GANGULY-VIRAT KOHLI: గంగూలీ- కోహ్లీ మధ్య గొడవలు వచ్చింది ఇందుకేనా? ఈ విషయంలోనే మాట్లాడుకోవట్లేదా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  •  GANGULY-VIRAT KOHLI: గంగూలీ- కోహ్లీ మధ్య గొడవలు వచ్చింది ఇందుకేనా? ఈ విషయంలోనే మాట్లాడుకోవట్లేదా?

     GANGULY-VIRAT KOHLI: గంగూలీ- కోహ్లీ మధ్య గొడవలు వచ్చింది ఇందుకేనా? ఈ విషయంలోనే మాట్లాడుకోవట్లేదా?

    April 18, 2023

    ఇద్దరు టీమిండియా దిగ్గజాలు…కనిపిస్తే మాట్లాడుకోరు. మర్యాదపూర్వకంగా షేక్‌ హ్యాండ్స్‌ ఇచ్చుకోరు. వాళ్లేవరో కాదు.. గంగూలీ- విరాట్ కోహ్లీ. కొన్ని నెలలుగా ఇద్దరూ ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారు. వీరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి అనడానికి ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ చూస్తే తెలుస్తుంది. ఇటీవల జరిగిన సంఘటనలు ఇందుకు అద్ధం పడుతున్నాయి. అసలు వారి మధ్య ఏం జరిగింది? ఇలా ఉండటానికి కారణమేంటో తెలుసుకుందాం?

    అక్కడే తెలిసింది

    ప్రస్తుతం క్రికెట్ సర్కిల్‌లో ఎక్కడ చూసినా గంగూలీ, విరాట్ కోహ్లీ గురించే చర్చ జరుగుతుంది. ఇటీవల దిల్లీ VS ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లోనే వీరిమధ్య విబేధాలు ఉన్నాయని బయటపడింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్‌ ఇచ్చుకునేటప్పుడు గంగూలీ, కోహ్లీ ఒకరినొకరు దాటవేశారు. ఇది కాస్త మీడియా కంటపడటంతో రచ్చ రచ్చయ్యింది. వీళ్ల మధ్య కొంతకాలంగా మాటలు లేవని.. గొడవలు జరుగుతున్నాయని వార్తలు గుప్పుమన్నాయి. 

    గంగూలీని ఎలా చూశాడంటే

    ఇదే మ్యాచ్‌ ప్రారంభానికి ముందు కోహ్లీ బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉన్నప్పుడు ఇచ్చిన లుక్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్యాడ్లు కట్టుకొని కూర్చొని ఉన్న కోహ్లీ ముందు నుంచి గంగూలీ వెళ్లాడు. అప్పుడు విరాట్‌ దాదా వైపు తదేకంగా చూశాడు. తర్వాత వచ్చిన ప్లేయర్లతో మాట్లాడినప్పటికీ సౌరవ్‌తో మాత్రం అలా ప్రవర్తించడం చూస్తే ఇద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయనే అనుకోవాలి. 

    ఫీల్డింగ్‌ చేస్తూ

    సాధారణంగానే కొంచెం అగ్రెసివ్‌గా ఉండే విరాట్ కోహ్లీ… ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో ప్రవర్తించిన తీరు కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఎందుకంటే బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తూ కూడా గంగూలీ వైపు కోపంగా చూశాడు కోహ్లీ. ఇందుకు సంబంధించిన పిక్‌ కూడా వైరల్ అయ్యింది. 

    అన్‌ ఫాలో

    సామాజిక మాధ్యమాల్లోనూ ఒకరికొకరు అన్‌ ఫాలో చేసుకున్నారు. దిల్లీ మ్యాచ్‌ అనంతరం సౌరవ్ గంగూలీని ఇన్‌స్టాలో అన్‌ ఫాలో చేశాడు కోహ్లీ. తర్వాత కోహ్లీని కూడా సౌరవ్ అన్‌ఫాలో చేశాడు.  వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పటానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం అవసరం లేదేమో. 

    అసలేం జరిగింది

    గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ వివాదం తలెత్తింది. అప్పుడు కెప్టెన్‌గా కోహ్లీని దాదానే తప్పించాడని పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. విరాట్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్‌ను సారథిగా చేసిన అనంతరం వైట్ బాల్ క్రికెట్‌కు కెప్టెన్‌గా ఒక్కరే ఉండాలని భావిస్తున్నట్లు చెప్పాడు గంగూలీ. కానీ, అదే సమయంలో కోహ్లీని టీ 20కి నాయకుడిగా కొనసాగాలని కోరాడు. నాటకీయ పరిణామాల మధ్య రెండింటి నుంచి తప్పుకున్నాడు రన్ మెషిన్‌. నెల రోజుల తర్వాత టెస్టులకు కూడా కెప్టెన్సీ నుంచి విరామం ప్రకటించాడు. అక్కడ్నుంచే అసలైన వివాదం మెుదలైందని భావించారు. 

    ఫ్యాన్స్‌కు ఇబ్బందే!

    గంగూలీ, విరాట్.. టీమిండియా కోసం ఎంతో కష్టపడ్డారు. అలాంటి ఇద్దరు దిగ్గజాలు ఇలా ఉండటం పట్ల క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version