దీపావళి సందర్భంగా పలువురు తెలుగు హీరోయిన్లు సాంప్రదాయ వస్త్రాలంకరణలో తళక్కున మెరిసారు. కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకున్న ఆనంద క్షణాలను ఇన్‌స్టా పోస్ట్‌ల ద్వారా పంచుకున్నారు. మరి ఎవరెవరూ పండుగను ఎలా జరుపుకున్నారో మీరు ఓ లుక్ వేయండి.
టాలీవుడ్ కుర్ర హీరోయిన్ పూజిత పొన్నాడ బ్లూ కలర్ శారీలో అందంగా కనిపించింది. చేతిలో దీపాలతో ఫొటోలకు పొజులిచ్చింది. ఇంటిళ్లిపాది దీపాలను అలంకరించింది.
నేషనల్ క్రష్ రష్మిక మంధాన దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంది. రాత్రిపూట తన ఇంటి టెరాస్‌పై దీపాలు పెడుతూ అందంగా కనిపించింది.
దేవర బ్యూటి జాన్వీ కపూర్ దీపావళి సందర్భందా టిష్యూ సిల్క్ చీరలో తళక్కున మెరిసింది. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకుంది.
రాశీ ఖన్నా దీపావళి వేళ.. ఇంటి ముగ్గువేసి పువ్వులతో అలంకరించింది. వాటిపై దీపాలు పెడుతూ పండుగను సెలబ్రేట్ చేసుకుంది.
బాలయ్య ముద్దుగుమ్మ ప్రాగ్య జైస్వాల్ దీపావళి వేళ తన ఇంటిని బంతిపూల మాలలతో అలంకరించింది. వీటికి సంబంధించిన ఫిక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
తమిళ్ సూపర్ స్టార్ సూర్య తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళిని ఘనంగా జరుపుకున్నాడు. ఈ ఆనంద క్షణాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.
అందాల తార అనసూయ దీపావళి వేళ.. సాంప్రదాయ వస్త్రాలంకరణలో మెరిసింది. చేతిలో దీపం చూపిస్తూ తన సంతోషాన్ని పంచుకుంది.
ఇస్మార్ట్ భామ నభా నటేష్ హాట్ లుక్‌లో దియా పట్టుకుని ఫొటోకు పొజులిచ్చింది. బ్యాక్ గ్రౌండ్ వెలుతురులో అందంగా కనిపించింది.
మేజర్ బ్యూటీ సాయి మంజ్రేకర్ దీపావళి ట్రెడిషనల్ అవుట్ లుక్‌లో వావ్ అనిపించింది. దీపాలు వెలిగిస్తున్న ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ నేహా శర్మ పండుగ వేళ హాట్ లుక్‌లో దియాను పట్టుకుని ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ గ్లామరస్ పిక్స్ వైరల్‌గా మారాయి.
కొత్త జంట మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు.
టాలీవుడ్ గ్లామరస్ బ్యూటి పూజా హెగ్డే తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళిని ఘనంగా జరుపుకుంది. రెడ్ శారీలో అందంగా కనిపించింది.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి పాటాసులు కాల్చే ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. కుటుంబంతో దీపావళిని ఆనందంగా జరుపుకున్నట్లు పోస్ట్ చేశాడు.
జూనియర్ ఎన్టీఆర్ సైతం తన కుటంబ సభ్యులతో కలిసి దీపావళిని ఆనందంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ