Eco Friendly Ganesh Idols : హైదరాబాద్‌లో మట్టితో తయారైన గణేష్ విగ్రహాలు లభించే టాప్ రేటింగ్ తయారీ ప్రదేశాలు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Eco Friendly Ganesh Idols : హైదరాబాద్‌లో మట్టితో తయారైన గణేష్ విగ్రహాలు లభించే టాప్ రేటింగ్ తయారీ ప్రదేశాలు!

    Eco Friendly Ganesh Idols : హైదరాబాద్‌లో మట్టితో తయారైన గణేష్ విగ్రహాలు లభించే టాప్ రేటింగ్ తయారీ ప్రదేశాలు!

    September 15, 2023

    గణేణ్ చతుర్థి వచ్చిందంటే పల్లే పట్టణం తేడా లేకుండా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అందమైన, ఆకర్షణీయమైన వినాయక విగ్రహాలు ఇంటికి తెచ్చేందుకు పిల్లలు, పెద్దలు ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా గణేష్ నవరాత్రులను ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. అయితే వినాయక విగ్రహాలను ఎంపిక చేసుకోవడంలో ప్రజలు తమ మనోభావాలతో పాటు పర్యావణ స్పృహ కలిగి ఉంటే మంచింది. ఏటా ప్లాస్టర్‌ ఆఫ్ పారిస్ గణేష్ బొమ్మల వల్ల పర్యావరణానికి హాని కలుగుతోంది. మట్టి వినాయక విగ్రహాలను కొనాలని ఉన్నా… వాటిని తయారు చేసే ప్రదేశాలు తెలియక పోవడంతో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల పైపు జనాలు మళ్లుతున్నారు. ఈనేపథ్యంలో హైదరాబాద్ చుట్టు పక్కల ప్రదేశాల్లో పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహాలు ఎక్కడ లభిస్తాయో YouSay Web మీకోసం ప్రత్యేకంగా అందిస్తోంది. అవి కూడా అందమైన విగ్రహాలు తక్కువ ధరలో లభిస్తున్నాయి. మరి వాటిపై ఓలుక్‌ వేయండి. 

    మరాఠీ గ్రంథ్ సంగ్రహాలయ్-సుల్తాన్ బజార్

    సుల్తాన్ బజార్‌లోని మరాఠీ గ్రంథ్ సంగ్రహాలయ్.. మట్టితో తయారైన వినాయక విగ్రహాలకు పెట్టింది పేరు. ఇక్కడ పూణే నుంచి వచ్చి స్థిరపడ్డ కళాకారులు ఏటా పెద్ద సంఖ్యలో గణేష్ విగ్రహాలను తయారు చేస్తుంటారు. ఇక్కడ అందమైన మట్టి గణపయ్య విగ్రహాలు సరసమైన ధరల్లో లభిస్తాయి. విగ్రహాలు మృదువైన రంగులతో ఆకర్షనీయంగా కనిపిస్తాయి. 

    జై భవానీ గణేష్ ఐడల్స్ సేల్స్- ధూల్ పేట్

    కళాత్మకమైన డిజైన్లు, ఆకర్షనీయమైన రంగులతో తయారైన అందమైన గణేష్ విగ్రహాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు జై భవానీ గణేష్ ఐడల్స్ గొప్ప గమ్య స్థానం. ఇక్కడ మట్టి విగ్రహాలు మాత్రమే కాకుండా ఇంట్లో ఆలయ గదికి సరిపడే డిజైన్, సైజుల్లో విగ్రహాలు తయారు చేస్తుంటారు. అందులో మీకు నచ్చిన ప్రతిమను ఎంచుకుని తెచ్చుకోవచ్చు. విగ్రహాల ధరలు కూడా అందుబాటు ధరల్లోనే ఉన్నాయి.

    Phone Number: 9989890942

    మంగళం

    మంగళం హస్త కళాఖండాలకు ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహాల్లో ప్రతి ఒక్క నగషీ అద్భుతంగా కనిపిస్తుంది. ప్రత్యేకంగా వీరు తయారు చేసే జూలా గణేష్ ఉర్లీ మిమ్మల్ని బాగా ఆకర్షిస్తుంది. వీటిని పండుగ ముగిసిన తర్వాత కావాలంటే వీటిని మీ పూజ గదిలో అలంకరణగా చేర్చుకోవచ్చు. ఈ విగ్రహాలను ఆన్‌లైన్‌ ద్వారా కూడా కొనుగోలు చేసుకోవచ్చు.

    Tree Ganesha

    ట్రీ గణేష విగ్రహాలు పూర్తిగా పర్యావరణ హితమైన ఎర్ర నేల, సేంద్రియ పదార్థాలు, విత్తనాలు, సహజమైన రంగులతో తయారవుతాయి. ఈ విగ్రహాల్లోని గొప్పదనం ఏమిటంటే వీటిని నిమజ్జనం చేసిన తర్వాత మొక్కగా పెరుగుతుంది. వీటిని ఆన్‌లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు.

    ఎకో ఫ్రెండ్లీ గణేష్, గుర్రం గూడ

    మట్టి విగ్రహాలను కాస్త పెద్దవిగా కావాలనుకుంటే మీకు గుర్రం గూడలోని ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాల తయారీ కేంద్రం మంచి గమ్యస్థానం. గుర్రం గూడలోని శ్రీశ్రీ అవెన్యూలో మట్టితో వినాయకుడి ప్రతిమలను పెద్దసంఖ్యలో తయారు చేస్తుంటారు. వీరు పెద్ద పెద్ద ఆర్డర్‌లను తీసుకుంటారు. ఇవి చాలా సహజ రంగులతో ఆకట్టుకుంటాయి.

    Sage Farm Cafe, జూబ్లీ హిల్స్

    జూబ్లీ హిల్స్‌లోని సేజ్ ఫార్మ్ కేఫ్ పర్యావరణ హితమైన గణేష్ విగ్రహాల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వినాయక ప్రతిమలను 100% బంకమట్టితో తయారు చేస్తారు. సహజమైన రంగులే విగ్రహాలకు అద్దుతారు. మీరు నేరుగా సైట్‌కి వెళ్లి కొనుగోలు చేసుకోవచ్చు.

    శ్రీ ఓంకార్ ఆర్ట్స్, 

    కాగితంతో తయారైన గణేష్ విగ్రహాలకు శ్రీ ఓంకార్ ఆర్ట్స్‌ పేరు గాంచింది. ఇక్కడ తయారయ్యే విగ్రహాలు తేలికగా ఉండటమే కాకుండా.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కంటే దృఢంగా ఉంటాయి. విభిన్న అభిరుచి కలిగిన వారికి ఇది ఒక గొప్ప ఎంపికగా చేప్పవచ్చు.

    విగ్రహాల బుకింగ్ కోసం 9820828804

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version