HEROS WIFES : టాలీవుడ్ హీరోల భార్యలుగానే కాదు… ఈ నారీమణులకు వారికంటూ ఓ గుర్తింపు ఉంది !
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HEROS WIFES : టాలీవుడ్ హీరోల భార్యలుగానే కాదు… ఈ నారీమణులకు వారికంటూ ఓ గుర్తింపు ఉంది !

    HEROS WIFES : టాలీవుడ్ హీరోల భార్యలుగానే కాదు… ఈ నారీమణులకు వారికంటూ ఓ గుర్తింపు ఉంది !

    April 18, 2023

    టాలీవుడ్‌ టాప్ హీరోల భార్యలు చాలామంది సుపరిచితమే. కథానాయికల భార్యలుగా కాకుండా వారికంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన వాళ్లు ఉన్నారు. వ్యాపారంతో సహా వివిధ వృత్తుల్లో రాణిస్తున్నారు. వాళ్లేవరూ? ఏ పనులు చేస్తున్నారో తెలుసుకోండి. 

    అల్లు స్నేహా రెడ్డి

    అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తన తండ్రి కళాశాలలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. SIT ప్లేస్‌మెంట్‌ సెల్ డైరెక్టర్‌గా ఉంది స్నేహా. అంతేకాదు, యువతను ప్రోత్సహించే దిశగా తీసుకువచ్చిన కాలేజీ మ్యాగజైన్‌కు చీఫ్ ఎడిటర్‌గాను సేవలందిస్తోంది. కళాశాలకు సంబంధించిన ప్రతి ఈవెంట్‌లో ఉత్సాహంగా పాల్గొంటుంది స్నేహా రెడ్డి. ప్రస్తుతం ఫ్యాషన్ రంగంలోనూ మెళకువలు సాధించింది. ఓ మళయాలం చిత్రంలోనూ నటిస్తుందని టాక్. 

    ఉపాసన కొణిదెల

    మెగాస్టార్‌ కోడలిగా మెగా పవర్‌ స్టార్‌కు రామ్ చరణ్‌కు భార్య అయినప్పటికీ ఉపాసన తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. URLIFE అనే వెల్‌నెస్‌ సంస్థను స్థాపించడంతో పాటు అపోలో ఆస్పత్రికి వైస్‌ ఛైర్‌పర్సన్‌గాను కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు ఉప్సీ. జంతు సంరక్షురాలిగానూ ఆమె సేవలందిస్తున్నారు. 

    ప్రణతి

    జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి వ్యాపారవేత్త కుమార్తె. వివాహం చేసుకున్న తర్వాత గృహిణిగానే ఉంటున్నారు. అయితే.. కొన్ని వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నట్లు చెబుతున్నారు.

    నమ్రతా షిరోద్కర్‌

    మహేశ్‌ బాబు భార్య నమ్రతా షిరోద్కర్‌ ఓ బాలీవుడ్ నటి. సినిమాల్లోకి రాకముందు మోడల్‌గాను గుర్తింపు పొందారు. తెలుగులో వంశీ, అంజి వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా చేశారు. వివాహం తర్వాత సినిమాలకు దూరమైనప్పటికీ తర్వాత మహేశ్‌ బాబు చేపడుతున్న సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నమ్రతా. మహేశ్‌ దత్తత తీసుకున్న ఊర్లను దగ్గరుండి బాగు చేయించారు. వివిధ ఆర్థిక వ్యవహారాలను కూడా చూసుకుంటున్నారు. 

    అంజనా

    నాని భార్య అంజనా గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అంజనాని నాని పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో వాళ్లని ఒప్పించడానికి దాదాపు 5 ఏళ్లు ఆగారు. పెళ్లి తర్వాత ఆమె ఇంట్లోనే ఉంటున్నారు. కొన్ని వ్యాపారాలను చూసుకుంటున్నారని తెలుస్తోంది. 

    జ్యోతిక

    జ్యోతిక సినిమాల్లో హీరోయిన్‌గా చేశారు. సూర్యను వివాహం చేసుకున్న తర్వాత కొన్నిరోజులు దూరమైనప్పటికీ తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు జ్యోతిక.

    అమల

    హీరోయిన్ అమల ప్రస్తుతం సినిమాల్లో పాత్రలు పోషిస్తూనే NGOకి కో- ఫౌండర్‌గా ఉన్నారు. ది బ్లూ క్రాస్‌ హైదరాబాద్‌ ఎన్జీవోకి సేవలందిస్తున్నారు. జంతువుల సంరక్షణ కోసం చాలాకాలంగా కృషి చేస్తున్నారు అమల.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version