమ్‌ రంగ్‌’ పాటలో దీపికా ధరించిన కాషాయ రంగు బికినీ వివాదానికి కారణమైంది. కాషాయ రంగు బికినిపై హిందూ – ముస్లిం సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా సైతం దీపిక వస్త్రధారణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వహిందూ పరిషత్‌, వీర్ శివాజీ గ్రూప్‌లు సైతం అసంతృప్తి వ్యక్తం చేశాయి. 

    Image Credit: wikipedia/commons

    అర్జున్‌ రెడ్డి

    విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్‌ రెడ్డి సినిమాపై కూడా అప్పట్లో చాలా విమర్శలే వచ్చాయి. ఈ మూవీలో అభ్యంతరకర సీన్లు ఎక్కువగా ఉన్నాయంటూ పలువురు ప్రజా సంఘ నేతలు సినిమా పోస్టర్లను చించేశారు. ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. యాంకర్‌ అనసూయ సైతం సినిమాలోని అభ్యంతరకర డైలాగ్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే ఈ వివాదాలను దాటుకొని అర్జున్‌ రెడ్డి సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. విజయ్‌ దేవరకొండను స్టార్‌ హీరోగా నిలబెట్టింది. 

    Image Credit: wikipedia/commons

    పీకే

    బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాపై కూడా 2014లో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని పలు హిందూ సంస్థలు ధ్వజమెత్తాయి. సినిమాపై నిషేధం విధించడంతోపాటు చిత్రంతో సంబంధం ఉన్న వారందరినీ సమాజం నుంచి వెలివేయాలని యోగా గురు బాబా రాందేవ్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ముస్లిం సంఘాలు సైతం పీకే సినిమాను తప్పుబట్టాయి. అప్పట్లో ఈ వివాదంపై స్పందించిన అమీర్‌ఖాన్‌ అన్ని మతాలను తాము గౌరవిస్తామన్నారు. అయితే రిలీజ్‌ అనంతరం పీకే సూపర్‌ హిట్‌గా నిలిచింది. 

    Image Credit: wikipedia/commons

    ద ఢిల్లీ ఫైల్స్

    కశ్మీర్ ఫైల్స్ చిత్రం తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం ‘ద ఢిల్లీ ఫైల్స్’ సినిమాపై వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాపై కూడా చర్చ జరుగుతోంది. పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ ఈ డైరెక్టర్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన నోటీసులు పంపించారు. ఈ విధంగా ‘ద ఢిల్లీ ఫైల్స్’ చిత్రీకరణకు ముందే హాట్ టాపిక్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version