సినిమా విజయాల్లో హీరోలతో పాటు హీరోయిన్స్ కీలక పాత్ర పోషిస్తారు. చివరి వరకూ ఉంటూ తమ నటనతో ఆకట్టుకుంటారు. అంతేగాక పాటల్లో గ్రామర్ షో చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. హీరోయిన్ల కోసమే సినిమా చూసే ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారంటే ఎలాంటి అతియోక్తి లేదు. మరి సినిమా కోసం ఎంతగానో కష్టపడే హీరోయిన్ల రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది?. సౌత్ ఇండియా కథానాయికల్లో పారితోషికంలో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఈ కథనంలో తెలుసుకుందాం.
ఐశ్వర్య రాయ్
ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ ఇండియన్ కథానాయికగా ఐశ్వర్యరాయ్ నిలిచింది. పొన్నియన్ సెల్వన్-2 సినిమా కోసం ఆమె రూ.10 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలిసింది. దక్షిణాది సినీరంగంలో ఇంత పెద్ద మెుత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక నటి ఐశ్వర్యనే.
నయనతార
ప్రముఖ హీరోయిన్ నయనతార లీడ్ రోల్ ఉన్న సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక్కో సినిమాకు రూ. 5 – 10 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. సినిమాలో తన ప్రాధాన్యత బట్టి గరిష్టంగా పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్.
సమంత
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత కూడా భారీగానే పారితోషికం తీసుకుంటోందట. ఒక్కో సినిమాకు రూ. 3 – 8 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.
శృతి హాసన్
ప్రముఖ నటి శృతి హాసన్ ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల ద్వారా మంచి హిట్ అందుకుంది. శృతి ఒక సినిమాకు రూ. 6-8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.
పూజా హెగ్డే
టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే తెలుగుతో పాటు, బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ భామ ఒక్కో సినిమాకు రూ. 3.5 – 5 కోట్లు తీసుకుంటోంది. పూజా ప్రస్తుతం SSMB 28 సినిమాలో నటిస్తోంది.
అనుష్క శెట్టి
తెలుగులోని టాప్ హీరోయిన్స్ జాబితాలో అనుష్క శెట్టి కచ్చితంగా ఉంటుంది. అరుంధతి, రుద్రమ దేవి, బాహుబలి 1, 2 సినిమాల ద్వారా ఈ భామ క్రేజ్ అమాంతం పెరిగింది. అనుష్క కూడా ఒక్కో సినిమాకు రూ. 6 కోట్ల వరకూ డిమాండ్ చేస్తుందట. అనుష్క రీసెంట్ మూవీ ‘Ms.శెట్టి Mr. పొలిశెట్టి’ విడుదలకు సిద్ధంగా ఉంది.
రకూల్ ప్రీత్ సింగ్
రకూల్ ప్రీత్ సింగ్ కూడా ఒక్కో సినిమాకు రూ. 3-5 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో తెలుగులో వరుసగా సినిమాలు చేసిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్‌పై తన ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది. రకూల్ తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది.
తమన్నా భాటియా
మిల్కీ బ్యూటి తమన్న రీసెంట్‌గా F2 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ భామ సైతం సినిమాకు రూ. 4 – 5 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు టాక్.
రష్మిక మందన్న
ప్రస్తుతం సినిమాల పరంగా రష్మిక ఎంతో దూకుడుగా ఉంది. చకా చకా సినిమాలు చేసేస్తూ కథానాయికలకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ భామ కూడా ఒక్కో సినిమాకు రూ. 4 – 5 కోట్లు డిమాండ్ చేస్తోంది.
కాజల్ అగర్వాల్
పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ కొంత కాలం సినిమాకు గ్యాప్ ఇచ్చింది. ఒక బిడ్డకు జన్మించిన కాజల్ తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ భామ రూ. 2 – 4 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ వసూలు చేస్తోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!