పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిత్రాలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ప్రస్తుతం పవన్ చేతిలో ‘ఓజీ’ (OG), ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu), ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ పరంగా ‘హరి హర వీరమల్లు’ చాలా అడ్వాన్స్‌గా ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్‌డేట్ ఒకటి బయటకొచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అందుకు కారణమెంటో ఇప్పుడు చూద్దాం.
ఫైనల్ షెడ్యూల్ షురూ
పవన్ హీరోగా చేస్తోన్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుండగా తొలి పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ మూవీ ఆఖరి షెడ్యూల్ ఈ వీకెండ్‌లో విజయవాడలో వేసిన సెట్‌లో మెుదలుకానుంది. సినిమాకు అత్యంత కీలకమైన సీన్స్‌లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కూడా జాయిన్ అవుతారని టాక్. మెుత్తం 200 మంది ఆర్టిస్టులతో కలిసి పవన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. యానిమల్ ఫేమ్ బాబి డియోల్‌తో పాటు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌తోనే షూటింగ్ పూర్తి కానుండటంతో ఈ సినిమా రిలీజ్‌పై ఎలాంటి సందేహాం పెట్టుకోవాల్సిన పనిలేదని ఆనందిస్తున్నారు.
500 మందితో ఫైట్ సీన్స్
హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రాన్ని 2025 మార్చి 28న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దానికి అనుగుణంగా సినిమాను ఫినిష్ చేసేందుకు గత కొంతకాలంగా చురుగ్గా షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవలే హాలీవుడ్ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాలను సైతం మూవీ టీమ్ చిత్రీకరించింది. పవన్‌తో పాటు దాదాపు 400 నుంచి 500 మంది ఈ యుద్ధ సన్నివేశంలో పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫైట్ సినిమాకే హైలెట్ ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సీన్‌లో పవన్ యాక్షన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. కాగా, హరిహర వీరమల్లు చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది.
బ్యాంకాక్ వెళ్లనున్న పవన్!
హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu)తో పాటే ‘ఓజీ’ (OG) షూటింగ్ కూడా ప్యార్లర్‌గా జరుగుతోంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ పవన్ లేని సన్నివేశాలను ఎంతో ఫాస్ట్‌గా చిత్రీకరిస్తున్నారు. మరోవైపు పవన్ సైతం ఈ రెండు చిత్రాలను డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ వీకెండ్ హరి హర వీరమల్లును షూట్‌ను పవన్ పూర్తి చేయనున్నారు. అనంతరం ‘ఓజీ’ టీమ్‌లో పవన్ జాయిన్ కానున్నారు. బ్యాంకాంక్‌లో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను దర్శకుడు సుజీత్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ షెడ్యూల్‌తో పవన్ షూటింగ్ పూర్తవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో పవన్ వచ్చేవారంలో బ్యాంకాంక్ వెళ్లి ఓజీ షూట్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.
పవన్‌తో విజయ్ దేవరకొండ బిగ్ ఫైట్
2025 సమ్మర్ బరిలో పవన్‌ను విజయ్ దేవరకొండ ఢీకొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) రిలీజ్ కానున్న అదే డేట్‌కు విజయ్ నటిస్తున్న ‘VD 12’ కూడా విడుదల కాబోతోంది. ఆ తేదీని ‘హరి హర వీరమల్లు’ కంటే ముందే ‘VD 12‘ టీమ్ లాక్ చేసింది. దీంతో పవన్‌తో విజయ్ దేవరకొండకు బిగ్ ఫైట్ తప్పదని చెప్పవచ్చు. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాతలు ‘VD 12’ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Celebrities Featured Articles Political Figure
Revanth Reddy: టాలీవుడ్‌పై రేవంత్ సర్కార్ పగ? వరుస ఘటనలు ఏం చెబుతున్నాయి?