భారత్‌లో ఐపీఎల్ మేనియా ప్రారంభమైంది. IPLలోని 10 జట్లు తమ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో క్రికెట్ ప్రియులను అలరిస్తున్నాయి. అయితే ఈ సీజన్‌లో పలువురు తెలుగు ఆటగాళ్లు కూడా సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నారు. ఐపీఎల్‌లో రాణించి టీమ్‌ఇండియా తలుపు తట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరు?. వారు ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు? గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అంబటి రాయుడు
ఐపీఎల్‌లో దిగ్గజ తెలుగు బ్యాటర్ అంటే ముందుగా అంబటి రాయుడే గుర్తుకు వస్తాడు. తన ధనాధన్ పర్‌ఫార్మెన్స్‌తో రాయుడు తమ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. 2010లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అంబటి.. ముంబయి ఫ్రాంచైజీ తరపున అత్యధిక సీజన్లు ఆడాడు. ప్రస్తుతం CSK ప్రాతినిథ్యం వహిస్తున్న రాయుడు.. క్రితం మ్యాచ్‌లో 27(14) పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మహ్మద్ సిరాజ్
హైదరాబాది పేసర్ మహ్మద్ సిరాజ్ ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసి టీమ్‌ఇండియా తలుపు తట్టాడు. ప్రస్తుతం టీమ్‌ఇండియా ప్రధాన బౌలర్లలో ఒకటిగా కొనసాగుస్తున్నాడు. RCB జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరాజ్ ఆ జట్టు కీలక బౌలర్‌గా ఎదిగాడు. కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ RCB విజయాల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు.
తిలక్‌వర్మ
హైదరాబాద్‌కు చెందిన తిలక్‌వర్మ ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తూ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ జట్టుకు తిలక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2022 వేలంలో తిలక్‌ను ముంబయి ఫ్రాంచైజీ రూ. 1.7 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో తిలక్ అద్భుతంగా రాణించడంతో అతడ్ని ముంబయి రిటైన్ చేసుకుంది. RCBతో జరిగిన తొలి మ్యాచ్‌లో తిలక్ 84 (46) పరుగులు చేసి సత్తా చాటాడు.
KS. భరత్
ఏపీలోని రామచంద్రాపురానికి చెందిన KS. భరత్‌ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. గత సీజన్‌లో RCB తరపున రాణించిన ఈ యంగ్ వికెట్‌కీపర్‌ను రూ. 1.2 కోట్లకు GT దక్కించుకుంది. అయితే గుజరాత్ ఆడిన తొలి రెండు మ్యాచుల్లో భరత్‌కు అవకాశం దక్కలేదు. మరోవైపు ఈ ఏడాది కేఎస్ భరత్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భరత్.. వికెట్ కీపర్‌గా రాణించాడు.
షేక్ రషీద్
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరానికి చెందిన షేక్ రషీద్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. రూ.20 లక్షలకు దక్కించుకుంది. అండర్-19 ప్రపంచకప్-2022 గెలిచిన భారత జట్టులో షేక్ రషీద్ కూడా ఉన్నాడు. రషీద్ తన బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం చెన్నై తరపున బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తే తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని రషీద్ ఉవ్విళ్లూరుతున్నాడు.
నితీష్ కుమార్
వైజాగ్‌కు చెందిన నితీశ్ కుమార్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ. 20 లక్షలకు ఈ యువ ఆటగాడ్ని సొంతం చేసుకుంది. నితీష్ ఆంధ్ర కిక్రెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మంచి ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. దీంతో ఈ ఏడాది SRH జట్టు ద్వారా నితీష్ ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. ‘మనవాడు వచ్చాడోయ్ జరుగు జరుగు’ అంటూ అప్పట్లో సన్‌రైజర్స్ చేసిన ట్విట్ అందరిని ఆకట్టుకుంది.
భగత్ వర్మ
హైదరాబాది క్రికెటర్ భగత్‌వర్మను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. 2023 ఐపీఎల్ వేలంలో రూ. 20 లక్షలు వెచ్చించి తమ గూటిలో చేర్చుకుంది. భగత్ బ్యాటింగ్ చేయడంతో పాటు స్పిన్ బౌలింగ్ వేయగలడు. హైదరాబాద్ క్రికెట్ జట్టులో మంచి ఆల్‌రౌండర్‌గా భగత్ వర్మకు పేరుంది. ఈ నేపథ్యంలోనే CSK జట్టు భగత్‌ను కొనుగోలు చేసింది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం